Stock Market News Today in Telugu: మకర సంక్రాంతి రోజున భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఇన్వెస్టర్లు మహా సంతోషంగా ఉన్నారు. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లలో గత ట్రేడింగ్‌ సెషన్‌లో (శుక్రవారం, 12 జనవరి 2024) వినిపించిన బుల్‌ రంకె, ఈ రోజు (సోమవారం, 15 జనవరి 2024) కూడా ప్రతిధ్వనించింది. స్టాక్ మార్కెట్ సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని (Stock markets at all-time highs) అధిరోహించింది. BSE సెన్సెక్స్ మొదటిసారి 73,000 మార్క్‌ దాటింది. NSE నిఫ్టీ కూడా తొలిసారి 22,000 మైలురాయి దాటి జీవితకాల గరిష్టానికి చేరుకుంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో 72,568 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 481.41 పాయింట్లు లేదా 0.66 శాతం భారీ లాభంతో 73,049 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 21,895 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 158.60 పాయింట్లు లేదా 0.72 శాతం బలమైన పెరుగుదలతో 22,053 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


బ్రాడర్‌ మార్కెట్‌ కూడా బలంగా ఉంది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ తలో 0.6 శాతం పెరిగాయి.


మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో.. 3,155 షేర్లు ట్రేడ్‌ అవుతుండగా, వీటిలో 2,282 షేర్లు లాభాలను, 765 షేర్లు క్షీణతను చవిచూశాయి. 108 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి. 


సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో... 25 స్టాక్స్‌ లాభపడగా, 5 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... విప్రో 11.46 శాతం, టెక్‌ మహీంద్ర 6.26 శాతం లాభపడ్డాయి. HCL టెక్ 3.69 శాతం, ఇన్ఫోసిస్ 3.01 శాతం వృద్ధిలో ఉన్నాయి. TCS 2.03 శాతం, HDFC బ్యాంక్ 1.41 శాతం ర్యాలీ చేశాయి. టాప్‌ లూజర్స్‌లో... ఏషియన్ పెయింట్స్, నెస్లే, HUL, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.


నిఫ్టీ చిత్రం
ఐటీ స్టాక్స్‌లో రికార్డు గరిష్టాలు కనిపిస్తున్నాయి, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3 శాతానికి పైగా జంప్‌ చేసి 37,550 స్థాయి పైకి చేరింది. రియాల్టీ, PSU బ్యాంక్ సూచీలు 1 శాతానికి పైగా పెరిగాయి. ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌ పడిపోయాయి.


ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 466.76 పాయింట్లు లేదా 0.64% పెరిగి 73,035.21 దగ్గర; NSE నిఫ్టీ 109 పాయింట్లు లేదా 0.50% పెరిగి 22,003.55 వద్ద ట్రేడవుతున్నాయి. ఆ సమయానికి, 73,288.78 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ ఆల్‌ టైమ్‌ హైని ‍(Sensex fresh all-time high) సృష్టించగా; 22,081.95 వద్ద నిఫ్టీ కొత్త జీవితకాల గరిష్టాన్ని ‍(Sensex fresh all-time high) నమోదు చేసింది.


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
జపాన్‌కు చెందిన నికాయ్‌ మినహా చాలా ఆసియా మార్కెట్లు ఈ ఉదయం క్షీణించాయి. నికాయ్‌ 0.57 శాతం పెరిగింది. హాంగ్ సెంగ్ 0.8 శాతం పడిపోయింది. ASX 200, కోస్పి ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. శుక్రవారం, అమెరికన్‌ మార్కెట్లలో, డౌ జోన్స్ 0.31 శాతం తగ్గింది. S&P 500, టెక్‌ కంపెనీల సమాహారం నాస్‌డాక్ వరుసగా 0.08, 0.02 శాతం చొప్పున పెరిగాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: టాక్స్‌ కట్టక్కర్లేని ఆదాయాలు ఇవి, చాలామందికి ఈ రూల్స్‌ తెలీదు