Stock Market News Today in Telugu: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లలో ఈ రోజు (శుక్రవారం, 15 డిసెంబర్‌ 2023) కూడా లాభాల తుపాను కంటిన్యూ అవుతోంది. వచ్చే ఏడాది వడ్డీ రేట్లు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గొచ్చన్న ఫెడ్‌ చైర్‌ సూచన మార్కెట్‌కు మత్తెక్కించింది. దీంతో, అమెరికన్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు (గురువారం) కూడా లాభాల్లో ముగిశాయి. ఆ ట్రెండ్‌కు అనుగుణంగా, డొమెస్టిక్‌ ఈక్విటీలు శుక్రువారం కూడా రికార్డ్‌ స్థాయుల్లో (Stock markets at record levels) ఓపెన్‌ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త చారిత్రక స్థాయిలో ప్రారంభమైంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (గురువారం, 14 డిసెంబర్‌ 2023) 70,514 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 289.93 పాయింట్లు లేదా 0.41 శాతం పెరుగుదలతో 70,804 వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. ఆ తక్షణం  
70,853.56 స్థాయికి చేరింది. ఈ వార్త రాసే సమయానికి, ఇదే సెన్సెక్స్‌ కొత్త జీవిత కాల గరిష్టం ‍(Sensex fresh all-time high).


గత సెషన్‌లో 21,183 దగ్గర ఆగిన NSE నిఫ్టీ,104.75 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో  21,287.45 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. ఆ వెంటనే 21,298.15 స్థాయికి వెళ్లింది. ఈ వార్త రాసే సమయానికి, ఇదే నిఫ్టీ కొత్త లైఫ్‌ టైమ్‌ హై (Nifty fresh all-time high). 


సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 24 స్టాక్స్‌ లాభాల్లో, మిగిలిన 6 షేర్లు పతనం దిశలో ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్ గెయినర్స్‌లో JSW స్టీల్ 1.76 శాతం, ఇన్ఫోసిస్ 1.67 శాతం పెరిగాయి.


నిఫ్టీ చిత్రం
నిఫ్టీ 50 ప్యాక్‌లో... 40 స్టాక్స్‌ అప్‌ట్రెండ్‌లో, మిగిలిన 10 షేర్లలో డౌన్‌ట్రెండ్‌ కనిపించింది. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో... హిందాల్కో (2.6 శాతం జంప్‌), ఇన్ఫోసిస్, JSW స్టీల్, టాటా స్టీల్, LTI మైండ్‌ట్రీ, ONGC, హీరో మోటోకార్ప్, UPL, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, HCL టెక్, స్టేట్‌ బ్యాంక్‌ (SBI) షేర్లు ఉన్నాయి. టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో... HDFC లైఫ్ (1.87 శాతం క్షీణత), యాక్సిస్ బ్యాంక్, BPCL, నెస్లే ఇండియా, SBI లైఫ్, భారతి ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్ చేరాయి.


నిఫ్టీ సెక్టోరియల్‌ ఇండెక్స్‌లు
నిఫ్టీ సెక్టార్లలో.... నిఫ్టీ ఐటీ, మీడియా, మెటల్ సూచీలు తలో 1 శాతం అప్‌సైడ్‌లో ఉన్నాయి. నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్‌ 0.5 శాతం లాభపడగా, నిఫ్టీ బ్యాంక్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ ఇండెక్స్‌లు 0.3 శాతం పెరిగాయి.


బ్రాడర్‌ మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ సూచీలు వరుసగా 0.44 శాతం & 0.65 శాతం పెరిగాయి. 


ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌
ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లోనూ మార్కెట్‌లో బలమైన వృద్ధి కనిపించింది. సెన్సెక్స్ 292.87 పాయింట్లు లేదా 0.42 శాతం పెరుగుదలతో 70,807 స్థాయి వద్ద ఉంది. నిఫ్టీ 104.75 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 21,287 వద్ద ట్రేడయింది. 


ఈ రోజు ఉదయం 9.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 238.93 పాయింట్లు లేదా 0.34% పెరిగి 70,753.13 దగ్గర; NSE నిఫ్టీ 77.25 పాయింట్లు లేదా 0.36% పెరిగి 21,259.95 వద్ద ట్రేడవుతున్నాయి.


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
ఫెడ్‌ కామెంటరీ తర్వాత బుధవారం రికార్డ్‌ స్థాయులకు చేరిన యూఎస్‌ మార్కెట్‌, గురువారం కూడా ఆ లాభాలను కొనసాగించింది. ఓవర్‌నైట్‌లో, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.43 శాతం, ఎస్&పి 500 0.26 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.19 శాతం పెరిగాయి. 10 సంవత్సరాల బెంచ్‌మార్క్‌ ట్రెజరీ ఈల్డ్స్‌, ఆగస్టు తర్వాత మొదటిసారిగా 4 శాతం దిగువకు పడిపోయింది. పెరిగిన ఆసియా మార్కెట్లలో.. బిజినెస్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో ASX 200, నికాయ్‌, కోస్పి, హ్యాంగ్ సెంగ్ 0.9 శాతం నుంచి 1.27 శాతం వరకు పెరిగాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి