Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 14 మే 2024) మిశ్రమంగా ప్రారంభమయ్యాయి, గ్లోబల్ మార్కెట్ల నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడంతో స్థబ్దుగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 73,000 మార్క్‌ను టచ్ చేసి వెనక్కు వచ్చింది. నిఫ్టీ 22,150 మార్క్ దిగువన ఉంది. బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా ఊపు లేదు. ఓపెనింగ్ టైమ్‌లో, ఐటీ షేర్ల నుంచి మార్కెట్‌కు మద్దతు లభించింది.
ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (సోమవారం) 72,776 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 79.41 పాయింట్లు లేదా 0.11 శాతం క్షీణతతో 72,696.72 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 22,104 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 8.85 పాయింట్ల స్వల్ప లాభంతో 22,112.90 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో... BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.92 శాతం చొప్పున పెరిగాయి.
మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 21 షేర్లు లాభపడగా, 09 షేర్లు క్షీణించాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో... JSW స్టీల్ ముందంజలో ఉంది, 1.79 శాతం పెరిగింది. పవర్‌గ్రిడ్, NTPC, రిలయన్స్ ఇండస్ట్రీస్, M&M, టాటా స్టీల్, మారుతి సుజుకి, SBI షేర్లు కూడా జోరుగా ట్రేడవుతున్నాయి. మరోవైపు.. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, TCS, HDFC బ్యాంక్, ITC షేర్లు నీరుగారాయి.
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ PSU బ్యాంక్ 1 శాతం పెరిగింది. మెటల్, రియాల్టీ సూచీలు కూడా తలో 0.8 శాతం చొప్పున లాభపడ్డాయి. చాలా సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. FMCG, ఫార్మా స్టాక్స్ నష్టపోయాయి.
బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ (BSE Market Capitalisation) రూ. 399.16 లక్షల కోట్లకు చేరుకుంది. వార్త రాసే సమయానికి బీఎస్‌ఈలో 3,036 షేర్లు ట్రేడ్ అవుతుండగా, అందులో 2,175 షేర్లు లాభాల్లో & 738 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 123 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 117 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 52 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ఉన్నాయి.
ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఆర్కియన్ కెమికల్, AIA ఇంజినీరింగ్, ఆంధ్ర పేపర్, అపార్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, ఆరియన్‌ప్రో సొల్యూషన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, BASF ఇండియా, భారతి ఎయిర్‌టెల్, భారతి హెక్సాకామ్, BLS ఇంటర్నేషనల్, బటర్‌ఫ్లై గాంధీమతి, కోల్గేట్ పామోలివ్, దేవయాని ఇంటర్నేషనల్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్, HP అడెసివ్స్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, జూబిలెంట్ ఇంగ్రేవియా, కిర్లోస్కర్ బ్రదర్స్,
మన్ ఇన్‌ఫ్రాకన్‌స్ట్రక్షన్, మిర్కో ఎలక్ట్రానిక్స్, ఒబెరాయ్ రియాల్టీ, ఆన్‌మొబైల్ గ్లోబల్, పతంజలి ఫుడ్స్, PVR ఐనాక్స్, రాడికో ఖైతాన్, శ్రీ సిమెంట్, సిమెన్స్, థైరోకేర్ టెక్నాలజీస్, జైడస్ వెల్నెస్.
ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 133.50 పాయింట్లు లేదా 0.18% పెరిగి 72,909.63 దగ్గర; NSE 37.10 పాయింట్లు లేదా 0.17% పెరిగి 22,141.15 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం, హాంగ్ సెంగ్ 0.9 శాతం, షాంఘై కాంపోజిట్ 0.24 శాతం, నికాయ్ 0.01 శాతం పెరిగాయి. కోస్పి, ASX200 ఇండెక్స్ 0.2 శాతం వరకు తగ్గాయి.
అమెరికన్ మార్కెట్లలో, సోమవారం, డౌ జోన్స్ 0.21 శాతం పడిపోయింది, S&P 500 0.02 శాతం తగ్గింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.29 శాతం పెరిగింది.
అమెరికన్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.5% కంటే దిగువన, 4.487% వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు కొద్దిగా పెరిగాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83 పైన కదులుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు ఔన్సుకు $2,347 డాలర్లకు పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి