Jagadhatri  Serial Today Episode : వైజయంతి, నిషికలు వెళ్లి స్కూటీ దాచిపెట్టి సురేష్‌ వెళ్లిపోయాడని కౌషికికి చెప్తారు. దీంతో కౌషికి కోపంగా వెళ్లిపోతుంది. ఇంతలో లోపలి నుంచి వచ్చిన సురేష్‌కు కూడా నువ్వంటే ఇష్టం లేదు కాబట్టే  కౌషికి వెళ్లిపోయింది అని చెప్పగానే సురేష్‌ ఫీలవుతాడు. ఇంతలో ధాత్రి, కేదార్‌ వచ్చి ఏమైందని అడిగితే సురేష్‌ కోపంగా నేనంటే కౌషికికి ఇష్టం ‌ప్రేమ ఉంది అంటావు. కానీ కలిసి ఉండాల్సిన వాళ్లు చేసే పనులేనా ఇవి అంటూ ప్రశ్నిస్తాడు.


ధాత్రి: అయ్యో అది కాదు అన్నయ్యా నేను ఏం చెప్తున్నాను అంటే..


సురేష్‌: వద్దు జగధాత్రి ఇంకేం చెప్పకు.. ప్రేమ లేని మా పెళ్లిని గెలిపించడానికి నువ్వు కష్టపడటం మానెయ్‌. అయినా కౌషికి గురించి తెలిసి కూడా మారుతుందని ఆశపడ్డాను చూడా అది నా తప్పు..


కేదార్‌: బావ ఒక్కసారి అక్క వెళ్లిపోవడానికి కారణం ఎంటో విను.


సురేష్‌: ఆమెకు నేను కారులో ఎక్కడమే ఇష్టం లేదు. అందుకే వదిలేసి వెళ్లిపోయింది. అయినా వదిలేసి వెళ్లిపోవడం ఆమెకు అలవాటే..


ధాత్రి: అన్నయ్యా నువ్వు స్కూటీలో వెళ్లిపోయావనుకుని వదిన కూడా వెళ్లిపోయింది.


అనగానే సురేష్‌ నా స్కూటీ ఇక్కడే ఉంటే ఎలా వెళ్లిపోతాను. అంటూ స్కూటీ చూడగానే అక్కడ స్కూటీ ఉండదు. దీంతో సురేష్‌ షాక్‌ అవుతాడు. నా స్కూటీ ఎక్కడకు పోయిందని అంటాడు. ఇంతలో ధాత్రి, కౌషికికి ఫోన్‌ చేసి సురేష్‌ ఇంట్లోనే ఉన్నారని చెప్పగానే కౌషికి తిరిగి ఇంటికి వస్తుంది. కౌషికి రాగానే వైజయంతి, నిషిక కంగారుపడతారు. ఇంతలో స్కూటీ ఎక్కడుందో వెతకాలని ధాత్రి చెప్పగానే నిషిక అడ్డుపడుతుంది. దీంతో కౌషికి, నిషికను తిడుతుంది. దాత్రి కేదార్‌ వెళ్లి బండిని వెతికి అందరినీ అక్కడకు తీసుకెళ్తారు.


ధాత్రి: ఇంటి ముందు పార్క్‌ చేసిన స్కూటీ ఇక్కడ దాచిపెట్టి ఉందంటే ఇదెవరో కచ్చితంగా కావాలని చేసిన పనే.


కౌషికి: ఎవరు ఈ పని చేసింది.. ఎవరు? ఈయన బండి కావాలని దాచిపెట్టారంటే ఏం చేద్దామనుకున్నారు. ఎవరి మధ్య మనస్పర్థలు పెంచుదామనుకుంటున్నారు. చెప్పండి. ఎవరు దాచారు.    


  అని గట్టిగా అడగ్గానే లోపలి నుంచి కీర్తి వచ్చి ఇక్కడ స్కూటీ ఎవరు పెట్టారో తాను చూశానని సైగ చేస్తుంది. ఎవరు పెట్టారని కౌషికి అడగ్గానే బూచి పెట్టాడని చూపిస్తుంది. దీంతో కౌషికి కోపంగా బూచి దగ్గరకు వచ్చి కాచి చెంప పగులగొట్టి బూచికి వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో వైజయంతి కౌషికిని తిడుతుంది. ఇంటి అల్లుణ్ని అలా మాట్లాడటం కరెక్టు కాదంటుంది. ధాత్రిని కూడా తిడుతుంది. నిషిక కూడా ధాత్రిని తిట్టి వెళ్లిపోతుంది. దీంతో కౌషికి ధాత్రికి సారీ చెప్తుంది. మేము ఆఫీసుకు వెళ్తున్నాం ఇక మీరు ఎంగేజ్‌మెంట్‌కు రెడీగా ఉండండి అని చెప్పడంతో ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటే.. ధాత్రి, కేదార్‌ భోజనానికి రాలేదని కౌషికి అడుగుతుంది. ఇంతలో ధాత్రి ఒక్కతే కిందకు వస్తుంది. కేదార్‌ రాలేదని అడుగుతుంది కౌషికి.


ధాత్రి: ఈవెనింగ్‌ నుంచి ఫీవర్‌ ఉంది. బాడీ పెయిన్స్‌ తో అల్లాడిపోతున్నాడు.


వైజయంతి: జ్వరమా? ఉన్నట్టుండి ఈ జ్వరమేంది అమ్మీ..


నిషిక: మాయదారి దొంగ జ్వరమేమో అత్తయ్యా..


వైజయంతి: నువ్వు ఆగు నిషి నువ్వు చెప్పి అమ్మి.


ధాత్రి: అదే తెలియట్లేదు అత్తయ్యగారు.


కౌషికి: ముందే చెప్పి ఉండొచ్చు కదా జగధాత్రి డాక్టర్‌ ను పిలిపించి ఉండేదాన్ని కదా.. ఇప్పుడే పిలుస్తాను ఉండు.


అనగానే ఏమీ వద్దని కేదార్‌కు అప్పుడప్పుడు ఇలా జ్వరం వస్తుందని ధాత్రి చెప్తుంది. రేపు ఎంగేజ్‌మెంట్‌ అని ధాత్రి అనగానే నిషిక కోపంగా ధాత్రిని తిడుతుంది. మీ అమ్మ క్రిమినల్‌ నువ్వు కూడా అలాగే ఎన్ని నాటకాలు ఆడుతున్నావు. ఎంగేజ్‌మెంట్‌ ఉందని సాయంత్రం వరకు బాగున్న కేదార్‌కు జ్వరం వచ్చిందని నాటకాలు అడుతున్నావా? అంటుంది. కౌషికి కూడా కేదార్‌కు జ్వరం నిజంగా వచ్చిందా? అని అడగ్గానే ధాత్రి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   


ALSO READ: పాయల్ రూటు మార్చిందిగా... ఈసారి పవర్‌ఫుల్ రోల్‌లో...