Stock Market News Today in Telugu: గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు అందుకుని, ఈ రోజు (గురువారం, 11 జనవరి 2024) హయ్యర్‌ సైడ్‌లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు, అదే ఊపును కొనసాగించలేకపోయాయి. పట్టు దొరక్క, సెన్సెక్స్ & నిఫ్టీ నిమిషాల వ్యవధిలోనే కీలక స్థాయులను కోల్పోయాయి.


ఈ రోజు నుంచి Q3 FY24 ఫలితాల సీజన్‌ ప్రారంభం అవుతుంది. మేజర్‌ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ సహా GTPL హాత్‌వే, 5పైసా, HDFC AMC ఈ రోజు డిసెంబర్‌ త్రైమాసికం నంబర్లను ప్రకటిస్తాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ రిపోర్ట్‌ కార్డులు ఈ రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత బయటకు వస్తాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (బుధవారం) 71,658 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 250 పాయింట్లు లేదా 0.35 శాతం పెరుగుదలతో 71,907 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. నిన్న 21,619 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 69.30 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 21,688 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. ఆ వెంటనే, కీలకమైన 21,700 స్థాయిని కోల్పోయింది.


బ్రాడర్‌ ఇండెక్స్‌లు ఈ రోజు గ్రీన్‌ కలర్‌లోకి మారాయి. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ తలో 0.6 శాతం పెరిగాయి.


మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, 2,289 షేర్లు లాభాల్లో ఉండగా, 865 షేర్లు క్షీణించాయి. 217 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 65 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి.


BSEలో లిస్ట్‌ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Market Capitalization of BSE Listed Companies) రూ.370.47 లక్షల కోట్లకు పెరిగింది. బుధవారం మార్కెట్‌ ముగింపు సమయానికి మొత్తం మార్కెట్ క్యాప్ రూ.368.77 లక్షల కోట్లుగా ఉంది.


సెన్సెక్స్ & నిఫ్టీ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో... 24 స్టాక్స్‌ లాభపడగా, 6 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... యాక్సిస్ బ్యాంక్ 1.50 శాతంతో టాప్‌ ప్లేస్‌లో ఉంది. బజాజ్ ఫిన్‌సర్వ్ 1.20 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.97 శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీ50 ప్యాక్‌లో... 38 స్టాక్స్ లాభపడగా, 12 స్టాక్స్ క్షీణించాయి. 


ఉదయం 10 గంటలకు బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి
బ్యాంక్ షేర్ల జోరు పెరగడం వల్ల బ్యాంక్ నిఫ్టీ పుంజుకుంది. ఈ ఇండెక్స్‌లోని 12 స్టాక్స్‌లో 11 షేర్లు పెరిగాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ఉన్నాయి. ఇవి 1.31 శాతం నుంచి 2.50 శాతం వరకు పెరిగాయి.


ఈ రోజు ఉదయం 10.30 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 128.47 పాయింట్లు లేదా 0.18% పెరిగి 71,786.18 దగ్గర; NSE నిఫ్టీ 42.15 పాయింట్లు లేదా 0.19% పెరిగి 21,660.85 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
యూఎస్‌ డిసెంబర్‌ నెల ఇన్‌ఫ్లేషన్‌ డేటా ఈ రోజు వెలువడుతుంది. ఈ నేపథ్యంలో, నిన్న, US మార్కెట్లు 0.8 శాతం వరకు లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్‌, S&P 500 వరుసగా 0.45 శాతం, 0.57 శాతం పెరిగాయి, నాస్‌డాక్ కాంపోజిట్ 0.75 శాతం లాభపడింది. 


అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభిస్తే, అది తొందరపాటు చర్య అవుతుందని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ విలియమ్స్‌ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. బిట్‌కాయిన్‌ను ట్రాక్ చేయడానికి US-లిస్టెడ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు (ETFలు) US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


ఆసియా స్టాక్స్‌ కూడా ఈ రోజు లాభాల బాటలో నడుస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ అల్ట్రా-లూజ్ విధానాలు ముగుస్తాయన్న పెట్టుబడిదార్ల అంచనాల మధ్య, నికాయ్‌ ఈ ఉదయం 2 శాతం ఎగబాకి 34 సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది.  ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా కోప్సీ 0.46 శాతం వరకు పెరిగాయి. హ్యాంగ్ సెంగ్ 0.7 శాతం ర్యాలీ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి