Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కేదార్ వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే యువరాజ్ చూస్తాడు. వీళ్లు పోలీసులు అవునా కాదా అని అనుమాన పడతాడు ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


ధాత్రి దంపతులు: ఇప్పటికైతే తప్పించుకున్నాం కానీ తర్వాత అయినా మనం దొరికిపోతాం అందుకే సాక్షాధారాలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటూ కౌషికి దగ్గరికి వచ్చి పని ఉంది బయటకు వెళ్తాము అంటారు.


అప్పటికే అక్కడ పంతులుగారు ముహూర్తం పెడుతూ ఉంటారు.


కౌషికి : నీకోసమే ఈ ముహూర్తాలు పెట్టిస్తున్నాను అలాంటిది మీరు బయటకు వెళ్లడం ఏమిటి అని అడుగుతుంది.


మాకు ఎందుకు ముహూర్తాలు అని అయోమయంగా అడుగుతారు ధాత్రి దంపతులు.


కౌషికి: మీ పెళ్లి కోసమే ఈ ముహూర్తాలు పెట్టిస్తున్నాను అనటంతో ధాత్రి దంపతులతో పాటు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.


ధాత్రి: మాకు పెళ్లయింది కదా మళ్ళీ పెళ్లేంటి అని అడుగుతుంది.


కౌషికి: మీ పెళ్లి మేము ఎవరం చూడలేదు కదా అందుకే అందరూ చూస్తుండగా గ్రాండ్గా మళ్లీ పెళ్లి చేస్తాను అంటుంది.


నిషిక: కోపంతో రగిలిపోతుంది. ఇంటికి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ కోసం లక్షల ఖర్చు పెట్టి పెళ్లి చేయటం ఏమిటి ఉమ్మడి ఆస్తిలో ఖర్చు పెట్టడానికి మీకేంటి హక్కు అని అడుగుతుంది.


ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది కౌషికి.


సుధాకర్: ఏంటమ్మా ఆ మాటలు ఈ ఇంటి ఆస్తిలో నీది నాది అని భాగాలు లేవు అలా మాట్లాడొద్దు అంటూ కోడల్ని మందలిస్తాడు.


వైజయంతి: అడగనివ్వండి, లేకపోతే పంచుకోవడానికి భాగాలే ఉండవు అంటుంది.


ఆ మాటలకి కౌశికి కృంగిపోతుంది, పిన్ని నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదా నేను ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేశాను అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది.


ధాత్రి : ఇంత గొడవతో మా పెళ్లి ఎందుకు వదిన అంటుంది.


కౌషికి : ఈ గొడవ అడ్డుపెట్టుకొని పెళ్లి తప్పించుకుందామనుకుంటుంది అలాగే జరగనివ్వను అనుకొని ఈ పెళ్లి నేను చేస్తాను నా డబ్బులతో చేస్తాను అంటుంది.


నిషిక: మీ సొంత సంపాదనతో మీరు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అంటుంది.


కౌషికి : ఈ ఇంట్లో నీది నాది అనే మాటలు రాకూడదు అనుకునేదాన్ని అలాంటిది నా నోటి నుంచి ఆ మాటలు వచ్చేలాగా చేసావు నేను ఎప్పటికీ మర్చిపోను, ఇంటిలో ఆఖరికి నేనే పరాయి దాన్ని అయిపోయాను అని కన్నీరు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


మిగిలిన కుటుంబ సభ్యులందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అది చూసిన ధాత్రి దంపతులు బాధపడతారు. వదినని అందరూ డబ్బు సంపాదించే మిషన్ లాగే చూస్తున్నారు కానీ ఆమె ప్రేమను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని బాధపడతారు.


బాధపడుతున్న కౌషికి దగ్గరికి వచ్చి సుధాకర్ ఓదార్చుతాడు.


కౌషికి: నిషిక అంటే బయట నుంచి వచ్చింది కానీ పిన్ని కూడా అలా మాట్లాడిందంటే భరించలేకపోతున్నాను ఈ ఇంట్లో వాళ్ళ మనసులో నాకు ఏమాత్రం స్థానం ఉందో అర్థమైంది అంటుంది.


సుధాకర్: నిషిక బాధని చూడలేక మీ పిన్ని అలా అంది.ఆ సంగతి వదిలేయ్ కానీ ఎందుకు వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నావు నాకు కూడా అర్థం కాలేదు అంటాడు.


కౌషికి : వాళ్లకి పెళ్లి కాలేదేమో అని నా డౌట్ బాబాయ్. వాళ్లకి పెళ్లి చేస్తానంటే భయపడి నిజం ఒప్పుకుంటారని అలా అన్నాను అంటుంది.


సుధాకర్: ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు నా సపోర్ట్ ఎప్పటికీ నీకే అంటాడు.


నిషిక : ఈ మాటలు అన్ని వింటుంది నిషిక. కౌషికి కి సపోర్ట్ చేస్తున్న మామగారిని తిట్టుకుంటుంది.


మరోవైపు పెళ్లి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచనలో పడతారు ధాత్రి దంపతులు. మరోవైపు యువరాజ్ కేదార్ వాళ్లు పోలీసులేమో అని ఆలోచనలో పడతాడు. అప్పుడే అతని దగ్గరికి వచ్చి కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది కీర్తి. యువరాజ్ మనసులో ఏదో ఐడియా వస్తుంది కీర్తి తో మనిద్దరం దాగుడుమూతలు ఆడుకుందామా అని సైగల ద్వారా అడుగుతాడు. అందుకు ఒప్పుకున్న కీర్తి దాక్కోటానికి వెళ్తుంది. ఆమెని ఫాలో అవుతాడు యువరాజ్. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.