Krishna Mukunda Murari Today Episode: మురారి తన గదిలో కృష్ణ ఫొటోలు చూస్తూ ఇక మనకు ఏ ఇబ్బంది లేదు తింగరి. నువ్వు చెప్పినట్లు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చుట్టేద్దామని అనుకుంటాడు. ఇంతలో అక్కడికి కృష్ణ కాఫీ పట్టుకొని వస్తుంది. మురారి కృష్ణతో ఇంకా ఆ ఫ్లాస్క్‌, కప్పు వదలవా అని అంటాడు. తర్వాత ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా.. మురారి ముకుంద గురించి అడుగుతాడు. ఎందుకు తనని ఇంట్లో ఉంచాలి అనుకున్నావ్ అని అంటాడు. దానికి కృష్ణ పాపం ఏసీపీ సార్ ముకుందకు తాళి కట్టిన రోజే ఆదర్శ్ పారిపోయాడు. ప్రేమించిన మీరు దక్కలేదు అందుకే తన పరిస్థితి అర్థం చేసుకొని సపోర్ట్ చేశా అని కృష్ణ చెప్తుంది. ఆదర్శ్‌ని మనమే వెతికి తెచ్చి ముకుంద లైఫ్ సరిచేయాలి అంటుంది. 


మధు: గుడ్ మార్నింగ్ పెద్ద పెద్దమ్మ.
భవాని: ఏరా బిజినెస్‌ చూసుకోమంటే చూసుకోవు. పోనీ సినిమాలు చేయమంటే అదీ లేదు. ఇలా లేజీగా లేటుగా లేస్తావ్.
మధు: రేపట్నుంచి ఉదయం 5 కే లేచేస్తా పెద్దమ్మ.
భవాని: లేచి ఏం చేస్తావ్. 
నందూ: మళ్లీ పడుకొని నిద్రపోతావ్ కదా.. ఎందుకు అలా చూస్తావ్.. కృష్ణతో నువ్వు చేస్తున్న రీల్స్‌కి డబ్బులు వస్తున్నాయ్ తర్వాత ఏం చేస్తావ్. 
ముకుంద: గుడ్ మార్నింగ్ అత్తయ్య కాఫీ తీసుకోండి.
భవాని: మధు నువ్వు కాళీగా ఉండే పని అయితే మీ అత్తారింటికి ఇల్లరికంగా వెళ్లిపో అంతే కానీ ఇంట్లో ఎవరూ కాళీగా ఉండటానికి వీల్లేదు. 
మధు: కృష్ణ నువ్వెప్పుడు వచ్చావ్.
ముకుంద: మార్నింగే వచ్చింది మురారికి కాఫీ ఇవ్వడానికి. నేను చూశాను కృష్ణ. అప్పుడే పలకరించేదాన్ని కానీ మామూలుగా అందరూ ఏమనుకుంటారు. ఇష్టమైన వాళ్లని పలకరిస్తే చాలా బాగుంటుంది అనుకుంటారు కదా.. అందుకే నిన్ను చూసి కూడా నేను విష్ చేయలేదు. 
మధు: మనసులో.. నటిస్తుందా.. మారిందో అర్థం కాలేదే.. 
భవాని: ఎక్కడికి నాన్న ఉదయాన్నే.
మురారి: చిన్న పనులు ఉన్నాయి పెద్దమ్మ.
రేవతి: మనసులో.. ఇక కృష్ణ అవుట్ హౌస్‌లో ఎందుకు ఇక్కడే ఉంచమని అక్కకి చెప్తా. 
ముకుంద: భవాని కాళ్లు పట్టుకొని.. అత్తయ్య నాదో రిక్వెస్ట్ దయచేసి కాదు అనకండి. అత్తయ్య ప్లీజ్.. చేయని నేరానికి కృష్ణ ఇంట్లో నుంచి అవుట్ హౌస్‌లోకి మారింది. కృష్ణకి ఈ ఇంట్లో ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కావాలి అంటే నేను అవుట్ హౌస్‌లో ఉంటాను. 
రేవతి: మనసులో.. ఇదేంటిది నేను చెప్పాలి అని వస్తే ఈ ముకుంద నా మనసులో మాట చదివినట్లు చెప్పేసింది. అంటే నిజంగా మారిపోయిందా...
మురారి: అవును పెద్దమ్మ.. ముకుంద అన్నదాంట్లో నిజం ఉంది. ఇంక కృష్ణ అక్కడ ఉండాల్సిన అవసరం ఏం ఉంది. 
రేవతి: ఆ కృష్ణ ఏర్పాట్లు ఏవో నువ్వే చూడు. 
కృష్ణ: చాలా థ్యాంక్స్ పెద్దత్తయ్య.
భవాని: ఇదిగో ఉండమన్నాను అని తింగరి వేషాలు వేశావే అనుకో.. 
కృష్ణ: అస్సలు చేయను అత్తయ్య. ఇదిగో అత్తయ్యకు వంటలో హెల్ప్ చేస్తాను. హాస్పిటల్‌కి వెళ్లి వస్తాను. ఏసీపీ సార్ డ్యూటీ చేసి వస్తే.. అంటూ చెప్పబోతే భవాని అక్కడ ఉండదు. దీంతో మురారి హలో పెద్దమ్మ వెళ్లి చాలా సేపు అయింది. 


ఇక రేవతి అక్కయ్య కృష్ణని ఇంట్లోకి రానిచ్చింది కాబట్టి ఇక వాళ్ల శోభనం కూడా చేయించాలి అని అందుకు సంబంధించి శకుంతలతో మాట్లాడాలి అని అవుట్ హౌస్‌కు బయల్దేరుతుంది. ఇక అప్పుడే మధు వస్తాడు. ముకుంద నిజంగా మారిందా.. లేక తన అన్నలానే నటిస్తుందా అని రేవతిని అడుగుతాడు. రేవతి అయితే ముకుంద మారింది అనిపిస్తుంది అంటుంది. ఇక ఇద్దరూ శకుంతల దగ్గరకు వెళ్తారు. ఇక కృష్ణ, మురారిలు కూడా అక్కడే ఉంటారు. శకుంతలని తమ ఇంటికి రమ్మంటారు. శకుంతల తన భర్త వచ్చిన వరకు ఇక్కడే ఉంటాను అని తర్వాత తన ఊరు వెళ్లిపోతాను అంటుంది. 


కృష్ణ: చిన్నమ్మ నీ ఒక్కదాని కోసం ఈ ఇళ్లు అడిగితే బాగుండదు కదా..
ముకుంద: అప్పుడే వస్తూ.. అయితే నేను చిన్నమ్మ ఇక్కడే ఉంటాం..  సారీ చిన్నమ్మ. నేను చాలా పెద్ద తప్పు చేశాను. దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేశాను. నన్ను క్షమిస్తావా చిన్నమ్మ.
కృష్ణ: ముకుంద ఇక ఈ క్షమాపణల పర్వానికి తెరదించేయ్. మా చిన్నమ్మకు నీ మీద ఎలాంటి కోపం లేదు. సరేనా..
ముకుంద: కానీ నాకు నీ మీద కోపం ఉంది. మరి మా చిన్నమ్మ అంటావ్‌ ఏంటి మన చిన్నమ్మ అనాలి కదా..
రేవతి: అరేయ్ బయటకు వెళ్లాలి అన్నారు కదరా ఇక్కడే ఉన్నారా..
శకుంతల: వదినా నాది ఓ మాట వింటావా.. ఏం లేదు వదినా నేను ఇక్కడే ఉంటా. కిట్టమ్మ ఒక్కదాని కోసం ఇంత పెద్ద ఇళ్లు అడిగితే బాగోదు అంటుంది. 
రేవతి: దానికేం తెలుసు దాని మొఖం. నిక్షేపంగా ఇక్కడే ఉండొచ్చు. నిన్ను ఎవరు వద్దూ అంటారు చెప్పు.
ముకుంద: చిన్నమ్మతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను అత్తయ్య. 
కృష్ణ: వద్దు ముకుంద హ్యాపీగా బంగారం లాంటి రూం అక్కడ ఉండగా ఇక్కడ ఎందుకు చెప్పు. 
మురారి: (కృష్ణతో.. అమ్మకి ముహూర్తం పెట్టమని అడుగుతా..) అమ్మా నీకు తెలిసిన పంతులు ఎవరైనా ఉన్నాడా.. అదే మా ఫ్రెండ్ గోపి ఉన్నాడు కదా వాళ్ల చెల్లికి పెళ్లి అంటున్నాడు అందుకే. 
రేవతి: వీడు పాపం శోభనం గురించి ఇన్‌డైరెక్ట్‌గా అడుగుతున్నాడు చెప్తా.. ముహూర్తాల గురించి పంతులు గారి గురించి ఎందుకురా.. నన్ను అడుగు.. నాకు తెలిసి.. ఈ నెల, వచ్చే నెల కూడా ముహూర్తాలు లేవట. మొన్న గుడికి వెళ్లేటప్పుడు పంతులు గారు చెప్పారు. ఆ మాట విని మురారి డీలా అయిపోతే కృష్ణ దగ్గుతుంది. అందరూ వింతగా చూస్తారు. ఏంటి.. వాడికి నేను మూహూర్తాలు లేవు అంటే నువ్వు దగ్గుతున్నావ్ ఏంటి.
కృష్ణ: అదేం లేదు అత్తయ్య దగ్గు వచ్చింది దగ్గాను. 
ముకుంద: నాకు అర్థమైంది. మురారి ఎందుకు అలా అడిగాడో.. అత్తయ్య ఎందుకు అలా చెప్పిందో.. నువ్వు ఎందుకు దగ్గావో అన్నీ అర్థమయ్యాయి. కృష్ణ సిగ్గుపడుతుంది. చిన్నమ్మ నీకు అర్థమైందా.. నేను చెప్తా వినండి. 


ముకంద చెప్పబోతే కృష్ణ, మురారి ఇద్దరూ అడ్డుకుంటారు. అయినా నేను వదలను అంటూ ముకుంద చెప్పబోతే పని ఉంది అని తప్పించుకుంటారు. ఇక రేవతి అయితే ఇప్పుడే పంతులుకి చెప్తా అని రేవతి అంటుంది. ముకుంద శకుంతలకి చెప్పగా ముహూర్తాలు పెట్టించమని రేవతికి శకుంతల చెప్తుంది. ఇంతలో కృష్ణ, మురారి బైక్ కీ అని మళ్లీ వస్తారు. ముకుంద వాళ్లని ఉండమని టిఫెన్ చేస్తా అంటుంది. 


మరోవైపు భవాని దేవ్ ఎంత పని చేశాడు. నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేలా చేశాడు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి లాయర్ సుందరం వస్తాడు. ఇక పెద్దపల్లి ప్రభాకర్ గురించి చెప్పాను అని దాని గురించే మిమల్ని రమ్మన్నాను అంటుంది. ప్రభాకర్ వ్యక్తిత్వాన్ని గుర్తించకుండా అంత పెద్ద నింద తన మీద వేసినా కూతురు కోసం మౌనంగా వెళ్లాడే కానీ ఒక్కమాట మాట్లాడలేదని.. అతన్ని నిర్దోశిగా రిలీజ్ చేయమని చెప్తుంది. ఇక లాయర్ ఆయన మర్డర్ చేయలేదు అని మనదగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఈజీగా క్లోజ్ చేయిస్తా అంటారు. వారంలోపలే ప్రభాకర్‌ని బయటకు తీసుకురావాలి అని భవాని లాయర్‌కి చెప్తుంది. ఇక తాను ముకుందతో మురారి పెళ్లి చేయడంలో ఓడిపోయాను అని.. దానికంటే ఓ నిర్దోశికి శిక్ష పడకుండా కాపాడటంలో గొప్ప తృప్తి ఉందని భవాని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఫణేంద్ర మీద నాగదేవతకు డౌట్.. పంచమి మోక్షని చంపేస్తుందన్న జ్వాల!