Naga Panchami Today Episode: నాగదేవత నాగలోకంలో ఫణేంద్ర అన్న మాటలు తలచుకుంటూ ఉంటుంది. ఇక మిగతా నాగులు అక్కడికి వచ్చి సమావేశం అవుతారు. వారితో నాగదేవత యువరాజు ఫణేంద్రకు ఓ కార్యం అప్పగించి భూలోకానికి పంపించాను. గడిచిన రాత్రి యువరాణిని తప్పక తీసుకొస్తాను అని చాలా నమ్మకంగా యువరాజు చెప్పాడు అని నాగదేవత చెప్తుంది. ఇంత వరకు నాగలోకానికి చేరనేలేదు అని ఇలా చేయడం వలన తనకు అందరి మీద నమ్మకం పోతుంది అని నాగదేవత మిగతా నాగులతో చెప్తుంది. ఇక వారంతా తమరు అనుమతిస్తే భూలోకానికి వెళ్లి గాలించి తీసుకొస్తామంటారు. 


నాగదేవత: సాధారణ నాగరాజు అయితే అదే పని చేసుండేదాన్ని. కానీ ఫణేంద్ర యువరాజు అన్ని పోటీల్లీ అందర్ని ఓడించి విజయం సాధించి యువరాజు స్థానం సంపాదించుకున్నాడు. యువరాణితో కలిసి నాగలోకానికి ద్రోహం తలపెడుతున్నాడేమో అని నాకు కొంచెం సందేహంగా ఉంది. అదే నిజం అయితే యువరాజుకు మరణశిక్ష విధించాల్సి వస్తుంది. మీరు భూలోకం వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. యువరాజు కాబట్టి ఇప్పుడు నేనే తనకి ఎదురు పడి సంజాయిషీ అడుగుతాను. తన నుంచి సంతృప్తికరమైన సమాధానం వస్తే సరి. లేదంటే రహస్యంగా యువరాజు భూలోకంలో చేసే కార్యాలను తెలుసుకునే పని మీకే అప్పగిస్తాను. ప్రస్తుతానికి మీరు వెళ్లండి. 


మరోవైపు ఫణేంద్ర, మోక్ష, పంచమి కారులో నాగసాధువు దగ్గరకు వెళ్తుంటారు. మార్గమధ్యలో మోక్ష అద్దం నుంచి చూస్తే ఫణేంద్ర పాములా మారుతాడు. పంచమి కూడా చూస్తుంది. మోక్ష కారు ఆపుతాడు. ఫణేంద్ర పాము బయటకు వచ్చి మనిషిలా మారుతాడు. 


పంచమి: ఏమైంది ఫణేంద్ర అలా ఉన్నావ్. 
ఫణేంద్ర: నాగదేవత నన్ను అనుమానిస్తోంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో అని గమనిస్తుంది. నాగమణిని తెచ్చి మోక్షని బతికించాలి అనుకుంటున్న విషయం ఏమాత్రం నాగదేవత పసిగట్టినా మనల్ని వదిలిపెట్టదు.
మోక్ష: నాగదేవతకు తెలీకుండా నాగమణిని తీసుకురావడం సాధ్యమైన పనేనా.. నాగదేవతతో అంత ప్రమాదం ఉందని తెలిసి ఏం ఆశించి నన్ను బతికించాలి అనుకుంటున్నావ్ ఫణేంద్ర. 
ఫణేంద్ర: సాయం చేస్తానని మా యువరాణికి మాటిచ్చాను.
పంచమి: ఎలా అయినా మిమల్ని ఈ గండం నుంచి తప్పించాలి అని  కుమిలిపోయాను మోక్షాబాబు. నా బాధ చూడలేక తాను ఒప్పుకున్నాడు.
మోక్ష: నా ఒక్కడి ప్రాణం కోసం మీరెవ్వరూ బలికావొద్దు. 
ఫణేంద్ర: అలాంటిది ఏమీ లేదు మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. మీరిద్దరూ నాగసాధువు దగ్గరకు వెళ్లండి నేను తర్వాత వస్తాను.
పంచమి: అంతా నీ చేతుల మీదే జరగాలి ఫణేంద్ర నువ్వు మాతోనే ఉండాలి.
ఫణేంద్ర: ఉంటాను యువరాణి కానీ నాగదేవత ఇప్పుడు నామీద దృష్టి పెట్టి ఉంటుంది. ఏ క్షణమైన ప్రత్యక్షమై నన్ను సంజాయిషీ అడిగే ప్రమాదం ఉంది. ఆ సమయంలో మీరు నా పక్కన ఉండకూడదు. భయపడకండి నాగదేవతకు కావాల్సింది నువ్వు పాముగా మారి మోక్షని కాటేయడం. అందుకే నేను అడగగానే నీకు ఇష్టరూప శక్తులు ప్రసాదించింది. 
మోక్ష: నన్ను కాటేయగానే పంచమిని నాగలోకం తీసుకెళ్లకపోతే నాగదేవత ఒప్పుకుంటుందా.. తనని ఎలా అయినా నాగలోకం తీసుకెళ్లాలి అనే కదా నాగదేవత పట్టుదల. 
ఫణేంద్ర: అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది. యువరాణి నిన్ను కాటేయడం.. నేను ఆమెను నాగలోకం తీసుకెళ్లడం. నాగదేవత నాకు అప్పగించి కార్యం యథాప్రకారం జరుగుతుంది. కానీ అక్కడి నుంచి యువరాణి నాగమణిని తీసుకురావడం మీకు ప్రాణం పోయడం నేను మళ్లీ ఆ నాగమణిని చేర్చడం మాత్రం నాకు తెలీదు. 
మోక్ష: ఒకవేళ నాగదేవతకు తెలిసి పంచమిని తిరిగి నాగలోకం నుంచి రానివ్వకపోతే. పంచమి తిరిగి రాకపోతే ఇక్కడ నా ప్రాణం పోతుంది అని నాకు భయం లేదు. 
ఫణేంద్ర: మీ ఇద్దరి ప్రాణాలకు నా ప్రాణం అడ్డువేస్తా. మీరు ధైర్యంగా ఉండండి. ఇష్టరూప నాగజాతికి పగాప్రతీకారం తీర్చుకోవడం ముఖ్యం. అది జరగకపోతే నాగదేవత మన విషయం అంత ముఖ్యంగా పట్టించుకోదు. నేను యువరాణికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మిమల్ని బతికించే బాధ్యత నాది. మనసులో.. ఒకసారి యువరాణి మోక్షని కాటేస్తే మోక్ష బతికేది లేదు.. యువరాణి భూలోకం వచ్చేది లేదు..


మరోవైపు కరాళి తన ఆశ్రమంలో గట్టిగా నవ్వుతుంది. అద్దంలో తనని తాను చూసుకుంటూ కరాళి నాగకన్యగా బాగా నటిస్తున్నావ్ అనుకుంటుంది. పంచమిని కూడా బాగా నమ్మించాను అని తనని తానే పొగుడుకుంటుంది. మోక్షని తనకి పంచమి అప్పగించింది అని తానే కరాళి అని తెలిస్తే పంచమి గుండె ఆగి చావడం ఖాయం అనుకుంటుంది. ఇక నంబూద్రి ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. ఎప్పటి నుంచో వేచి ఉన్న తమ కల నెరవేరుబోతుంది అని.. తాను నాగమణిని తాను దక్కించుకుంటున్నానని చెప్తుంది. రేపు తన అన్న నంబూద్రికి ప్రాణం పోస్తానని చెప్తుంది. 


ఇక వైదేహి ఇంట్లో అందరూ మోక్ష కనిపించక బాధ పడుతుంటారు. ఇక జ్వాల, చిత్రలు వచ్చి మోక్ష ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాడు అని అంటారు. పంచమి పాము అని అందుకే తనని ఎక్కడి నిలదీస్తామో అని రాత్రికి రాత్రే మోక్షని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది అంటారు. ఇక మీనాక్షి పంచమి పాము అయితే మోక్ష ఎలా కాపురం చేస్తాడు. మీ మాటలు నమ్మశక్యంగా లేవు అంటుంది. దానికి జ్వాల పంచమి విషయంలో మోక్ష మన దగ్గర చాలా విషయాలు దాస్తున్నాడు అని చెప్తారు. ఇక శబరి కలుగజేసుకొని రెండు రోజుల్లో వస్తాము అని మోక్ష చెప్పాడు కదా ఏం కాదు అని అంటుంది. అయితే జ్వాల ఇక పంచమి ఇంటికి రాదు అని మోక్షని కూడా చంపేస్తుంది అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. మోక్ష నాగగండానికి పంచమికి ఏదో సంబంధం ఉందని జ్వాలా అంటుంది. మరోవైపు మోక్ష, పంచమి నాగసాధువు దగ్గరకు వెళ్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: Krishna Mukunda Murari Serial Promo Today January 10th: కృష్ణని ఇంట్లోకి తెస్తే తాను అవుట్‌హౌస్‌కు వెళ్లిపోతానన్న ముకుంద!