Krishna Mukunda Murari Promo Today: మురారిని ప్రేమించిన ముకుంద పెళ్లికి రెడీ అవుతుండగా.. తన అన్న దేవ్ చేసిన మోసం బయటపడి ముకుంద పెళ్లి ఆగిపోతుంది. దీంతో ఇంట్లో వాళ్లు ముకుందను బయటకు పంపేస్తారు. దాన్ని కృష్ణ అడ్డుకుంటుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఉన్న ప్రోమోను చూస్తే ఎపిసోడ్‌ మీద ఇంకా ఇంట్రస్ట్‌ పెరుగుతోంది. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగింది అంటే..


" హాల్‌లో అందరూ ఉండగా అక్కడికి ముకుంద వస్తుంది. భవాని దగ్గరకు వెళ్లి చేయని నేరానికి కృష్ణ ఇంట్లో నుంచి అవుట్ హౌస్‌లోకి మారింది. కృష్ణకి ఈ ఇంట్లో ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కావాలి అంటే నేను అవుట్ హౌస్‌లో ఉంటాను అని చెప్తుంది. దానికి మురారి అవును పెద్దమ్మ ముకుంద అన్న దాంట్లో నిజం ఉంది. ఇంకా కృష్ణ అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు.



నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే.. 


రేవతి కృష్ణను దగ్గరగా తీసుకొని ఇక నువ్వే ఈ ఇంటి కోడలివి. దీన్ని ఎవరూ మార్చలేరు అని అంటుంది. ఇక ముకుంద ఏడుస్తుంటే భవాని ఏడుపు ఆపు ముకుంద. నువ్వు మీ అన్నలా నటించకు అని అంటుంది. దీంతో ముకుంద అత్తయ్య అంత మాట అనకండి నేను నటించలేదు అత్తయ్య. అసలు వాడు అలా చేస్తాడు అని కూడా నేను ఊహించలేదని అంటుంది. దానికి భవాని నన్ను నమ్మమంటావా ముకుంద. ఈ కన్నీళ్లు చూసే నేను మోసపోయాను. వీళ్లంతా ఆ ప్రభాకర్ మోసం చేయలేదు అంటే ఇవే కన్నీళ్లు చూసి వీళ్లని నానా మాటలు అన్నాను. ఇక ఇప్పుడు కూడా నిన్ను నమ్మాను అంటే నువ్వు చేసిన తప్పులో నాకు కూడా భాగం ఉంది అంటారు అని అంటుంది. ఇంత జరిగినా వీళ్లు నాతో గౌరవంగా మాట్లాడుతున్నారు అంటే అది నా గొప్పతనం కాదు వాళ్ల మంచితనం అని అంటుంది. ఇక మురారి అయితే పెద్దమ్మ అసలు మీరు తప్పు చేస్తే కదా ఇలా మాట్లాడాల్సింది. మోసపోవడం తప్పు కాదు పెద్దమ్మ. మోసం చేయడం తప్పు అని అంటాడు.   


మురారి అలా మాట్లాడే సరికి ముకుంద ప్లీజ్ మురారి నేను ఎవరినీ మోసం చేయలేదు. నేను మోసం చేశానని నువ్వు ఫీలవుతున్నావా అని అడుగుతుంది. దానికి మురారి మోసం జరిగిపోయింది ముకుంద. మీ అన్న విషయం నీకు ఏమాత్రం తెలీదా చెప్పు అని ప్రశ్నిస్తాడు. దీంతో ముకుంద ఏడుస్తూ.. మీరంతా నమ్ముతున్నారా నేను మా అన్న కలిసి మోసం చేశామని ప్రశ్నిస్తుంది. అందరూ సైలెంట్‌గా ఉంటే కృష్ణ నేను నమ్మడం లేదు ముకుంద అని అంటుంది. ఇక ఈ ఇంట్లో నుంచి నీ అంతట నువ్వు వెళ్లిపోతున్నావా లేకపోతే నిన్ను ఎవరైనా వెళ్లమన్నారా అని ప్రశ్నిస్తుంది. దానికి భవాని నేనే వెళ్లమన్నాను అంటుంది. తన అన్నని చట్టం శిక్ష విధిస్తే.. చెల్లికి నేను శిక్ష వేశా అంటుంది. క్షమించండి పెద్దత్తయ్య మీ మాటకి ఎదురు చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎంత అయినా ముకుంద మన ఇంటి మనిషి ఈ ఇంటి కోడలు అని కృష్ణ అంటుంది. దీంతో భవాని ముకుంద ఆ అర్హత కోల్పోయింది. ఇప్పుడు తను శ్రీనివాస్ కూతురు మాత్రమే. ఎవరూ ఆపే ప్రయత్రం చేయకండి తనని వెళ్లనివ్వండి అని అంటుంది. 


ఇక కృష్ణ పెద్దత్తయ్య ఇప్పుడు ముకుంద ఎక్కడికి వెళ్తుంది. వాళ్లింటికి ఎలా వెళ్తుంది. అప్పుడు నేను తప్పు చేయలేదు అని మేమిద్దరం ఎంత చెప్పినా మీరెవ్వరూ ఆలోచించలేదు. ఇందాక నేనే కానీ దేవ్ చేతికి ఉన్న ఆ రింగ్ చూడకపోయి ఉంటే ఏమయ్యేది. నేను మీ ఎవర్ని నిందించడం లేదు. తప్పు అని కూడా అనడం లేదు. భయమో, గౌరవమో నిజాన్ని తొక్కి పెట్టేసింది అంతే. దీనికి మీరు ఎవ్వరూ బాధ్యులు కారు ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అన్న విషయం నా జీవితంలో జరుగుతుంది అని నేను అనుకోలేదు. ముకుంద చేయని తప్పునకు ఎందుకు శిక్ష వేయాలి అని అందర్ని ప్రశ్నిస్తుంది. దానికి ముకుంద కృష్ణని హగ్ చేసుకొని థ్యాంక్స్ కృష్ణ నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు. నిజంగా నిజంగా నేను ఏ తప్పూ చేయలేదు. వాడు నా అన్న అని చెప్పుకోవడానికే సిగ్గు వేస్తుంది. కానీ ఒక్కటి చెప్పనా కృష్ణ నువ్వు అనుకునే అంత మంచిదాన్ని అయితే కాను. తప్పు చేశాను. చాలా తప్పులు చేశాను. నీ మంచి తనం అనుకో.. నీ గొప్పతనం అనుకో నీ మాటల్లోని నిజాయితీ చూసి నేను మారాను అని అంటుంది. దానికి కృష్ణ విన్నారు కదా అత్తయ్య. ముకుంద పశ్చాత్తాపపడుతుంది. పెద్దమనషు చేసుకొని దయచేసి ముకుందను క్షమించండి అని ప్రాధేయపడుతుంది. చివరకు భవాని ఏ తప్పూ చేయని నిన్ను శిక్షించినదాన్ని తప్పు చేసిన వాళ్లని ఎలా వదులుతాను అనుకున్నావు అని కృష్ణని ప్రశ్నిస్తుంది. అయితే ఇంక భవిష్యత్‌లో ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యురాలివి కృష్ణ దానికి నువ్వు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను అను అంటుంది. దానికి కృష్ణ ఒప్పుకుంటుంది. 


Also Read: Naga Panchami Serial Promo Today January 10th: ఫణేంద్ర మోసం చేస్తున్నాడు అని పంచమిని హెచ్చరించిన నాగసాధువు!