Gruhalakshmi Serial Today Episode: లాస్య మాటలకు చిర్రెత్తుకొచ్చిన తులసి కత్తి తీసుకొచ్చి లాస్య పీకల మీద పెడుతుంది. దివ్యను ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను. నువ్వు జిత్తుల మారి నక్కవని తెలుసు. కానీ కేవలం మామయ్య ఆరోగ్యం కోసమే నిన్ను  భరిస్తున్నాను. లేదంటే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో.. ఇక్కడ నన్ను కానీ అక్కడ నా కూతురుని కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇంకొక్కసారి నా కూతురు గురించి మాట్లాడావంటే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది తులసి. లాస్య షాకింగ్‌ చూస్తుండిపోతుంది. మరోవైపు దివ్య ఒంటరిగా రూంలో కూర్చుని తనను స్టోర్‌రూంలోకి లాక్కెళ్లిన సంఘటన గుర్తు చేసుకుని భాదపడుతుంది. ఇంతలో విక్రమ్‌ వచ్చి దివ్య భుజం మీద చేయి వేయగానే భయంతో నేను పిచ్చి దాన్ని కాదు అంటూ అరుస్తుంది.  


విక్రమ్‌: దివ్యను నేను విక్రమ్‌ ను. ఎందుకు భయపడుతున్నావు దివ్య.


దివ్య: ఏమో విక్రమ్‌ అంతా అయోమయంగా ఉంది. నేను ఒంటిరిదాన్నేమోనని భయంగా ఉంది.


విక్రమ్‌: నామీద కూడా నీకు నమ్మకం లేదా?


దివ్య: నామీదే నేను నమ్మకం పోగొట్టుకున్నాను.


విక్రమ్‌: కానీ నేను నిన్ను నమ్ముతున్నాను.


 పిచ్చిదాన్ని అని నమ్ముతున్నావా? ఎందుకు నన్ను వదిలేసి తిరుగుతున్నావు అంటూ ఏడుస్తూ మా అమ్మా వచ్చి నన్ను రక్షించకపోతే నా పరిస్థితి ఏంటి విక్రమ్‌ అంటూ ఏడుస్తుంది దివ్య. నువ్వెప్పుడు మీ అమ్మ మాటే వింటావు అందుకే నీకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదంటుంది. నేను నిన్ను వదిలి తిరగడం లేదు. ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నాను అంటాడు. నాకు పిచ్చి లేదు విక్రమ్‌ అంటూ విక్రమ్‌ వడిలో పడుకుంటుంది దివ్య. మరోవైపు రాజ్యలక్ష్మీ కూర్చుని ఉంటే బసవయ్య, సంజయ్‌ అటు ఇటు తిరుగుతూ ఉంటారు.


సంజయ్‌: అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. ఇంకొక అడుగు వేస్తే చాలు దివ్య కథ దాదాపు ముగింపుకు వచ్చినట్లే అనుకుంటే.. ఇలాంటి టైంలో ఎవరు మన ఇంటి కథను ఆ ఇంటికి లీక్‌ చేశారు. ఎవరు తులసిని ఇక్కడికి వచ్చేలా చేసింది.


బసవయ్య: మహా మహా సినిమాలే రిలీజ్‌ కాకముందే సీన్లు లీక్ అవుతున్నాయి. మన కథ లీక్‌ అవ్వడం పెద్ద విషయమా అల్లుడు. లీక్‌ కాకుండా ఉండటానికి మన కథని ఎక్కడా రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదుగా..?


రాజ్యలక్ష్మీ: ఆ పెద్దమనిషి ఎవరో నాకు బాగా తెలుసు.


అనగానే సంజయ్‌, బసవయ్య ఎగ్జైంటింగ్‌ ఎవరు అని అడుగుతారు. దీంతో ఆ పెద్దమనిషి ఎవరో కాదు మీ నాన్నగారే అని చెప్తుంది రాజ్యలక్ష్మీ.  దీంతో సంజయ్‌ నాన్నను నిలదీద్దాం అంటాడు. మనం చేసేది ధర్మయుద్దం కాదు అడగడానికి అని చెప్తుంది రాజ్యలక్ష్మీ. దీంతో తులసి నుంచి తమను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తారు. తమ జాగ్రతలో తాము ఉండాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు తులసి ఫోన్‌లో చందన ఫోటో చూస్తూ  ఉంటుంది.


నంద: ఆ ఫోటో లో ఉన్న అమ్మాయి జనాభా లెక్కల్లోనే లేదని పోలీసులే చెప్పారుగా..!


తులసి: తేల్చాసింది పోలీసులు కాదు నేను. నా మీద నా కూతురుకు ఎంత నమ్మకం ఉందో.. నా కూతురు మీద నాకు అంతే నమ్మకం ఉంది. ఈ అమ్మాయిని దివ్య చూశాను అందంటే.. కచ్చితంగా చూసే ఉంటుంది.


నంద: భ్రమ పడింది అంటున్నారుగా..


తులసి: నా కూతురు పిచ్చిది కాదు. ఉన్నది లేనట్లు, జరగనిది.. జరిగినట్లు భ్రమ పడటానికి. ఆ రాజ్యలక్ష్మీ ఆ రాక్షసి కావాలని పగ బట్టి దివ్య జీవితంతో ఆడుకుంటుంది. దివ్యకు పిచ్చి పట్టిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. పిచ్చిదానిలా దివ్య ఆ స్టోర్‌ రూంలో పడి ఉండటం చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది.


అంటూ తులసి ఏడుస్తూ బాధపడుతుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది బాధపడటం కాదు. దివ్యకు అండగా నిలబడటం అంటూ భరోసా ఇస్తాడు నందు. దూరం నుంచి తులసి, నంద మాటలు వింటారు పరంధామయ్య, అనసూయలు. తర్వాత కిందకు వెళ్లిన అనసూయ, పరంధామయ్యకు తులసి గొప్పదనం గురించి త్యాగం గురించి ఏడుస్తూ చెప్తుంది. దూరం నుంచి అంతా గమనిస్తున్న లాస్య ఈ ముసల్ది ఈ ముసలోడిని మాటలతో హిప్నటైజ్‌ చేస్తుందా? కష్టపడి కోటలో పాగా వేశాను. ఏం చేయాలి అంటూ మనసులో అనుకుంటుంది. ఒక్కసారి మీ శక్తినంతటిని కూడగట్టుకుని ఆలోచించండి మీకు గతం గుర్తుకు వస్తుంది. తులసి ఏంటో అర్థం అవుతుంది. అనగానే పరంధామయ్య ఆలోచిస్తూ.. లేచి అర్థం అయ్యింది అనసూయ నువ్వు చెప్పిందంతా విన్నాక అంతా అర్థం అయ్యింది అని పరంధామయ్య అనగానే లాస్య షాక్‌ అవుతుంది. కానీ పరంధామాయ్య నేను ఇంత చెప్పినా మీరు మారరు అని అర్థం అయ్యింది. ఎంత చెప్పినా మీరు తులసి వైపే ఉంటారని అర్థం అయ్యింది అంటాడు. లాస్య హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.