Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 10 ఏప్రిల్ 2024) పాజిటివ్ నోట్‌తో ప్రారంభమయ్యాయి, అయితే ఓపెనింగ్ లెవల్స్‌ను నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు డిమాండ్ పెరగడంతో ఆ స్టాక్ నుంచి మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో వృద్ధి కనిపిస్తోంది. మెటల్ స్టాక్స్ పెరగడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఈ రోజు కూడా మెరుగ్గా ఉంది. హిందాల్కో షేర్లు ఇవాళ కూడా హాట్ కేక్స్‌లా అమ్ముడుబోతున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (మంగళవారం) 75,124 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 3270.26 పాయింట్లు లేదా 0.36 శాతం పెరుగుదలతో 74,953.96 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. మంగళవారం 22,642 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 77.50 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 22,720.25 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో.. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.45, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18 పెరిగాయి.
ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 24 షేర్లు గ్రీన్ జోన్‌లో ట్రేడవుతుండగా, మిగిలిన 06 స్టాక్స్ రెడ్ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. భారతి ఎయిర్‌టెల్ 1.83 శాతం, టాటా స్టీల్ 1.42 శాతం చొప్పున పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.09 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.81 శాతం లాభపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.77 శాతం, టెక్ మహీంద్ర 0.70 శాతం యాడ్ చేసుకున్నాయి. మరోవైపు.. దివీస్ ల్యాబ్స్, జూబిలెంట్ ఫార్మా, శోభా లిమిటెడ్ నష్టాల్లో కనిపించాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో 32 స్టాక్స్ లాభాల్లో ట్రేడవుతుండగా, 18 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్‌లో.. బీపీసీఎల్ 1.91 శాతం, భారతి ఎయిర్‌టెల్ 1.76 శాతం చొప్పున పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.47 శాతం, హిందాల్కో 1.36 శాతం, కోల్ ఇండియా 1.23 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి. మరోవైపు.. దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ఉన్నాయి.
సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, నిఫ్టీ మిడ్ స్మాల్ హెల్త్‌కేర్ రంగాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్‌లు డౌన్‌లో ఉన్నాయి.
ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 208.16 పాయింట్లు లేదా 0.28% పెరిగి 74,891.86 దగ్గర; NSE నిఫ్టీ 59.85 పాయింట్లు లేదా 0.26% పెరిగి 22,702.60 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లలో సెంటిమెంట్ మిశ్రమంగా ఉంది. జపాన్ నికాయ్ ఓపెనింగ్ టైమ్‌లో 0.34 శాతం పడిపోయింది, టోపిక్స్ 0.20 శాతం దిగి వచ్చింది. ఆస్ట్రేలియాలో, S&P/ASX 200 0.29 శాతం స్వల్ప లాభంతో ట్రేడ్ ప్రారంభించింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ 0.68 శాతం పెరిగింది.
US మార్కెట్లలో, నిన్న, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్లాట్‌గా ముగిసింది. అయితే.. S&P 500 0.14 శాతం పెరిగింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.34 శాతం లాభపడింది.
యూఎన్ ఇన్‌ఫ్లేషన్ డేటా నేపథ్యంలో అమెరికన్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ తగ్గింది, 4.35 శాతానికి దిగి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ $90 దిగువుకు చేరాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది, ఔన్సుకు $2,368 దగ్గర ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కొత్త వ్యాపారం కోసం 25 ఎకరాలు కొన్న అదానీ, డీల్ విలువ రూ.471 కోట్లు