Stock Market News Today in Telugu: ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (మంగళవారం, 09 జనవరి 2024) మూమెంట్స్‌ ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచెత్తాయి. నిన్న (సోమవారం) మార్కెట్‌లో భారీ పతనం తర్వాత, ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో గ్యాప్ అప్‌తో ప్రారంభమైంది. మార్కెట్‌లో ట్రేడ్‌ ప్రారంభమయ్యే సమయానికి, అడ్వాన్స్‌డ్‌ షేర్ల సంఖ్య 2200 షేర్లుగా ఉండగా, డిక్లైన్‌ షేర్ల సంఖ్య 200 మాత్రమే ఉంది. నిఫ్టీ 21,600 స్థాయి దగ్గర పట్టు నిలుపుకుంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (సోమవారం, 05 జనవరి 2024) 71,355 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 415.69 పాయింట్లు లేదా 0.58 శాతం పెరుగుదలతో 71,770 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 21,513 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 140.60 పాయింట్లు లేదా 0.65 శాతం భారీ లాభంతో 21,653 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లో ఉప్పెన
స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లో, సెన్సెక్స్ 326.72 పాయింట్ల లాభంతో 71,681 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 142.50 పాయింట్ల లాభంతో 21,655 వద్ద ఉంది.


బ్రాడర్‌ మార్కెట్‌లో, BSE మిడ్‌ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి.


దాదాపు సెన్సెక్స్ షేర్లన్నింటిలో లాభాలు
మార్కెట్‌ ప్రారంభ సమయానికి, సెన్సెక్స్‌30 ప్యాక్‌లో ఒక స్టాక్ మాత్రమే నష్టాల్లో ఉంది, అది పవర్ గ్రిడ్. మిగిలిన 29 సెన్సెక్స్ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్ గెయినర్స్‌లో ఐటీ స్టాక్స్‌ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, టాప్-6 స్టాక్స్‌లో 5 ఐటీ రంగానికి చెందినవి. విప్రో టాప్ గెయినర్‌గా నిలిచింది. TCS, టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌ 1-2 శాతం వరకు లాభపడ్డాయి. టాటా మోటార్స్, SBI, టాటా స్టీల్, లార్సెన్ & టూబ్రో కూడా పచ్చగా మారాయి.


నిఫ్టీ చిత్రం
నిఫ్టీ50 ప్యాక్‌లో.. 48 స్టాక్స్‌లో బలం, కేవలం 2 స్టాక్స్‌లో మాత్రమే బలహీతన కనిపించింది. బైబ్యాక్ వార్తలతో బజాజ్ ఆటో షేర్ దాదాపు 5 శాతం పెరిగి నిఫ్టీ టాప్ గెయినర్‌గా నిలిచింది. విప్రో ఇక్కడ కూడా టాప్ గెయినర్స్‌ లిస్ట్‌లో ఉంది, 1.80 శాతం లాభపడింది. 


ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 424.38 పాయింట్లు లేదా 0.59% పెరిగి 71,779.59 దగ్గర; NSE నిఫ్టీ 131.50 పాయింట్లు లేదా 0.61% తగ్గి 21,644.50 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
ఈ రోజు ఆసియా మార్కెట్లలో బుల్స్‌ జోరు కనిపించింది. జపాన్‌కు చెందిన నికాయ్‌ 1.5 శాతానికి పైగా పెరిగింది. కోస్పి, తైవాన్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. S&P/ASX 200 1 శాతం లాభపడింది. నిన్న, టెక్ షేర్ల ర్యాలీతో US మార్కెట్ స్ట్రాంగ్‌ గెయిన్స్‌తో ముగిసింది. నాస్‌డాక్ 2.2 శాతం, S&P 500 1.4 శాతం, డౌ జోన్స్ 0.6 శాతం పెరిగాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి