Tirumala Website Name Changed: తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేస్తుంటారు. అలాంటి వారందరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. 


తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్‌సైట్‌ పేరు మార్చింది. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ప్రముఖ వెబ్‌సైట్‌లకు ఫేక్‌వెబ్‌సైట్‌ను సృష్టిస్తున్నారు. దీంతో అలర్ట్‌ అయిన టీటీడీ తన వెబ్‌సైట్‌కు మరింత సెక్యూరిటీ అంశాలు జోడించి మార్పులు చేర్పులు చేసింది. దీంతోపాటు వన్‌ ఆర్గనైజేషన్, వన్‌వెబ్‌సైట్‌ వన్‌మొబైల్ యాప్‌లో భాగంగా మార్పులు చేర్పులు చేసినట్టు టీటీడీ పేర్కొంది. 


ఇప్పటి వరకు ఉన్న thirupathibalaji.ap.gov.in అని ఉండేది దాన్ని ఇప్పుడు ttdevasthanams.ap.gov.in అని మార్చారు. ఇకపై టికెట్లతోపాటు తిరుమలకు సంబంధించిన అధికారిక సమాచారన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు.  


సంక్రాంతి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది టీటీడీ. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 14న భోగితేరు, 15న సంక్రాంతి తిరుమంజనం, 16న గోదాకల్యాణం జరపనున్నారు. 16న పార్వేట గోదాపరిణయోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు.