Stock Market News Today in Telugu: గ్లోబల్ మార్కెట్లు ఇచ్చిన ప్రేరణతో భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (గురువారం, 07 మార్చి 2024) గ్యాప్‌-అప్‌లో ప్రారంభమయ్యాయి, కొత్త రికార్డు గరిష్ట స్థాయులను (Stock markets at record levels) నమోదు చేశాయి. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు BSE సెన్సెక్స్‌, NSE నిఫ్టీ రెండూ కొత్త శిఖరాలను ఎక్కాయి. ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌ చరిత్రలో మొదటిసారిగా NSE నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. మెటల్‌ స్టాక్స్‌ ఈ రోజు రైజింగ్‌లో ఉంటే, ఆటో స్టాక్స్‌ మడిమ తిప్పాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (బుధవారం) 74,086 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 156.75 పాయింట్లు లేదా 0.21 శాతం లాభంతో 74,242.74 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 22,474 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 31.25 పాయింట్లు లేదా 0.14 శాతం పెరిగి 22,505.30 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 74,245.17 వద్ద ‍(Sensex at fresh all-time high), నిఫ్టీ 22,523.65 వద్ద (Nifty at fresh all-time high) కొత్త గరిష్టాలను నమోదు చేశాయి.


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.2 శాతం పెరిగింది. నిన్నటి గట్టి నష్టాల నుంచి తిప్పుకున్న BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌, ఈ రోజు 0.7 శాతం పెరిగింది. 


మార్కెట్‌ ప్రారంభంలో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో.. 17 షేర్లు లాభపడగా, 13 స్టాక్స్‌ క్షీణతలో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్ టాటా స్టీల్ 3.63 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.21 శాతం లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 2.19 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.06 శాతం పెరిగాయి. ఎస్‌బీఐ 0.89 శాతం ఎక్కువలో ట్రేడవుతోంది.


నిఫ్టీ 50 ప్యాక్‌లో 27 స్టాక్స్ లాభపడగా, 21 స్టాక్స్ క్షీణతను చూస్తున్నాయి. 2 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.


సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో అత్యధికంగా 0.75 శాతం పడిపోయింది. మరోవైపు.. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1 శాతం పైగా పెరిగింది. 


BSE మార్కెట్ క్యాప్ రూ. 392.46 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రోజు ప్రారంభంలో ట్రేడైన 2,992 షేర్లలో 1,964 షేర్లు పురోగమనంలో, 941 షేర్లు తిరోగమనంలో ఉన్నాయి. 87 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. 81 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 103 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి.


ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 33.79 పాయింట్లు లేదా 0.04% పెరిగి 74,119.78 దగ్గర; NSE నిఫ్టీ 17.90 పాయింట్లు లేదా 0.08% పెరిగి 22,491.95 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని మార్కెట్లు పచ్చ రంగుతో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, జపాన్ నికాయ్‌ ఇండెక్స్ 0.8 శాతం ఎగబాకి 40,314.64 వద్ద కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. టోపిక్స్ కూడా 0.6 శాతం పెరిగి తాజా గరిష్టాన్ని తాకింది. దక్షిణ కొరియా కోస్పి 0.42 శాతం, స్మాల్ క్యాప్ కోస్‌ డాక్ 0.1 శాతం పడిపోయింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ 16,565 వద్ద ఉన్నాయి, లాభాలను కంటిన్యూ చేసే ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతూ గత ముగింపు 16,438.09ను ఇది అధిగమించింది.


అమెరికాలో, బుధవారం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.58 శాతం పెరిగింది, అంతకుముందు రెండు రోజుల క్షీణత నుంచి కోలుకుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.2 శాతం లాభపడగా, S&P 500 0.51 శాతం పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మహిళల కోసమే ఉన్న ప్రత్యేక పథకాలివి, చాలామందికి వీటి గురించి తెలీదు