Stock Market Today News in Telugu: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నిన్నటి (సోమవారం) సెషన్‌లో రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు, ఈ రోజు (మంగళవారం, 05 డిసెంబర్ 2023) కూడా అదే ఊపులో ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్‌లో నేడు మళ్లీ పచ్చదనంతో పాటు సూచీల ర్యాలీ కొనసాగుతోంది.
షేర్ మార్కెట్‌లో ఇది మరో చారిత్రాత్మక రోజు. BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ మళ్లీ 'ఆల్ టైమ్ హై లెవెల్'ను (stock market all-time high) చేరుకున్నాయి.
ఈ రోజు నిఫ్టీ మళ్లీ చారిత్రాత్మక స్థాయిలో (Nifty fresh all-time high) ప్రారంభమైంది. సెన్సెక్స్ కూడా తొలిసారిగా 69,000 మార్క్‌ను (Sensex at 69000 level) అందుకుంది, కొత్త జీవనకాల గరిష్టాన్ని (Sensex fresh all-time high) తాకింది. బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్లకు పైగా జంప్‌తో ఓపెన్ అయింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
సోమవారం 68,865 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 303.41 పాయింట్లు లేదా 0.44 శాతం బలమైన లాభంతో 69,168 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గత సెషన్‌లో 20,687 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 119.90 పాయింట్లు లేదా 0.58 శాతం ఆకట్టుకునే లాభంతో 20,806 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
వరుసగా రెండో సెషన్‌లోనూ బ్యాంక్‌లు పరుగులు తీయడంతో నిఫ్టీ బ్యాంక్ తాజా గరిష్ట స్థాయిని చేరింది. ఉదయం సెషన్‌లో బ్యాంక్ ఇండెక్స్ 0.7% లాభపడగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు 1.3% కాంట్రిబ్యూట్ చేశాయి.
నిఫ్టీ టాప్ గెయినర్స్‌లోకి మరోమారు అదానీ స్టాక్స్ చేరాయి. ఈ రోజు మార్నింగ్ సెషన్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ రూ.61,489 కోట్ల సంపదను యాడ్ చేశాయి. BPCL, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, M&M పేర్లు కూడా లాభపడ్డ షేర్ల లిస్ట్‌లో ఉన్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్కెట్‌లో ర్యాలీని ఊహిస్తున్న చాలా బ్రోకరేజీలు, ఫైనాన్షియల్, లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాయి.
ఉదయం 10.45 గంటల సమయానికి సెన్సెక్స్ 467.64 పాయింట్లు లేదా 0.68% పెరిగి 69,332.76 స్థాయి వద్ద; నిఫ్టీ 150 పాయింట్లు లేదా 0.73% గెయిన్స్‌తో 20,836.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ప్రపంచ మార్కెట్లలో విషయానికి వస్తే... ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఓపెనింగ్ ట్రేడ్‌లో డీలా పడ్డాయి. ఈ ప్రాంతంలో ఆర్థిక డేటా అంచనాలు పెట్టుబడిదార్లను సంతోష పెట్టలేదు. హాంగ్‌కాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.1 శాతం పడిపోయింది. జపాన్ నికాయ్ 1.43 శాతం క్షీణించగా, ఆస్ట్రేలియా S&P/ASX 0.91 శాతం దిగి వచ్చింది. దక్షిణ కొరియా కోస్పి 0.38 శాతం లోయర్ సైడ్‌లో ఉంది.
అమెరికన్ మార్కెట్లు కూడా డౌన్ సైడ్ క్లోజ్ అయ్యాయి. డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.11 శాతం క్షీణించగా, S&P 500 0.54 శాతం పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.84 శాతం తగ్గింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి