Stock Market News Updates Today in Telugu: సోమవారం నాడు, సరికొత్త రికార్డ్‌తో వారాన్ని ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 24 సెప్టెంబర్‌ 2024) కొద్దిగా బేరిష్‌నెస్‌తో ఓపెన్‌ అయ్యాయి. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లుగా రికార్డ్‌లు సృష్టిస్తూ వచ్చిన మార్కెట్లు మంగళవారం ఓపెనింగ్‌ ట్రేడ్‌లో స్వల్ప ఒత్తిడికి లోనయ్యాయి. సూచీలు రికార్డు స్థాయిలకు చేరడంతో, ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడి కనిపిస్తోంది. ఈ కారణంగా ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ రెండూ రెడ్‌ జోన్‌లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అయితే, మార్కెట్‌ ప్రారంభమైన అరగంట తర్వాత గ్రీన్‌ జోన్‌లోకి అడుగు పెట్టాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (సోమవారం) 84,928 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు దాదాపు 67 పాయింట్ల స్వల్ప నష్టంతో 84,860.73 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 25,939 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 18 పాయింట్లు తగ్గి 25,921.45 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ఉదయం 9:25 గంటలకు... సెన్సెక్స్ దాదాపు 80 పాయింట్ల నష్టంతో 84,850 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 50 సూచీ దాదాపు 10 పాయింట్ల నష్టంతో 25,925 పాయింట్ల దగ్గర ఉంది.


ఓపెనింగ్‌ మినిట్స్‌లో... సెన్సెక్స్‌లోని చాలా షేర్లు రెడ్ మార్క్‌తో ట్రేడవుతున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్ వంటి షేర్లు అత్యధికంగా పడిపోయి 1 శాతం వరకు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఐటీ స్టాక్స్‌లో ఇన్ఫోసిస్‌తో పాటు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా కూడా నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు.... మెటల్ స్టాక్స్ మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. టాటా స్టీల్ 2 శాతానికి పైగా బలపడింది. JSW స్టీల్ దాదాపు 1.80 శాతం లాభాల్లో ఉంది.


ఉదయం 09.50 గంటలకు, BSE సెన్సెక్స్ 58.51 పాయింట్లు లేదా 0.06% పెరిగి 84,987.12 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 13.85 పాయింట్లు లేదా 0.05% పెరిగి 25,952.90 దగ్గర ట్రేడవుతోంది.


ప్రి మార్కెట్‌
దేశీయ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే ఒత్తిడి సంకేతాలు కనిపించాయి. ప్రి-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ దాదాపు 70 పాయింట్ల నష్టంతో 84,860 పాయింట్ల దగ్గర ట్రేడవగా, నిఫ్టీ దాదాపు 18 పాయింట్ల నష్టంతో 25,920 పాయింట్ల దగ్గర ట్రేడయింది. అయితే.. GIFT నిఫ్టీ ఫ్యూచర్స్ 75 పాయింట్ల ప్రీమియంతో 25,990 పాయింట్ల వద్ద ఉంది.


సోమవారం రికార్డ్‌లు 
సోమవారం, దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా గొప్పగా పని చేశాయి. సోమవారం సెన్సెక్స్ 384.30 పాయింట్ల (0.45 శాతం) పెరుగుదలతో 84,928.61 పాయింట్ల వద్ద ముగిసింది. ఆ రోజు ఇంట్రాడే 84,980.53 ‍(Sensex at fresh all-time high) పాయింట్ల వద్ద సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. కేవలం 20 పాయింట్ల తేడాతో 85,000 మార్క్‌ను మిస్‌ చేసుకుంది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 25,956 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు (Nifty at fresh all-time high) సృష్టించింది. ట్రేడింగ్ ముగిసిన తర్వాత 148.10 పాయింట్ల (0.57 శాతం) లాభంతో 25,939.05 పాయింట్ల వద్ద ముగిసింది. 26,000 స్థాయికి 61 పాయింట్ల దూరంలో ఆగిపోయింది.


గ్లోబల్‌ మార్కెట్లు
సోమవారం అమెరికన్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో బుల్లిష్‌గా ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.15 శాతం స్వల్ప పెరుగుదలతో క్లోజ్‌ అయింది. S&P 500 ఇండెక్స్‌ 0.28 శాతం, టెక్ ఫోకస్డ్ ఇండెక్స్ నాస్‌డాక్‌ 0.14 శాతం పెరిగాయి.


ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే... పబ్లిక్ హాలిడే తర్వాత ప్రారంభమైన జపాన్ నికాయ్‌ 1.47 శాతం, టోపిక్స్ 1 శాతం పెరిగాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.6 శాతం, కోస్‌డాక్ 0.68 శాతం లాభంలో ఉన్నాయి. హాంగ్‌ కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్ సూచీ 2.18 శాతం బలపడగా, చైనాలోని మెయిన్‌ల్యాండ్ షాంఘై కాంపోజిట్ 1 శాతం పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తగ్గిన చమురు రేట్ల సెగ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి