Stock Market News Updates Today in Telugu: చైనా ఆర్థిక ఫలితాలు గ్లోబల్‌ మార్కెట్లను నిరాశపరిచినప్పటికీ, ఈ రోజు (సోమవారం, 16 సెప్టెంబర్‌ 2024) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్‌వ & NSE నిఫ్టీ రెండూ రికార్డ్‌ గరిష్ట స్థాయికి అతి దగ్గరలో ట్రేడ్‌ అవుతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఈ రోజు లిస్ట్‌ (bajaj housing finance ipo listing) అవుతుంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (శుక్రవారం) 82,891 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 94.39 పాయింట్లు లేదా 0.11 శాతం పెరుగుదలతో 82,985 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 25,356 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు  50.15 పాయింట్లు లేదా 0.20 శాతం పెరుగుదలతో 25,406 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు 52,000 పైన ప్రారంభమైంది. ప్రారంభంలో, ఈ ఇండెక్స్‌లోని మొత్తం 12 షేర్లలో 9 స్టాక్స్‌ పెరిగే ధోరణిలో ఉన్నాయి. నేడు, మెటల్ స్టాక్స్‌ అద్భుతంగా ర్యాలీ చేస్తున్నాయి, మెటల్స్ ఇండెక్స్‌ బలంగా పెరిగింది. 


ఓపెనింగ్‌ ట్రేడ్‌లో, నిఫ్టీ 50 ప్యాక్‌లో 38 షేర్లు లాభపడగా, 12 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 26 స్టాక్స్‌ లాభాలను చూపగా, 4 మాత్రమే క్షీణతను చూపుతున్నాయి. 


కీలక షేర్లలో ట్రేడింగ్‌ ఇలా ఉంది..
ఈ రోజు ఉదయం బిజినెస్‌ ప్రారంభ సమయంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఒక్కో షేరు రూ.12 పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఫ్లాట్‌గా కదులుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌, ఎల్ & టీ స్క్రిప్స్‌ లాభాల్లో ఉన్నాయి. HUL 2.60 శాతం తగ్గింది. కోర్‌- 6 స్టాక్స్‌లో హెచ్‌యుఎల్ మాత్రమే పడిపోయింది, మిగిలిన 5 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. 


ఈ రోజు FMCG షేర్లు జారిపోతున్నాయి, ఎడిబుల్ ఆయిల్‌పై డ్యూటీ నిర్ణయం దీనికి కారణం.


ప్రి-ఓపెనింగ్‌ మార్కెట్
స్టాక్ మార్కెట్ ప్రీ-ఓపెనింగ్‌లో, BSE సెన్సెక్స్ 90.09 పాయింట్లు లేదా 0.11 శాతం పెరుగుదలతో 82,981 వద్ద ప్రారంభమైంది. NSE నిఫ్టీ 54.30 పాయింట్లు లేదా 0.21 శాతం పెరుగుదలతో 25,410 వద్ద ప్రారంభమైంది.


ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO లిస్టింగ్‌
ఈ రోజు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. IPO ధర కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో ఈ షేర్లు లిస్ట్‌ అవుతాయని భావిస్తున్నారు. కంపెనీ ఐపీవోకు బంపర్ రెస్పాన్స్ వచ్చింది.


బుధవారం జరగనున్న యూఎస్ ఫెడ్ సమావేశం ప్రపంచ మార్కెట్ల కదలికలను భారీ స్థాయిలో ప్రభావితం చేస్తుంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు - మీ నగరంలో ఈ రోజు ధరలు ఇవి