Stock Market News: బెంజమిన్ గ్రాహం పూర్వ విద్యార్థి, బెర్క్‌షైర్ హాత్‌వే CEO, స్టాక్ మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ (Warren Buffett). స్టాక్ మార్కెట్ ఫాలో అయ్యే వాళ్లకు బఫెట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మేనేజ్‌మెంట్‌లో నాణ్యత, కంపెనీ వృద్ధి అవకాశాలను నిర్ధరించుకున్న తర్వాత మాత్రమే ఆయా కంపెనీ షేర్లను బఫెట్ కొంటారు. వాటిలోనూ, వాల్యూ బయింగ్స్‌కు (ఉండాల్సిన ధర కన్నా ఇప్పుడు తక్కువ ధరకు దొరికే క్వాలిటీ స్టాక్స్) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ పెట్టుబడి విధానాన్ని దీనిని 'బఫెటాలజీ'గా పిలుస్తుంటారు.
MarketSmith చెబుతున్న ప్రకారం... వారెన్ బఫెట్ పెట్టుబడి శైలికి సరిగ్గా సరిపోయే 5 స్టాక్స్ ఇవి:
షాఫ్లర్ ఇండియా (Schaeffler India)
ఫండమెంటల్‌గా... రూ. 6,596 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూతో, అత్యుత్తమ వార్షిక ఆదాయ వృద్ధి, 47% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 15%, ROE 17% గా ఉంది. ఈ కంపెనీకి రుణ రహితం, బలమైన బ్యాలెన్స్ షీట్ ఉంది. టెక్నికల్‌గా... ఈ స్టాక్ దాని 50 DMA కంటే దిగువన, 200 DMA కంటే దాదాపు 11% పైన ట్రేడ్ అవుతోంది. 50 DMA స్థాయిని దాటితే, మంచి ర్యాలీ కనిపించవచ్చు.
రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ (Rajratan Global Wire)
ఫండమెంటల్‌గా చూస్తే... రూ. 945.39 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూతో, ఔట్ స్టాండింగ్ రెవెన్యూ గ్రోత్ 63% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 17%, ROE 36%. డెట్-టు-ఈక్విటీ రేషియో 16% వద్ద రీజనబుల్‌గా ఉంది. టెక్నికల్‌గా... ఈ స్టాక్ దాని 50 DMA కంటే దిగువన, 200 DMA కంటే దాదాపు 12% పైన ట్రేడ్ అవుతోంది. 50 DMA స్థాయిని దాటితే, బెటర్‌మెంట్ కనిపించవచ్చు.
HG ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ (HG Infra Engineering)
ఫండమెంటల్‌గా... రూ. 3,917.73 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూతో, అత్యుత్తమ వార్షిక ఆదాయ వృద్ధి 44% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 14%, ROE 26%. డెట్-టు-ఈక్విటీ రేషియో 67%గా ఉంది, ఇది కొంచెం ఎక్కువ. టెక్నికల్‌గా... ఈ స్టాక్ కీలక మూవింగ్ యూవరేజ్‌లకు దగ్గరగా ట్రేడ్ అవుతోంది. మీనింగ్‌ఫుల్ మూవ్ కోసం ఈ స్థాయలను ఇది దాటాల్సి ఉంటుంది.
శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో (Sree Rayalaseema Hi-Strength Hypo)
ఫండమెంటల్‌గా... రూ. 1,623.32 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూతో, అత్యుత్తమ వార్షిక ఆదాయ వృద్ధి 39% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 11%, ROE 18%. ఈ కంపెనీకి అప్పులు లేవు. బలమైన బ్యాలెన్స్ షీట్ ఉంది. సాంకేతికంగా... ఈ స్టాక్ దాని కీలక మూవింగ్ యావరేజ్‌ల కంటే దిగువన ట్రేడ్ అవుతోంది. వాటిని దాటితే ఇక పరుగో పరుగు.
గోల్డియం ఇంటర్నేషనల్ (Goldiam International)
ఫండమెంటల్‌గా... రూ. 590.64 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూతో, ఔట్ స్టాండింగ్ రెవెన్యూ గ్రోత్ 72% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 22%, ROE 20%. కంపెనీ రుణ రహితం, ఆదాయ వృద్ధిని నివేదించడానికి వీలుగా బలమైన బ్యాలెన్స్ షీట్ ఉంది. సాంకేతికంగా... ఈ స్టాక్ దాని 200 DMAకి దగ్గరగా, 50 DMA కంటే 10% పైన కదులుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.