Stock Market News: గత కొన్ని వారాలుగా సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు ఒక రేంజ్‌ బౌండ్‌లోనే కదులుతున్నాయి. వీటిని మాత్రమే ఫాలో అయ్యే ఇన్వెస్టర్లు డబ్బులు సంపాదించడం లేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ, కాసుల వర్షం కురుస్తూనే ఉంది. స్మాల్ & మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లు ఇప్పుడు దూకుడుగా ఉన్నాయి, ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను టచ్‌ చేస్తున్నాయి. అందువల్లే, హెడ్‌లైన్ సూచీలు తగ్గినా చాలా మంది పెట్టుబడిదార్ల పోర్ట్‌ఫోలియోలు పచ్చగా కనిపిస్తున్నాయి.


ఆగస్టు 1 నుంచి, సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు పడిపోయింది. అయితే అన్ని BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) మాత్రం రూ.8 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గత నెల రోజులుగా నిఫ్టీ 50 ఫ్లాట్‌గా ఉండగా, నిఫ్టీ స్మాల్‌ క్యాప్ 50 ఇండెక్స్‌ 9.4% పెరిగింది, నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్‌ 11% జంప్‌ చేసింది. బలమైన కార్పొరేట్ ఆదాయాలతో పాటు, స్థానిక & సంస్థాగత పెట్టుబడిదార్లు చురుగ్గా డబ్బులు తెచ్చి కుమ్మరిస్తుండడం దీనికి కారణంగా మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


మిడ్ & స్మాల్ క్యాప్‌ల Q1 ఆదాయాలు అంచనాలకు తగ్గట్లుగా వచ్చాయి, కొన్ని కంపెనీలు అంచనాలను మించి రాణించాయి. దీంతోపాటు, చాలా స్మాల్‌ & మిడ్‌ క్యాప్ కంపెనీలు ఫండ్ మేనేజర్లతో సమావేశాలు నిర్వహించాయి. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి. 


లాభాలకు ఇంకా అవకాశం!
StoxBox చెబుతున్న ప్రకారం... మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్‌ 250-1,000 కంపెనీలు FY19 కంటే FY23లో దాదాపు 30% వెనుకబడి ఉన్నాయి. దీనర్ధం.. లాభాలు పంచడానికి వీటికి అవకాశం మిగిలే ఉంది. 


2010-2019 కాలంలో స్మాల్‌ క్యాప్ & మైక్రో క్యాప్స్‌ విభాగం క్షీణించింది లేదా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు.. ఫిన్‌టెక్, మైక్రో NBFCలు, రైల్వే సంబంధిత కంపెనీలు, టూ-వీలర్ EV స్టాక్స్‌ ఈ విభాగాన్ని నడిపించే ఛాన్స్‌ ఉంది.


బ్రాడర్‌ మార్కెట్‌లో, షిప్‌ బిల్డింగ్ కంపెనీలు (మజ్‌గావ్ డాక్‌యార్డ్, కొచ్చిన్ షిప్‌యార్డ్); ఎలక్ట్రిక్ బస్ ప్లేయర్స్ JBM ఆటో, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్; ఎలక్ట్రికల్ క్యాపిటల్ గుడ్ కంపెనీలు పాలిక్యాబ్, HPL, జెనస్ పవర్, సెర్వోటీచ్ వంటివి టాప్‌ విన్నర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి.


మొమెంటం కంటిన్యూ అవుతుందా?
స్మాల్ & మిడ్‌ క్యాప్స్‌ మొమెంటం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతానికి బలంగా కొనసాగుతోందన్నది మాత్రం సుస్పష్టం. 


ఇండియా గ్రోత్‌ స్టోరీకి ఉన్న అవకాశాలను దృష్ట్యా... కార్పొరేట్‌ ఆదాయాల వృద్ధికి సంబంధించిన ఔట్‌లుక్‌ ప్రస్తుతానికి సానుకూలంగా ఉంది. అయితే, వాల్యుయేషన్స్‌ కూడా అదుపులో ఉండాలి. ఇప్పుడు మార్కెట్‌లోని చాలా స్టాక్స్‌ చౌకగా దొరకడం లేదు. వాటికి కోసం ఎక్కువ ధర చెల్లిస్తే ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ పెరుగుతుంది, రివార్డ్‌ తగ్గుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఊరటనిచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial