Share Market Opening on 07 November 2023: వరుసగా మూడు రోజుల పాటు పుంజుకున్న స్టాక్ మార్కెట్ ఈ రోజు (మంగళవారం) కాస్త స్లోగా కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీలు మిక్స్‌డ్‌ ట్రేడ్‌తో స్టార్టయ్యాయి. సెన్సెక్స్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభం కాగా, నిఫ్టీ స్వల్పంగా స్లిప్‌ అయింది. బ్యాంక్ నిఫ్టీ 170 పాయింట్లకు పైగా క్షీణతతో 43,500 దిగువన ట్రేడవుతోంది.


ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ ఇలా జరిగింది...
నిన్న (సోమవారం) 594.91 పాయింట్లు లేదా 0.92 శాతం జంప్‌తో 64,958 వద్ద ముగిసిన BSE సెన్సెక్స్, ఈ రోజు 62.6 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 65,021 వద్ద ప్రారంభమైంది. నిన్న 181 పాయింట్ల జంప్‌తో 19,412 వద్ద క్లోజ్‌ అయిన NSE నిఫ్టీ, ఈ రోజు 8 పాయింట్లు పడిపోయి 19,404 స్థాయి వద్ద ఓపెన్‌ అయింది.


సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
ఈ రోజు ట్రేడ్‌ ఓపెనింగ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 13 షేర్లు లాభాలతో, 17 పతనంతో ప్రారంభమయ్యాయి. ఆ సమయానికి పెరిగిన స్టాక్స్‌లో... బజాజ్ ఫిన్‌సర్వ్ 1.67 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.91 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.48 శాతం, NTPC 0.42, సన్ ఫార్మా 0.40 శాతం గ్రీన్‌ మార్క్‌లో ఉన్నాయి.


నిఫ్టీ చిత్రం
మార్కెట్‌ ప్రారంభంలో, నిఫ్టీ 50 ప్యాక్‌లో 23 షేర్లు గ్రీన్‌లో ట్రేడ్‌ అయ్యాయి. అదే సమయంలో, 27 షేర్లలో బలహీనత కనిపించింది. టాప్ గెయినర్స్‌లో... బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ONGC, సిప్లా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి.


నిఫ్టీ సెక్టోరియల్‌ ఇండెక్స్‌ల్లో... ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ ఇండెక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ రంగాలు పుంజుకున్నాయి. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్టీ, మీడియా, FMCG రంగాల్లో క్షీణత కనిపించింది. 


ప్రి-మార్కెట్ పరిస్థితి
స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లో, సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంతో 64,996 స్థాయి వద్ద ట్రేడయింది. నిఫ్టీ 6.45 పాయింట్ల స్వల్ప క్షీణతతో 19,405 స్థాయిలో ఉంది.


ఉదయం 10 గంటల సమయానికి, నిఫ్టీ 53.40 పాయింట్లు లేదా 0.28% రెడ్‌ మార్క్‌తో 19,358 స్థాయి వద్ద కదులుతోంది. సెన్సెక్స్‌ 224.39 పాయింట్లు లేదా 0.35% పడిపోయి 64,734 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


లాభపడిన అమెరికన్‌ స్టాక్స్
సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయం తర్వాత, ఫెడరల్ రిజర్వ్ పాలసీ మేకర్ల మార్గదర్శకాల కోసం పెట్టుబడిదార్లు ఎదురు చూస్తుండడంతో US స్టాక్స్‌ సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. పెద్ద మొత్తంలో బాండ్ సప్లై కూడా మార్కెట్‌ను తాకేందుకు సిద్ధంగా ఉంది. బాండ్ ఈల్డ్స్‌ మళ్లీ పెరగడంతో US షేర్లలో లాభాలు పరిమితం అయ్యాయి.


ఆసియా షేర్లు పతనం
రేట్ల పెంపులో ఫెడరల్ రిజర్వ్ ఫైనల్‌ స్టేజ్‌ను పూర్తి చేసిందా, లేదా అనే దానిపై తాజాగా సందేహాలు తలెత్తడంతో ఆసియా స్టాక్స్‌ క్షీణించాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial