Share Market Opening on 02 November 2023: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకోవడంతో అమెరికన్‌ మార్కెట్లలో స్ట్రాంగ్‌ మొమెంటం కనిపించింది, భారత మార్కెట్‌పైనా ఆ ప్రభావం పడింది. ఈ రోజు (గురువారం) దేశీయ మార్కెట్లు బలమైన బౌన్స్‌తో ప్రారంభం కావడంలో ఇన్వెస్టర్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. ఓపెనింగ్‌ ట్రేడ్‌లో, BSE సెన్సెక్స్‌ 400 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఆ వెంటనే 500 పాయింట్లకు పైగా జంప్‌ చేసింది. NSE నిఫ్టీ కూడా బలం ప్రదర్శించింది. 130 పాయింట్ల గ్రీన్‌ ఓపెనింగ్‌ను 150 పాయింట్లకు పైగా తీసుకెళ్లింది.


ఈ రోజు స్టాక్ మార్కెట్ ఓపెనింగ్
ఈ రోజు, సెన్సెక్స్ 442.07 పాయింట్లు లేదా 0.70 శాతం గ్యాప్‌-అప్‌తో 64,033 స్థాయి వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 130.85 పాయింట్లు లేదా 0.69 శాతం పెరుగుదలతో 19,120.00 స్థాయి వద్ద ప్రారంభమైంది. 


ఉదయం 10 గంటల సమయానికి నిఫ్టీ 0.83% లేదా 158 పాయింట్ల లాభంతో 19,147 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అదే సమయానికి సెన్సెక్స్‌ 0.83% లేదా 524 పాయింట్ల గెయిన్‌తో 64,116 వద్ద కదులుతోంది.


సెక్టోరల్ ఇండెక్స్‌ల చిత్రం
మార్కెట్‌ ఓపెనింగ్‌ ట్రేడ్‌లో నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు అప్పర్‌ హ్యాండ్‌లో ట్రేడయ్యాయి, రియల్టీ రంగంలో గరిష్టంగా 1.40 శాతం పెరుగుదల కనిపించింది. PSU స్టాక్స్‌లో 1.38 శాతం జంప్‌ కనిపించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 1.34 శాతం పెరుగుదల నమోదైంది. మీడియా షేర్లు 1.25 శాతం, ఐటీ షేర్లు 1.23 శాతం లాభపడ్డాయి.


ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్లతో పాటు స్మాల్‌ & మీడియం స్టాక్స్‌లో బూమ్ కారణంగా ఈ రోజు స్టాక్ మార్కెట్‌కు గట్టి సపోర్టు లభిస్తోంది. సెన్సెక్స్‌ 30లోని 28 షేర్లు లాభాలతో ట్రేడవుతుండగా, నిఫ్టీ 50లోని 49 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి.


పాలసీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడ్‌
అమెరికన్‌ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, వరుసగా రెండో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశంలోనూ USలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన FOMC భేటీలో, రేట్ సెట్టింగ్ కమిటీ సభ్యులు వడ్డీ రేట్లను 5.25-5.50 శాతం మధ్య ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్‌ పావెల్‌ ప్రకటించారు. ఈ వడ్డీ రేట్లు US చరిత్రలో 22 సంవత్సరాలలో అత్యధిక స్థాయిలో ఉన్నాయి.


అమెరికాలో ద్రవ్యోల్బణం రేటును తగ్గించేందుకు వడ్డీ రేట్లపై 'జాగ్రత్తతో కూడిన ద్రవ్య విధాన వైఖరి'ని ఫెడ్‌ కొనసాగిస్తుందని జెరోమ్ పావెల్ చెప్పారు. అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు 3.7 శాతంగా ఉంది. నిర్దేశిత లక్ష్యమైన 2 శాతం కంటే అధిక స్థాయిలో ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావడానికి వడ్డీ రేట్లపై అనువైన వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని ఫెడరల్ రిజర్వ్ అభిప్రాయపడింది. 


ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, ఫెడ్‌ ఛైర్మన్‌ సానుకూల వ్యాఖ్యలతో బుధవారం అమెరికన్‌ మార్కెట్లు ర్యాలీ చేశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.67 శాతం పెరుగుదలతో 33,274 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 210 పాయింట్లు లేదా 1.64 శాతం లాభంతో 13,061 వద్ద క్లోజయింది. S&P 500 ఇండెక్స్ కూడా 1.05 శాతం లాభంతో 4,237 స్థాయి వద్ద ఆగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial