రుద్రాణి కోపంగా స్వప్నను బయటకు గెంటేయబోతుంటే.. నన్ను ఒక్కదాన్నే కాదు మీ కొడుకును కూడా నాతో పాటు  బయటికి పంపించండి అంటుంది. లేదంటే కోర్టుకు వెళ్తానని బెదిరిస్తుంది. దీంతో బ్రహ్మముడి సీరియల్‌ ఇవాళ్టి ఎపిసోడ్‌ పలు మలుపులు తీసుకుంది.  స్వప్న అబద్దం బెబుతుందని కావ్య  అలాంటిది కాదని కనకం ఆమె భర్త కావ్యకు సపోర్టుగా మాట్లాడుతారు. ధాన్యలక్ష్మీ కూడా కావ్య చాలా మంచిదని స్వప్నను ఇంట్లోంచి గెంటేసే పరిస్థితి వచ్చింది కాబట్టే ఇప్పుడు కావ్య మీద నిందలు వేస్తుంది అంటుంది.  దీంతో సీరియస్‌ గా స్వప్న కావ్యను కనకం దగ్గరకు తీసుకుపోయి అమ్మ మీద ఒట్టేసి చెప్పు నాకు కడుపు లేదన్న విషయం నీకు తెలియదా? అని అడుగుతుంది. కావ్య షాకింగ్‌ గా ఒట్టు వేయకుండా ఉండిపోతుంది. 


స్వప్న : చూశారా అందరూ చూశారా? ఒట్టేయమంటే వేయట్లేదు. అంటే ఏంటి అర్థం ఇప్పటికైనా నా తప్పు లేదని మీకు అర్థం అయ్యిందా?  


రాజ్‌ : ఏంటిది?


కావ్య : ఏవండి అది కాదండి.. అసలు ఏం జరిగిందంటే..


రాజ్‌ : ఒక్కటే ఒక్క ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు. ఈ సలహా ఇచ్చింది నువ్వేనన్న విషయం కూడా పక్కన పెడతాను. స్వప్నకి కడుపు లేదన్న విషయం నీకు మొదటి నుంచి తెలుసా?


కావ్య : తెలుసు


రుద్రాణి : ఓరి దేవుడా..? ఇలాంటి అక్కాచెల్లెల్లను ప్రపంచంలే నేనెక్కడా చూడలేదు. 


రాజ్‌ : ముసుగు వేసుకుని తాళి కట్టించుకున్నప్పుడే నీ అసలు రంగు తెలిసింది. నన్ను మోసం చేయడమే కాకుండా ఇంత మందిని కూడా మోసం చేస్తావా? నీకు సిగ్గుగా అనిపించడం లేదా?


కావ్య: ఏవండి నాకు నిజంగా ఏ పాపం తెలియదండి. అసలు ఏం జరిగిందంటే


అపర్ణ : ఇంకా ఏం చెప్తావే.. ఇప్పటి వరకు చెప్పింది చాలు. మరో కట్టుకథ అల్లి మమ్మల్ని మోసం చేస్తావా?


అనగానే రుద్రాణి ఇంట్లో వాళ్లందరిని తిడుతుంది. ఇన్ని రోజులు నేను నొత్తి నోరు మొత్తుకుని చెప్పినా ఎవ్వరూ నా మాటలు వినలేదంటుంది. వీళ్ల కట్టుకథలు నమ్మి నన్ను అవమానించారు.  ఇప్పుడు చూడండి ఏం జరిగింది. 


అపర్ణ: రుద్రాణి ఆపు.. నీ కొడుక్కి ఎంత అన్యాయం జరిగిందో నా కొడుక్కి అంతే జరిగింది. నీ కోడలు ఎంత మోసం చేసిందో.. నా కోడలు అంతకు రెట్టింపు చేసింది. వీళ్ల వల్ల ఈ సంసారం బయటపడక ముందే నీ కోడలిని నువ్వు పంపించేయ్‌.. నా కోడలిని నేను పంపించేస్తాను.


అనగానే రుద్రాణి స్వప్నను బయటికి గెంటేయబోతుంటే.. నాతో పాటు మీ కొడుకు రాహుల్‌ను కూడా బయటికి పంపించండి. ఎందుకంటే మీ కొడుకు కూడా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు.  కాదు కూడదు అంటే  కోర్టుకు వెళ్తానని బెదిరిస్తుంది స్వప్న. నువ్వు ఎక్కడికైనా వెళ్లు ముందు ఇంట్లోంచి బయటికి వెళ్లవే అంటూ స్వప్నను రుద్రాణి గెంటేస్తుంటే..


సుభాష్‌: ఆపండి.. ఈ ఇంట్లో ఇప్పటిదాకా ఒక అబద్దం రాజ్యమేలింది. అందులో అనుమానమే లేదు. కానీ ఎవ్వరి కారణాలు వారికున్నాయి. అవి క్లియర్‌గా తెలిసిపోతున్నాయి.  ఈ ఇంట్లోంచి ఇప్పటికి వరకు ఎవ్వరూ కోర్టు మెట్లు ఎక్కలేదు. నాన్న కాపాడుకుంటూ వస్తున్న మన కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమవుతుంటే.. ఆయన గుండె తట్టుకోలేదు. నాన్న, అమ్మ, నేను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు.


రుద్రాణి : వీల్లేదు. క్షమించేదే లేదు. ఇంత జరిగిన తర్వాత వీళ్లిద్దరిని పుట్టింటికి పంపించాల్సిందే..


సుభాష్‌ : రుద్రాణి అందరూ నీలాగే భర్తని, అత్తింటిని వదిలేసి పుట్టింట్లోనే పడుండాలని కోరుకోవద్దు. నీ కోడలు చేసిన తప్పు వెనక నీ కొడుకు చేసిన మోసం కూడా ఉంది. నా కోడలు మోసం చేసిందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను.  వెళ్లాల్సి వస్తే ముందు నువ్వు మీ ఆయన దగ్గరకు వెళ్లు.


అని చెప్పి సుభాష్‌ వెళ్లిపోతాడు. రాజ్‌, కావ్యను కోపంగా చూసి పైకి వెళ్లిపోతాడు. స్వప్న కోపంగా కావ్య వైపు చూస్తుంటే కావ్య స్వప్నను కొడుతుంది.


స్వప్న : నన్నే కొడతావా..?


కావ్య : నీ పొగరు చూసి నీ అహంకారం చూసి ఈ ఇంట్లో వాళ్లు నిన్ను ఎంత ఛీదరించుకుంటున్నారో తెలుసా?


స్వప్న : నిన్ను మాత్రం పల్లకి ఎక్కించి ఊరేగిస్తున్నారా? ఛీ అన్నా పో అన్నా ఈ చూరు పట్టుకుని వేలాడతానంటే అలాగే అంటారు. నాలాగా ఎదురించి చూడు తోక ముడుచుకుని పోతారు.


అనగానే కావ్య..


అణిగి మణిగి ఉండాలని స్వప్నకు చెబుతుంది. తాను అలా బతకలేనని స్వప్న కరాకండిగా చెప్పగానే కావ్య కోపంగా స్వప్నను చూస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.