‘బిగ్ బాస్’ హౌస్‌లో నామినేషన్ల హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో అశ్వినీ, అమర్ దీప్‌లు రతిక గేమ్ గురించి యావర్‌ను ప్రశ్నించారు. అసలు రతిక లాస్ట్ వీక్ ఏమైనా గేమ్ ఆడిందా? అని అమర్ అడిగాడు. యావర్ స్పందిస్తూ.. ‘‘ఆమె ట్రై చేసింది కదా’’ అని సమాధానం ఇచ్చాడు. ‘‘ఏం ట్రై చేసింది? బాక్సును అలా కదిపి చూస్తుండిపోయింది’’ అని అమర్ అన్నాడు. దీంతో యావర్.. ‘‘అది కూడా ప్రయత్నమే కదా. అది కూడా ఆడటమే కదా’’ అని రతికాను వెనకేసుకుని వచ్చాడు. అశ్వినీ కలుగజేసుకుంటూ.. ‘‘ఆమె అతడి ఫ్రెండ్ కదా.. అవేవీ కనిపించవు’’ అని అన్నాడు. దీంతో యావర్‌కు కోపం వచ్చింది. ‘‘ఫ్రెండ్ ఏమిటీ? నామినేషన్స్‌లో నా పాయింట్ చెప్పి నిన్ను నామినేట్ చేశా. నువ్వు నన్ను నామినేట్ చేశావ్.. అంతే’’ అని అన్నాడు. ‘‘ఫస్ట్ నువ్వు నామినేట్ చేశావు కాబట్టే.. నేను నిన్న నామినేట్ చేశాను’’ అని అంది. దీంతో యావర్‌ మరింతగా అశ్వినీతో వాగ్వాదానికి దిగాడు. ‘‘మీద మీదకు వెళ్లడంతో కొడతావా ఏంటీ? అంత అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నావ్’’ అని అంది. 


శివాజీకి కంప్లైంట్ చేసిన యావర్.. శిష్యులకు ప్రత్యేక తరగతులు


అమర్, అశ్వినీలతో జరిగిన చర్చ గురించి శివాజీకి చెప్పాడు యావర్.. ‘‘బిగ్ బాస్ కంటే రతిక ఎక్కువ. రతికా కంటే బిగ్ బాస్ ఎక్కువ? అని శివాజీని అడిగాడు. దీంతో శివాజీ బిగ్ బాసే ఎక్కువ అన్నాడు. ‘‘ఇక్కడి వరకు వచ్చానంటే చాలా హైప్ కదా.. ఎందుకు నువ్వు హైప్ కోసం రతికా దగ్గరకు వెళ్తున్నావు అని అమర్ అంటున్నాడు’’ అని యావర్ అన్నాడు. దీంతో శివాజీ ‘‘వాడు హైప్ కోసం ఎంతమంది దగ్గరకు వెళ్తున్నాడు? వాడు వేస్ట్.. వాడు మారడు.. వదిలేయ్’’ అని అన్నాడు. ఆ తర్వాత మరో సందర్భంలో అమర్‌ను ఐటెమ్ రాజా అని పేర్కొన్నాడు. అనంతరం ఆయన శిష్యులు పల్లవి ప్రశాంత్, యావర్‌కు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు శివాజీ. ‘‘ఎవరైనా ఏమైనా అంటే కోపం వద్దు. జస్ట్ స్మైల్. ఇప్పుడు ఫైనల్స్‌కు వెళ్తున్నారు. వాడు అన్నడు.. వీడు అన్నడు అనేది వద్దు. ఎవరు ఏమన్నా సరే.. అగ్రెసివ్‌గా ఉండు. తప్పు చేయొద్దు. ఎవరు ఏమన్నా నవ్వుతో సమాధానం ఇవ్వు అంతే’’ అని అన్నాడు. ఆ తర్వాత అమర్ దీప్ తన బ్యాచ్‌తో మాట్లాడుతూ.. శివాజీ బ్యాచ్ తనని విలన్ చేయాలని అనుకుంటున్నారని అన్నాడు. నేను మంచోడిని అనిపించుకొనే ప్రయత్నం చేస్తున్నా అనుకుంటున్నారని తెలిపాడు. 


శివాజీ రతికాకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?


శివాజీ రతికాకు సపోర్ట్ చేయడాన్ని అశ్వినీ శ్రీకి నచ్చడం లేదు. ఇదే విషయాన్ని సీరియల్ బ్యాచ్ దగ్గర ప్రస్తావించింది అశ్వినీ. రతికాను శివాజీ పులి పిల్ల అంటున్నారు. ఎందుకు ఆయన అంతగా వెనకేసుకుని వస్తున్నారు? పుష్ చేయండి తప్పులేదు.. అందరినీ ఎంకరేజ్ చేయండి’’ అని అంది. దీనికి అమర్ స్పందిస్తూ.. ‘‘చూస్తూ ఉండండి. వాళ్ల బ్యాచ్ అందరినీ ఆయనే పంపించేసి.. చివరి వరకు ఉంటాడు’’ అని అన్నాడు. 


గేమ్ నుంచి ప్రశాంత్ ఔట్


కెప్టెన్సీ పోటీల్లో భాగంగా హౌస్‌లో సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించాడు బిగ్ బాస్. శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, అర్జున్, పల్లవి ప్రశాంత్, అశ్వినీ గర్జించే పులులు టీమ్‌లో, శోభాశెట్టి, యావర్, గౌతమ్, తేజా, రతిక, భోలే.. వీర సింహాలు టీమ్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఇచ్చిన బాల్స్ టాస్క్‌లో హౌస్‌మేట్స్ అంతా టీమ్‌లుగా తమ సంచుల్లో బాల్స్ నింపుకున్నారు. ఆ తర్వాత ఇచ్చిన మరో టాస్క్‌లో వీర సింహాలు టీమ్ గెలిచి ఒక కీ సాధించింది. దాని ప్రకారం.. వారికి ప్రత్యర్థుల టీమ్‌లో ఒకరిని తీసేసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా వీర సింహాలు టీమ్‌లో ఉన్న గౌతమ్, శోభ, తేజ, యావర్‌లు పల్లవి ప్రశాంత్‌ను తీసేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, భోలే మాత్రం దీనిపై ఏమీ స్పందించలేదు. మీ ఇష్టం అన్నట్లుగా వదిలేశాడు. దీంతో గౌతమ్.. ఇది టీమ్ నిర్ణయమని చెబుతూ గర్జించే పులుల టీమ్ నుంచి ప్రశాంత్‌ను తొలగించాడు. దీంతో ప్రశాంత్ ఏడుస్తూ కూర్చున్నాడు. దీనిపై శివాజీ స్పందిస్తూ.. ‘‘నువ్వు బాగా ఆడతావు కాబట్టే నిన్ను తీసేశారు. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. నిన్ను స్ట్రాంగ్ ప్లేయర్ అనే తీసేశారు’’ అన్నాడు. 


బాయ్ ఫ్రెండ్ కోసం శోభా కలవరం


హౌస్‌లోకి ఎంట్రి ఇచ్చిన రోజు నుంచి టేస్టీ తేజాతో శోభా శెట్టి క్లోజ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. గత వారం నామినేషన్స్ వల్ల దాదాపు ఎలిమినేషన్ వరకు వెళ్లిన శోభాకు.. ఎప్పుడైనా సరే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని అర్థమైనట్లుంది. ఈ వారం కూడా ఆమె నామినేషన్స్‌లో ఉండటంతో.. తన బాయ్ ఫ్రెండ్‌ను గుర్తు తెచ్చకుంది. ‘‘వాడికి నచ్చనది ఏమైనా చేస్తున్నానేమో అనిపిస్తోంది. ఎందుకంటే నీతో ఉండటాన్ని వేరేగా భావించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆలోచిస్తారు’’ అని అంది. దానికి తేజా సమాధానమిస్తూ.. ‘‘నేను కామెడీ పీసు. అదేమీ ఉండదులే’’ అని అన్నాడు. ‘‘ఏమైనా సరే.. అతడి అలా అనిపిస్తే నేను తట్టుకోలేను. అతడు బాగా గుర్తుకొస్తున్నాడు’’ అని శోభా తెలిపింది. 


Also Read: పల్లవి ప్రశాంత్‌ను ఆట నుంచి తప్పించిన గౌతమ్ టీమ్ - మైండ్ గేమ్‌తో అల్లాడిస్తున్న శివాజీ