‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌మేట్స్ యెల్లో, రెడ్ టీమ్‌లు విడిపోయారు. ముందుగా వారికి ‘హాల్ ఆఫ్ బాల్’ టాస్క్ ఇచ్చాడు. వ్యక్తిగతంగా మీకున్న బలాలను పూర్తిగా ఉపయోగించి.. ఈ టాస్క్‌లో పాల్గోవాలని సూచించాడు. శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, అర్జున్, పల్లవి ప్రశాంత్ (Pallavi Prasanth), అశ్వినీ యెల్లో టీమ్‌గా, శోభాశెట్టి, యావర్, గౌతమ్, తేజా, రతిక, భోలే.. ఆరెంజ్ టీమ్‌గా విడిపోయారు. ఆటలో భాగంగా కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ ఇచ్చిన సంచులను పట్టుకుని.. పై నుంచి వస్తున్న బాల్స్‌ను పట్టుకోవాలి. బాల్స్‌ను ఏరుకొనే హడావిడిలో శివాజీ కిందపడిపోయాడు. దీంతో జాగ్రత్త ఆడన్నా అని తేజా సూచించాడు. అయితే, ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాల్సి ఉంది. 


ఆ తర్వాత బిగ్ బాస్.. బెలూన్ల టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే ఎక్కువ బెలూన్లను టైర్లలో పెడతారో వారు విజేతలుగా నిలుస్తారని తెలిపాడు. ఈ సందర్భంగా యెల్లో, రెడ్ టీమ్‌లు పోటాపోటీగా ఆడారు. ఇందులో ఆరేంజ్ టీమ్ ఎక్కువ బెలూన్లు పెట్టి లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరెంజ్ టీమ్‌కు మంచి అవకాశం వచ్చింది. యెల్లో టీమ్‌ నుంచి ఒకరిని తీసేసి,  ‘డెడ్’ బోర్ట్ వేసే అవకాశం దక్కింది. దీంతో గౌతమ్ (ఆరెంజ్) టీమ్.. పల్లవి ప్రశాంత్‌ను తొలగించాలని నిర్ణయించారు. దీంతో శివాజీ దమ్ముంటే నన్ను తీయాలని గానీ, ప్రశాంత్‌ను తియ్యండం ఏంట్రా అని కామెంట్స్ చేశాడు. తనని గేమ్ నుంచి తప్పించడంపై పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో శివాజీ, శోభాశెట్టి, అర్జున్.. ప్రశాంత్‌ను కూల్ చేసే ప్రయత్నం చేశారు. ‘‘నీకు ఇది కలిసి వస్తుంది’’ అని ప్రశాంత్‌తో అన్నాడు అర్జున్. 


మైండ్ గేమ్ ఆడుతోన్న శివాజీ


శివాజీ అభిమానులకు ఇది కాస్త మింగుడు పడని విషయమే అయినా.. ప్రేక్షకుడికి తప్పకుండా ఆయన గేమ్ ప్లాన్ అర్థమవుతుంది. అక్కడ ఆడుతుంది ఫిజికల్ టాస్క్.. కానీ, శివాజీ మాత్రం తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. ఒక స్ట్రాటజీ ప్రకారం పల్లవి ప్రశాంత్‌ను తీసేస్తే.. దాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేశారు శివాజీ. ఛాన్స్ దొరికినప్పుడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. అందుకే, హౌస్‌లో ఉన్న ఎవరూ శివాజీ దగ్గర ఉన్న బాల్స్‌ను తీసుకోడానికి ప్రయత్నించడం లేదు. అలాగే, తన బాల్స్‌ను కాపాడుకొనేందుకు.. సందీప్ ఎలిమినేషన్‌ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు శివాజీ. ముఖ్యంగా తేజాలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడంలో శివాజీ సక్సెస్ అయ్యారు. సందీప్ ఫౌల్ గేమ్ ఆడటం వల్లే ప్రేక్షకులు అతడిని ఎలిమినేట్ చేసి ఉంటారని తేజా అన్నారు. అయితే, అంతకు ముందు శివాజీ.. వేరే కారణం చెప్పారు. తాను డ్యాన్సర్ కాదు అన్నందుకే ఎలిమినేట్ అయ్యి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆట దగ్గరకు వచ్చేసరికి.. హౌస్‌మేట్స్ ఫౌల్ గేమ్ ఆడుతూ.. తన బాల్స్‌ను దొంగిలించకూడదనే ఉద్దేశంతో శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. 


Also Read : రతిక ‘గాలి’ తీసేసిన గౌతమ్, యావర్‌ను ‘కెలికిన’ అశ్విని - మరీ ఇంత సిల్లీగా ఉన్నారేంటీ బాస్!