Stock market news in Telugu: స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల ప్రస్తుత పని తీరు, సామర్థ్యం, లాభనష్టాలు, భవిష్యత్‌ ప్రణాళికలు, మరికొన్ని అంశాల ఆధారంగా వాటిపై అంచనాలు మారిపోతుంటాయి. మార్కెట్‌ను ట్రాక్‌ చేసే వివిధ బ్రోకింగ్‌ కంపెనీలు, వివిధ స్టాక్స్‌ మీద తరచూ రికమెండేషన్స్‌ (బయ్‌, సెల్‌, హోల్డ్‌, టార్గెట్‌ ప్రైస్‌) చేస్తుంటాయి. ఇంతకుముందు చెప్పిన అంశాల ఆధారంగానే బ్రోకరేజ్‌లు కూడా ఈ సిఫార్సులు చేస్తుంటాయి.


తాజాగా. జొమాటో, సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌, IEX, యాక్సిస్‌ బ్యాంక్‌ మీద వివిధ బ్రోకింగ్‌ కంపెనీలు కొత్త అంచనాలను వెల్లడించాయి. మార్కెట్‌లోని ట్రేడర్లు & ఇన్వెస్టర్లలో కొందరు ఈ సిఫార్సుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. బ్రోకింగ్‌ కంపెనీలు డీప్‌ రీసెస్చ్‌ చేసిన తర్వాతే అలాంటి రికమెండేషన్స్‌ చేస్తాయన్నది వాళ్ల నమ్మకం.


బ్రోకరేజ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ, జొమాటో స్టాక్‌ మీద ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను కొనసాగించింది. మరో బ్రోకింగ్‌ కంపెనీ నువామా, సుప్రీం ఇండస్ట్రీస్‌ స్టాక్‌ను బయ్‌కి అప్‌గ్రేడ్ చేసింది. IEX షేర్లను అమ్మేయమని యాక్సిస్ క్యాపిటల్ చెబుతోంది. యాక్సిస్ బ్యాంక్‌ షేర్లను కొనమంటూ బయ్‌ కాల్‌ ఇచ్చింది మోతీలాల్ ఓస్వాల్‌.


జొమాటో ‍‌(Zomato Shares Rating & Target Price 2023)


బ్రోకరేజ్‌: మోర్గాన్ స్టాన్లీ   |   రేటింగ్‌: ఓవర్‌వెయిట్‌   |   టార్గెట్: రూ.140


ఈ స్టాక్‌ ఇప్పటికే స్ట్రాంగ్‌ ఔట్‌పెర్ఫార్మన్స్‌ చేసినా, ఇంకా పెరిగేందుకు చాలా అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (మోర్గాన్ స్టాన్లీ) చెబుతోంది. క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌ బాగా పెరుగుతుందని, ఆపరేటింగ్‌ లీవరేజ్‌కు ఇంకా స్కోప్‌ ఉందని బ్రోకింగ్‌ కంపెనీ అంచనా వేసింది. జొమాటో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో స్థిరమైన పనితీరును ఆశిస్తోంది. కాంపిటీటర్లతో (స్విగ్గీ) పోలిస్తే, జొమాటోలో రిపీట్‌ యూజర్‌ బేస్‌ పెరుగుతోందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ వెల్లడించింది.


సుప్రీం ఇండస్ట్రీస్‌ ‍‌(Supreme Industries Shares Rating & Target Price 2023)


బ్రోకరేజ్‌: నువామా   |   రేటింగ్‌: బయ్‌   |   టార్గెట్: రూ. 4,959


సుప్రీమ్ ఇండస్ట్రీస్‌కు రూ.4,959 టార్గెట్ ప్రైస్‌తో, బయ్‌ రేటింగ్‌ను నువామా కొనసాగించింది. మీడియం టర్మ్‌లో 15% పైగా వాల్యూమ్ CAGRను ఈ కంపెనీ సాధించగలమని నమ్మకంగా ఉంది.


ఐఈఎక్స్‌ ‍‌(IEX Shares Rating & Target Price 2023)


బ్రోకరేజ్‌: యాక్సిస్ క్యాపిటల్   |   రేటింగ్‌: సెల్‌   |   టార్గెట్: రూ. 110


బంతి మళ్లీ CERC కోర్టుకు చేరింది. కేంద్ర విద్యుత్‌ శాఖ (MoP), విద్యుత్ మార్కెట్ అభివృద్ధి కోసం కప్లింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో, IEX షేర్లకు సెల్‌ రేటింగ్‌ ఇచ్చిన యాక్సిస్ క్యాపిటల్, రూ.110 టార్గెట్ ప్రైస్‌ పెట్టింది.


యాక్సిస్ బ్యాంక్‌ ‍‌(Axis Bank Shares Rating & Target Price 2023)


బ్రోకరేజ్‌: మోతీలాల్ ఓస్వాల్   |   రేటింగ్‌: బయ్‌   |   టార్గెట్: రూ. 1,150


బలమైన, స్థిరమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్న నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్‌ ఫోకస్‌లో ఉంది. కొత్త రిస్క్ వెయిట్ అసెట్స్ నిబంధనలను ప్రవేశపెట్టినా ఈ బ్యాంక్‌ పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ లెక్కగట్టింది. ఆస్తి నాణ్యత సమస్యలు కూడా తగ్గాయని అంటోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌లో మూడు రోజులుగా అదే సీన్‌ - రైజింగ్‌లో ఫార్మా స్టాక్స్‌