Stock Market News in Telugu: మార్కెట్ల ఔట్‌లుక్‌ అంచనా ఆధారంగా, సంవత్ 2080 కోసం, దీపావళి సందర్భంగా కొనుగోలు చేయదగిన ఎనిమిది స్టాక్స్‌ జాబితాను కోటక్ సెక్యూరిటీస్ విడుదల చేసింది. మార్కెట్లు రిచ్‌ వాల్యుయేషన్స్‌లో ఉన్నందున, మార్కెట్ కరెక్షన్ నుంచి అందివచ్చే అవకాశాలను దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఉపయోగించుకోచ్చని, నాణ్యమైన స్టాక్స్‌ను పోర్టిఫోలియోలకు జోడించమని కోటక్ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తెలిపింది.


దీపావళి కోసం కోటక్ సెక్యూరిటీస్ కొనమంటున్న స్టాక్స్‌:


కెనరా బ్యాంక్: బయ్‌ | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 387 | ప్రైస్ టార్గెట్: రూ. 425
కెనరా బ్యాంక్, తన PSU బ్యాంక్ పీర్స్‌ కంటే డిస్కౌంట్‌ ధరలో ట్రేడ్‌ అవుతోంది. కోటక్ సెక్యూరిటీస్‌, గతంలో రూ.400గా ఉన్న టార్గెట్ ప్రైస్‌ను ఇప్పుడు రూ.425కు మార్చింది, ఈ షేర్లను 'కొనుగోలు' చేయమంటోంది.


సిప్లా: యాడ్ | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,206 | ప్రైస్ టార్గెట్: రూ. 1,320
కోటక్, సిప్లా షేర్ల మీద యాడ్ రేటింగ్‌ను కంటిన్యూ చేసింది. ప్రైస్‌ టార్గెట్‌ను రూ. 1,290 నుంచి రూ. 1,320కు పెంచింది. 2025 ఎర్నింగ్స్‌ అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది.


సైయెంట్‌: బయ్‌ | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,660 | ప్రైస్ టార్గెట్: రూ. 2,000
ఈ కంపెనీ, తన నికర లాభంలో 50%ను డివిడెండ్‌గా తిరిగి ఇవ్వడం కొనసాగిస్తుంది, 19X FY25E PE వద్ద వాల్యూస్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని కోటక్ పేర్కొంది.


దాల్మియా భారత్: యాడ్ | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 2,076 | ప్రైస్ టార్గెట్: రూ. 2,350
మెరుగైన మూలధన కేటాయింపులు, వృద్ధి అవకాశాలు, చవకైన విలువల కారణంగా దాల్మియా భారత్‌ షేర్లు ప్రస్తుత మార్కెట్ ధర వద్ద ఆకర్షణీయమైన రిస్క్-రివార్డ్‌ను చూస్తున్నట్లు కోటక్‌ వెల్లడించింది. దీనికి రూ. 2,350 లక్ష్యం ఇచ్చింది.


గోద్రెజ్ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌: యాడ్ | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,021 | ప్రైస్ టార్గెట్: రూ. 1,135
వరుసగా రెండు త్రైమాసికాల్లో రెండంకెల వృద్ధిని చూపినప్పటికీ, స్థిరమైన వృద్ధిలోకి రావడానికి మరిన్ని చర్యలు అవసరమని ఈ కంపెనీ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడింది.


మాక్రోటెక్ డెవలపర్స్‌ (లోధా): యాడ్ | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 849 | ప్రైస్ టార్గెట్: రూ. 840
విభిన్నమైన ప్రాంతాల్లో వ్యాపార ఉనికితో మరింత మార్కెట్ వాటాను పొందేందుకు ఈ రియల్ ఎస్టేట్ ప్లేయర్ మంచి పొజిషన్‌లో ఉంది. భవిష్యత్తులో మరిన్ని లాంచ్‌లు, అమ్మకాలకు ఉన్న అవకాశాలను బట్టి అన్ని అంశాల్లో ఈ కంపెనీ మంచి నంబర్లను కొనసాగిస్తుందని కోటక్ చెప్పింది.


PCBL: బయ్‌ | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 197 | ప్రైస్ టార్గెట్: రూ. 260
కోటక్ సెక్యూరిటీస్‌, ఈ స్టాక్‌పై గతంలో ఇచ్చిన 'యాడ్' రేటింగ్‌ను ఇప్పుడు 'బయ్‌'కి అప్‌గ్రేడ్ చేసింది. ప్రైస్‌ టార్గెట్‌ను గతంలోని రూ. 179 నుంచి రూ. 260 సవరించింది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: బయ్‌ | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 2,319 | ప్రైస్ టార్గెట్: రూ. 2,725
RIL ప్రతి కీలక సెగ్మెంట్‌లో ఔట్‌లుక్‌ పటిష్టంగా ఉంది. జియో 5G రోల్‌-ఔట్‌ పూర్తయ్యే దశలో ఉన్నందున, 5G మానిటైజేషన్‌పైకి ఫోకస్‌ మారుతుందని కోటక్ అభిప్రాయపడింది. ఇటీవలి జియో ఎయిర్‌ఫైబర్‌ లాంచ్‌ మొదటి అడుగుగా ఉంటుంది. 5Gలో పెరుగుతున్న సబ్‌స్క్రైబర్ బేస్ & కన్స్యూమర్ ఎంగేజ్‌మెంట్‌తో, త్వరలో టారిఫ్ పెంపు జరిగే అవకాశం ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ SoTP (సమ్-ఆఫ్-ది-పార్ట్స్) ఆధారంగా, ఒక్కో షేరుకు రూ. 2,725 టార్గెట్‌ను కోటక్‌ ఇచ్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: దేశంలో పెరిగిన విదేశీ కరెన్సీ, ఇప్పుడు ఇండియా దగ్గర 586.11 బిలియన్ డాలర్ల ఫారెక్స్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial