Guppedantha Manasu November 4th Episode (గుప్పెడంతమనసు నవంబరు 4 ఎపిసోడ్)


తన పథకాలు పారలేదని శైలేంద్ర కోపంగా ఉన్నప్పుడు ధరణి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ధరణిపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. సెటైర్ల మదీ సెటైర్లు వేసిన ధరణి...మావయ్యగారు మీ ఇద్దర్నీ మాట్లాడుకోకుండా చేయమని చెప్పారని గుర్తుచేస్తుంది. ఇద్దరూ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత దేవయాని-శైలేంద్ర ఇద్దరూ ముకుల్ గురించి మాట్లాడుకుంటారు. ముకుల్ కన్నా రిషి డేంజర్... రిషికి నిజం తెలిస్తే మనల్ని చంపేస్తాడని భయపడుతుంది. ముకుల్ సంగతి నేను చూసుకుంటానంటాడు శైలేంద్ర...


Also Read: మల్లెపూల ముచ్చట్లలో మునిగితేలిన రిషిధార , శైలేంద్రని అమాయకంగా చంపేస్తోన్న ధరణి!


మహేంద్రకు కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు రిషి. ఏంటి నువ్వు తీసుకొచ్చావని అడుగిన మహేంద్ర..నిన్న పెద్దమ్మ వాళ్లింటికి వెళ్లావు కదా ఏంటి స్పెషల్ అని అడుగుతాడు..
రిషి: నేను పర్సనల్ విషయాలు మాట్లాడేందుకు వెళ్లలేదు..ముకుల్ ని పరిచయం చేసేందుకు వెళ్లాను, తను అమ్మ స్టూడెంట్, ముకుల్ ఈ కేసును ఛేదిస్తారు, త్వరలోనే నేరస్తులు ఎవరనేది తెలుస్తుంది డాడ్ 
మహేంద్ర: తెలియాలి..తెలిసిన తర్వాత వాడికి శిక్ష వేయాలి..అప్పుడే మీ అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుంది..
రిషి: అమ్మని మనకు కాకుండా చేసినవాళ్లని నామరూపాలు లేకుండా చేస్తాను..ఎంతటివారైనా సరే అమ్మ ప్రాణం పోవడానికి కారణం అయిన వాళ్లెవరో తెలిసిన వెంటనే వాళ్లని మీ ముందే శిక్షిస్తాను. మీరు ముకుల్ ని కలుస్తారా
మహేంద్ర: ఇన్వెస్టిగేషన్ కి అవసరం అయిన విషయాలు చెప్పమంటే చెబుతాను
రిషి: తనని ఓసారి ఇంటికి రమ్మని చెబుతానని చెప్పేసి బయటకు వెళ్లిపోతాడు రిషి
ఈ సారి వాళ్ల బండారం బయటపడడం ఖాయం అంటుంది వసుధార..అదే నిజం కావాలంటాడు మహేంద్ర..


Also Read: తాతయ్యకు నిజం చెప్పిన కావ్య – ఇద్దర్నీ ఇంట్లోంచి వెళ్లపోమని వార్నింగ్‌ ఇచ్చిన అపర్ణ!


మహేంద్ర ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుపమ ఆలోచనలో పడుతుంది. జగతికి ఏమైంది, ఏ విషయం తెలియడం లేదు..ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒంటరిగా ఉండిపోవాలా? మహేంద్రను కలవాలా అనుకుంటుంది..ఏం నిర్ణయించుకున్నావని అప్పుడే అక్కడకు వచ్చిన పెద్దమ్మ అడిగితే ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదంటుంది 
అనుపమ: మహేంద్ర ని కలసినప్పటి నుంచీ కుదురుగా ఉండలేకపోతున్నాను..మళ్లీ మహేంద్ర ఎదురుపడగానే జ్ఞాపకాలు ఊపిరి పోసుకున్నాయి. ఎటు చూసినా ఏం చేసినా అవే ఆలోచనలు..నా గతం నన్ను ఓ పట్టాన ఉండనీయడం లేదు
పెద్దమ్మ: ఇన్నాళ్లీ నీ పంతంపై నువ్వున్నావు ఇప్పుడైనా ఆలోచించు..
అనుపమ: నువ్వు చెప్పినట్టే నా ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లాలని అనిపిస్తోంది. నేను కోల్పోయింది తిరిగి పొందాలి అనుకుంటున్నాను, నువ్వు చెప్పినట్టు కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటున్నాను, కోపం తగ్గించుకుంటాను
పెద్దమ్మ: చాలామంచిమాట చెప్పావు..ఆలస్యం చేయకుండా నీ ప్రయాణం మొదలుపెట్టు..నీ మనసులో ప్రశ్నకి సమాధానం దొరికే వరకూ నేను చెప్పినట్టు చేయి. మన జీవితంలో కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులను మాత్రం బాధపెట్టకూడదు..మన ఓటమికి వాళ్లని దోషుల్ని చేసి మాట్లాడకూడదు, మన దుఃఖానికి వాళ్లని కారణం చేయకూడదు.అయిన వాళ్ల విషయంలో కఠినంగా ఉండొద్దు... వాళ్లని కూడా వెళ్లి కలువు
అనుపమ: 


Also Read: ఓ వైపు అనుపమ, మరోవైపు ముకుల్ - దేవయాని, శైలేంద్ర చుట్టూ ఉచ్చు బిగిస్తోన్న రిషిధార!


రిషి రెడీ అవుతుంటాడు..ఇంకా ఎంతసేపు స్నానం అని అడుగుతుంది..వెయిట్ అనగానే..సరే అయి వెయిటింగ్ ఫర్ యూ అని లెటర్ పెట్టేసి వెళ్లిపోతుంది. బయటకు వచ్చిన రిషి ఆ లెటర్ చూసి..అస్సలు కొద్దిసేపు కూడా వెయిట్ చేయదు అనుకుంటాడు. ఎక్కడున్నావ్ అని ఇద్దరూ కాసేపు చాటింగ్ చేసుకుంటారు. ఇంట్లో ఒకరు-బయట మరొకరు ఉండి కొద్దిసేపు వాట్సాప్ చాట్ చేసుకుంటారు.  


మరోవైపు దేవయాని-శైలేంద్ర ఇద్దరూ ముకుల్ మాటలు గుర్తుచేసుకుని ఆలోచనలో పడతారు..అప్పుడే అక్కడకు వస్తాడు ఫణీంద్ర. 
ఫణీంద్ర: నువ్వెందుకు రాత్రి లేటుగా పడుకున్నావ్
ధరణి: అవును మావయ్యా ఈయన కూడా లేటుగానే పడుకున్నారు
మళ్లీ ఇరికించేసింది అనుకుంటాడు శైలేంద్ర
ఫణీంద్ర: వీళ్లిద్దర్నీ మాట్లాడుకోనివ్వొద్దని టాస్క్ ఇచ్చాను కదా..నువ్వు ఓడిపోయావు
ధరణి: నేను తప్పకుండా గెలుస్తాను..
దేవయాని: నేను బాధలో ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు..రిషికి కాల్ చేసి ఇంటికి రమ్మని బతిమలాడాను తను కూడా త్వరలో వస్తాడు అనుకున్నాను...కానీ ఎంక్వైరీకి మనిషిని ఇంటికి తీసుకొస్తాడు అనుకోలేదు..అసలు రిషి ఇలా మారిపోయాడేంటి..మహేంద్ర వల్లే రిషి ఇలా తయారయ్యాడు
ఫణీంద్ర: దేవయానీ...పిచ్చిపిచ్చిగా మాట్లాడకు ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు..నువ్వు ఇప్పటివరకూ చేసిన ఘనకార్యాలు చాలు ఇంకా ఏం చేయకు..నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి వాళ్ల మనసు నొప్పించకు..తనెంత గొప్పవాడో తెలుసా నీకు మనం ఉమ్మడి కుటుంబంగా ఉండాలనే ఆలోచనతో భార్యను కూడా దూరం పెట్టిన మహాత్ముడు..ఇప్పటికీ నువ్వు జగతి-మహేంద్రను అర్థం చేసుకోలేదు, ఇకపై అర్థం చేసుకోలేవని అర్థమైంది..మళ్లీ చెబుతున్నా..మీరు వాళ్ల విషయాల్లో కలగజేసుకుంటే నా కోపం చూడాల్సి వస్తుంది జాగ్రత్త. 
ధరణి: మావయ్య గారూ థ్యాంక్స్ అంటుంది ధరణి....
ఫణీంద్ర; ఇంట్లో నీ పరిస్థితి నా పరిస్థితి ఒక్కటే...ముందు మనం మారాలి..వీళ్లిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే అప్పుడైనా నాకు మనశ్సాంతి దొరుకుతుందేమో అనేసి వెళ్లిపోతాడు
నిజంగా మీరు దేవుడు మావయ్యా అందుకే మీరు బాధపడతారని చిన్నత్తయ్య మీకు చెప్పలేక బలయ్యారని అనుకుంటుంది ధరణి...
నువ్వు డాడ్ దగ్గర ఇలా మాట్లాడితే డాడ్ కి కోపం వచ్చి రిషి వాళ్ల దగ్గరకు వెళ్లిపోతారు..నువ్వు జాగ్రత్తగా ఉండు మామ్ అని హెచ్చరిస్తాడు శైలేంద్ర..


అటు ఇంటి బయట వెయిట్ చేస్తుంటుంది వసుధార.. వెయిటింగ్ ఫర్ యూ అని లెటర్ పెట్టడంవల్ల ఫీలయ్యారేమో..అయినా నేను ఇలా బయటకు రావడం కరెక్ట్ కాదు వెళ్లి సార్ ని తీసుకొస్తాను అనుకుంటూ ఇంట్లోకి వెళ్లబోతుంటే రిషి వస్తాడు...ఏంటి వెనక్కు వస్తున్నావని అడుగుతాడు. మీరు చెప్పిన టైమ్ అయిపోయింది సార్ చాలా సేపు వెయిట్ చేశానంటుంది..అంటే నేను లేట్ చేశాననా అని రివర్స్ లో అడుగుతాడు. కాలేజీలో ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉందికదా టైమ్ కి వెళ్లాలి కదా అని వచ్చాను...కానీ బయటకు రాగానే బోర్డు మీటింగ్ ముఖ్యమా, రిషి సార్ ముఖ్యమా అని త్రాసు వేసుకుంటే మీ వైపే మొగ్గింది..అందుకే ఇక్కడే ఉండిపోయానంటుంది. ఇలానే మాట్లాడుకుంటే నేను లేట్ చేసిన దానికన్నా నువ్వే ఎక్కువ లేట్ చేసినట్టు అవుతుంది...