Sensex Journey From 40,000 To 70,000: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది, ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఇటీవలే, BSE సెన్సెక్స్ 70,000 మార్క్‌కు, NSE నిఫ్టీ 21,000 స్థాయికి చేరి కొత్త చారిత్రాత్మక శిఖరాలను అధిరోహించాయి. 2019 మధ్యలో, సెన్సెక్స్ మొదటిసారి 40,000 మార్క్‌ను టచ్ చేసింది. అప్పటి నుంచి, ఈ సంవత్సరం 70,000 మైలురాయికి చేరుకునే వరకు సెన్సెక్స్ ప్రయాణం గొప్పగా సాగింది. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో అనేక ఆటుపోట్లను ఈ ఇండెక్స్ తట్టుకోవడమే కాదు, సుడిగుండాల సముద్రానికి ఎదురీదింది. కాబట్టి, ప్రపంచ పెట్టుబడిదార్లకు "మోస్ట్ వాంటెడ్"గా BSE సెన్సెక్స్ మారింది.
40,000 నుంచి 70,000 ర్యాలీ మధ్యలో, ప్రతి 10,000 పాయింట్ల వ్యవధిలో ఏడు స్టాక్స్ రెండంకెల రాబడిని ఇన్వెస్టర్లకు ఇచ్చాయి. ప్రతి 10,000 పాయింట్ల ల్యాప్‌లో 16% తగ్గకుండా రిటర్న్స్ డెలివెరీ చేశాయి. ఆ 7 సూపర్ స్టాక్స్.... టైటన్ కంపెనీ, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, JSW స్టీల్, నెస్లే ఇండియా.
ఇక్కడ మీరో ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. ఈ ఏడు స్టాక్స్ ఏడు రంగాలకు చెందినవి. ఏ రెండు స్టాక్స్ ఒకే రంగం నుంచి లేవు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే... ఈ నెలలో మొత్తం ఈ ఏడు షేర్లు కొత్త జీవిత కాల గరిష్టాలకు చేరాయి.
సెన్సెక్స్ 40,000 - 70,000 పాయింట్ల ర్యాలీలో స్థిరంగా పెరిగిన 7 స్టాక్స్:
టైటన్ కంపెనీ (Titan Co)
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్: 21
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 37
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 74
సన్ ఫార్మాస్యూటికల్స్ (Sun Pharmaceuticals)
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్: 51
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 22
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 61
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్: 47
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 16
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 41
భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel)
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్: 72
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 21
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 38
అల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement)
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్: 27
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 24
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 29
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel)
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్: 43
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 68
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 28
నెస్లే ఇండియా (Nestle India)
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్: 47
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 16
సెన్సెక్స్ 40,000 -50,000 ర్యాలీలో ఇచ్చిన రిటర్న్: 26
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: అద్భుతం చేసిన టాక్స్ సేవింగ్ ఫండ్స్, ఈ ఏడాది 45 శాతం లాభాల వర్షం