Stock Market News: ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో ప్రస్తుతం బేరిష్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నిఫ్టీ 3% పైగా నష్టపోయంది. ఇదే సమయంలో, మార్కెట్ ఎనలిస్ట్‌లకు 8 స్టాక్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కనీసం 35 మంది, లేదా అంతకంటే ఎక్కువ మంది విశ్లేషకులు ఈ కౌంటర్ల పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. బ్యాంకింగ్, ఆటో, ఐటీ వంటి వివిధ రంగాల్లో ఈ స్క్రిప్స్ ట్రేడ్ చేస్తున్నాయి.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం.. 35 కంటే ఎక్కువ "స్ట్రాంగ్ బయ్" లేదా "బయ్" కాల్స్ ఉన్న 8 స్టాక్స్ జాబితా ఇది:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 521
స్టేట్ బ్యాంక్ మీద 37 మంది ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 713.4, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి ఈ స్క్రిప్ ఇంకా 37% ర్యాలీ చేయగలదని ఈ టార్గెట్ ధర అర్ధం.
లార్సెన్ & టూబ్రో (Larsen & Toubro)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 2,160
లార్సెన్ & టూబ్రో మీద 37 మంది ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 2,387.5, ప్రస్తుత మార్కెట్ ధరపైన ఈ కౌంటర్ మరో 11% లాభపడగలదని ఈ టార్గెట్ ధర అర్ధం.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,079
ఇండస్‌ఇండ్ బ్యాంక్ మీద 37 మంది ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 1,446.4. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి స్టాక్ ఇంకా 34% పైకి చేరుతుందని ఈ టార్గెట్ ధర అర్ధం.
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 840
ఐసీఐసీఐ బ్యాంక్ మీద 36 మంది ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 1,112.1, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి ఈ స్క్రిప్ ఇంకా 32% ర్యాలీ చేయగలదని ఈ టార్గెట్ ధర అర్ధం.
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
స్తుత మార్కెట్ ధర: రూ. Rs 845
యాక్సిస్ బ్యాంక్ మీద 36 మంది ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 1,117.7, ప్రస్తుత మార్కెట్ ధరధరపైన ఈ కౌంటర్ మరో 32% లాభపడగలదని ఈ టార్గెట్ ధర అర్ధం.
అల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 7,183
అల్ట్రాటెక్ సిమెంట్ మీద 35 మంది ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 7,766, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి స్టాక్ ఇంకా 8% పైకి చేరుతుందని ఈ టార్గెట్ ధర అర్ధం.
మహీంద్ర & మహీంద్ర (Mahindra & Mahindra)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,313
మహీంద్ర & మహీంద్ర మీద 35 మంది ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 1,542.7, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి ఈ స్క్రిప్ ఇంకా 17% ర్యాలీ చేయగలదని ఈ టార్గెట్ ధర అర్ధం.
ఇన్ఫోసిస్ (Infosys)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,552
ఇన్ఫోసిస్ మీద 35 మంది ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 1,746, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి స్టాక్ ఇంకా 13% పైకి చేరుతుందని ఈ టార్గెట్ ధర అర్ధం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.