New-Age Stocks Update: ప్రస్తుతం.. పేటీఎం (Paytm), జొమాటో (Zomato), పాలసీబజార్‌ పేరెంట్‌ కంపెనీ పీబీ ఫిన్‌టెక్ (PB Fintech) వంటి న్యూ-ఏజ్ టెక్ కంపెనీల టైమ్‌ పరుగులు పెడుతోంది. 2022తో పోలిస్తే, 2023లో ఈ స్టాక్స్‌ బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి. న్యూ-ఏజ్‌ టెక్‌ షేర్లలో చాలా పేర్లు 2023లో లోయర్‌ లెవెల్స్‌ నుంచి అద్భుతంగా ఎగబాకాయి, ఇన్వెస్టర్లకు పసందైన ప్రాఫిట్స్‌ అందించాయి.


2023లో 131% రాబడి ఇచ్చిన జొమాటో
ముందుగా, ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ 2021 జూలైలో IPOకు వచ్చింది, ఒక్కో షేరుకు రూ. 76 చొప్పున డబ్బులు సేకరించింది. ఈ ఏడాది జనవరి 25న స్టాక్‌ ప్రైస్‌ రూ. 44.35 కి పడిపోయింది. ఆ బాటమ్‌ లెవెల్‌ నుంచి బ్రహ్మండంగా పుంజుకుంది. ఈ నెల 7న, ఈ స్టాక్ గరిష్టంగా రూ. 102.85 కి చేరుకుంది. అంటే, కేవలం 6 నెలల్లో జొమాటో స్టాక్ 131 శాతం పెరిగింది. ఆ కనిష్ట స్థాయిలో జొమాటో షేర్లు కొన్నవాళ్ల పెట్టుబడి ఇప్పటికి రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది. ప్రస్తుతం, జొమాటో స్టాక్ దాని IPO ధర కంటే పైన, రూ. 93.45 వద్ద ట్రేడవుతోంది.


ఫుల్‌ రికవరీలో పేటీఎం
పేటీఎం షేర్ల ప్రయాణం కూడా గొప్పదే. ఈ సంవత్సరం జనవరి 2న, పేటీఎం స్టాక్ రూ. 532 వద్ద ట్రేడయింది. జూన్ 19న షేరు రూ. 914 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయి వరకు, ఇన్వెస్టర్లకు 72 శాతం రాబడి ఇచ్చింది. ప్రస్తుతం ఈ షేరు రూ. 865 వద్ద ట్రేడవుతోంది, ఈ లెక్క ప్రకారం 63 శాతం రిటర్న్‌ చేసింది. కానీ IPO ధర రూ. 2150 కంటే చాలా తక్కువలో ఈ స్టాక్‌ ట్రేడవుతోంది. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఒక్కో షేరుకు రూ. 1285 నష్టాన్ని భరిస్తున్నారు.


పాలసీ బజార్ షేర్ల దూకుడు
ఈ ఏడాది జనవరి 2న, పాలసీబజార్ PB ఫిన్‌టెక్ (పాలసీబజార్‌) షేర్ రూ. 452 వద్ద ట్రేడవుతోంది. ఇది ఆగస్టు 8న గరిష్టంగా రూ. 818 స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ షేరు రూ. 727 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 63 శాతం లాభాలను ఇచ్చింది. అయినా, పాలసీబజార్ స్టాక్ కూడా ఇప్పటికీ దాని IPO ధర రూ. 980 కంటే దిగువన ట్రేడవుతోంది. అయితే, లో లెవెల్స్‌ నుంచి మంచి రికవరీ కనబరిచింది. 


మరో న్యూ-ఏజ్‌ టెక్‌ స్టాక్‌ నైకాకు ఈ ఏడాది కలిసి రాలేదు. ఈ స్టాక్ పెట్టుబడిదార్లకు 6% నెగెటివ్‌ రిటర్న్స్‌ ఇచ్చింది.


మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్‌ అకౌంట్‌లో నామినీ పేరును ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎలా యాడ్‌ చేయాలి?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.