అధికార పార్టీలో సీట్ల పంచాయితీ మెదలైంది. సీట్ల వ్యవహరం సర్దుబాటు చేసే బాద్యతలను ఆ ఇద్దరికి జగన్ అప్పగించారనే ప్రచారం జోరుగా సాగుతోంది..


అభ్యర్దుల ఎంపిక బాధ్యతల్లో ఆ ఇద్దరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు అంటే ఆషా మాషీ కాదు. సీట్ల పంచాయితీ వ్యవహరం సర్దుబాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని పార్టీ నాయకులు చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు అంశాలను పార్టిలో కీలక నేతలు అయిన వై.వి.సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డిలకు అప్పగించారని టాక్ నడుస్తోంది. దీంతో ఆ ఇద్దరు నాయకులు నియోజకవర్గాల పరిస్దితులు పై పరిశీలన చేసి, అభ్యర్దుల ఎంపిక పై తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు అందిస్తారని అంటున్నారు. సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు నియోజకవర్గాల పై ఫోకస్ పెట్టారు. వీళ్ల వద్ద ఆమోదం లభిస్తే ఫైనల్ టచ్ గా జగన్ ఒకే చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.


పార్టీలో ఆ ఇద్దరే ఇప్పుడు కీలకం...
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 22మంది పార్లమెంట్ సభ్యులకు నాయకత్వం వహిస్తున్న విజయ సాయి రెడ్డి ఒక వైపు, ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్దానం ఛైర్మన్ గా బాద్యతల నుంచి రిలీవ్ అయిన సుబ్బారెడ్డి మరో వైపు ఉండి, అభ్యర్దుల ఎంపికలను చేపడుతున్నారు. మెదటి నుండి ఈ ఇద్దరు జగన్ కు అత్యంత సన్నిహితులు. సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వం తో సత్సంబంధాలను కొనసాగిస్తూ, రాష్ట్రంలో రాజకీయాను ఒక కంట కనిపెడుతూ జగన్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పార్టీ భాధ్యతల్లో ఇప్పుడు కూడ వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు.


అభ్యర్దుల పై గురి...
రాబోయే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో.. తెలుగు దేశం పార్టీకి అంతకంటే ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపద్యంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్దితుల్లో మరో సారి విజయం సాధించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అభ్యర్దుల ఎంపిక చాలా సీరియస్ అంశంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న సిట్టింగ్ లకు తిరిగి సీట్లు ఇచ్చే విషయం తో పాటుగా, కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్దులు వారసులను రంగంలోకి దింపేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వీటితో పాటుగా ఆ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ప్రభావం వంటి అంశాలను కీలకంగా భావిస్తున్నారు. సో ఎట్టి పరిస్దితుల్లోనూ గెలుపు గుర్రాలకే సిట్ల వ్యవహరం అని జగన్ చాలా సార్లు పార్టి నేతలకు క్లారిటి ఇచ్చారు. దీంతో అభ్యర్దులు ఎవరు.. వారి గెలుపు అవకాశాలకు చెందిన సర్వే రిపోర్ట్ లు కూడ పార్టిలో రెడీగా ఉన్నాయని, అంటున్నారు. ఆయా రిపోర్ట్ లను తన వద్ద పెట్టుకున్న జగన్ ఆయా అభ్యర్దుల పేర్లను మాత్రమే విజయ సాయి, సుబ్బారెడ్డికి ఇచ్చి అభ్యర్దులను ఎంపిక పై నివేదికను  ఇవ్వాలని సూచించినట్లుగా చెబుతున్నారు.