Republic Day 2024 Holiday: స్టాక్‌ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి, లాంగ్‌ వీకెండ్‌లోకి వెళ్లబోతోంది. ఈ వారం ప్రారంభంలో, సోమవారం రోజున (22 జనవరి 2024) స్టాక్‌ మార్కెట్లు పని చేయలేదు. అయోధ్య రామాలయంలో ‍‌(Ayodhya Ram mandir) బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సెలవు ఇచ్చారు. ఇది, స్టాక్‌ మార్కెట్ల హాలిడే క్యాలెండర్‌లో ‍‌(Stock Market Holidays in 2024) లేదు, అనూహ్యంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సెలవు ఇచ్చారు. 


భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ట్రేడింగ్‌కు స్టాక్ మార్కెట్లు సెలవు ప్రకటించాయి, శుక్రవారం రోజున ఫ్యూచర్స్‌ & ఆప్షన్స్‌ (F&O), కమొడిటిస్‌ మార్కెట్‌ సహా అన్ని విభాగాలు క్లోజ్‌ అవుతాయి.


శుక్రవారం (26 జనవరి 2024) సెలవుతో పాటు 27న శనివారం & 28న ఆదివారం నాడు కూడా స్టాక్‌ మార్కెట్లు సెలవులో ఉంటాయి, మార్కెట్‌ లాంగ్‌ వీకెండ్‌ను చూస్తుంది. శుక్రవారం రోజున ఇండియన్‌ మార్కెట్లు సెలవులోకి వెళ్లినా, గ్లోబల్‌ మార్కెట్లు యథావిధిగా పని చేస్తాయి. మూడు రోజుల విరామం తర్వాత, సోమవారం రోజు (29 జనవరి 2024) ప్రారంభమయ్యే ఇండియన్‌ మార్కెట్ల మీద గ్లోబల్‌ మార్కెట్లలోని ప్రతికూల/సానుకూల ప్రభావం పడుతుంది. కాబట్టి, పొజిషనల్‌ ట్రేడర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.


అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నాడు ఇచ్చిన సెలవుతో కలుపుకుని, ఈ ఏడాది (2024) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు మొత్తం 15 హాలిడేస్‌ (Non-trading days) వచ్చాయి. ఈ 15 రోజుల్లో.. శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, రంజాన్‌ వంటి పండుగలతో పాటు... గణతంత్ర దినోత్సవం, మహాత్మాగాంధీ జయంతి వంటి జాతీయ సందర్భాలు కూడా ఉన్నాయి. 


2024 క్యాలెండర్‌ ఇయర్‌ హాలిడేస్‌ లిస్ట్‌లో నాన్‌ ట్రేడింగ్‌ డేస్‌తో పాటు వారాంతాల్లో (శని, ఆదివారాలు) వచ్చే మరో ఐదు సెలవులు ఉన్నాయి. ఈ జాబితా క్యాపిటల్ మార్కెట్లు, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) విభాగాలకు కూడా వర్తిస్తుంది.


2024లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇది ‍‌(Stock market holidays list for 2024):


జనవరి 26, 2024 (శుక్రవారం) - గణతంత్ర దినోత్సవం
మార్చి 08, 2024 (శుక్రవారం) - మహాశివరాత్రి
మార్చి 25, 2024 (సోమవారం) - హోలీ
మార్చి 29, 2024 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 11, 2024 (గురువారం) - ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ ఈద్)
ఏప్రిల్ 17, 2024 (బుధవారం) - శ్రీరామ నవమి
మే 01, 2024 (బుధవారం) - మహారాష్ట్ర దినోత్సవం
జూన్ 17, 2024 (సోమవారం) - బక్రీద్
జులై 17, 2024 (బుధవారం) - మొహర్రం
ఆగస్టు 15, 2024 (గురువారం) - స్వాతంత్ర్య దినోత్సవం
అక్టోబర్ 02, 2024 (బుధవారం) - మహాత్మాగాంధీ జయంతి
నవంబర్ 01, 2024 (శుక్రవారం) - దీపావళి లక్ష్మి పూజ
నవంబర్ 15, 2024 (శుక్రవారం) - గురునానక్ జయంతి
డిసెంబర్ 25, 2024 (బుధవారం) - క్రిస్మస్


ఈ ఏడాది మార్చి నెలలో గరిష్టంగా మూడు నాన్-ట్రేడింగ్ రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్‌, నవంబర్‌ నెలల్లో రెండు రోజుల చొప్పున సెలవులు వచ్చాయి. వీకెండ్స్‌ తప్ప, ఫిబ్రవరి, సెప్టెంబర్‌ నెలల్లో ఒక్క హాలిడే కూడా లేదు. 2024లో, దీపావళి సందర్భంగా ముహూరత్‌ ట్రేడింగ్ (Muhurat Trading 2024 Timings) నవంబర్ 1వ తేదీ, శుక్రవారం రోజున ఉంటుంది. ఆ రోజున, ఏ సమయంలో ప్రత్యేక ట్రేడింగ్‌ జరుగుతుందన్న విషయాన్ని స్టాక్‌ మార్కెట్లు తర్వాత ప్రకటిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: పెరిగేది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే