Stock Market Closing On 24 September 2024: ఈ రోజు సెషన్‌లో చారిత్రాత్మక గరిష్టాన్ని (Stock markets at record levels) తాకిన మార్కెట్లు, నిన్నటి బలాన్ని నిలబెట్టుకున్నాయి. ట్రేడ్‌ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 14.57 పాయింట్లు మాత్రమే పడిపోయి 84,914.04 స్థాయి వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.35 పాయింట్లు పెరిగి 25,940.40 వద్ద నిలిచాయి. మార్కెట్‌లోని ఈ స్థాయులు దేశీయ స్టాక్ మార్కెట్‌లోని బలాన్ని చూపుతున్నాయి.


స్టాక్‌ మార్కెట్‌లో సరికొత్త శిఖరాలు
మధ్యాహ్నం 3 గంటలకు, భారతీయ స్టాక్ మార్కెట్ చారిత్రక రికార్డును సృష్టించింది. NSE నిఫ్టీ మొదటిసారిగా 26,000 మైలురాయిని దాటింది. 25,000 నుంచి 26,000 వరకు చేరుకోవడానికి నిఫ్టీ అద్భుతం చేసింది, కేవలం 37 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ ఫీట్ సాధించింది. నిఫ్టీ 26,011.55 వద్ద (Nifty at fresh all-time high) రికార్డ్‌ స్థాయిని క్రియేట్‌ చేయగా, BSE సెన్సెక్స్ 85,163.23 వద్ద కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది, ఇది ఆల్ టైమ్ హై లెవెల్ ‍(Sensex at fresh all-time high). నిఫ్టీ బ్యాంక్ కూడా రికార్డ్‌ గరిష్టానికి చేరుకుంది. ఈ ఇండెక్స్‌ 54,247.70 వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని టచ్‌ చేయడం స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపునిచ్చింది. 


పెరిగిన & పడిపోయిన షేర్లు
ట్రేడ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో... 14 స్టాక్స్‌ లాభాలను, 16 స్టాక్స్‌ నష్టాలను చవిచూశాయి. టాటా స్టీల్‌ 4.25 శాతం, పవర్‌గ్రిడ్‌ 2.67 శాతం, టెక్‌ మహీంద్ర 1.63 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.20 శాతం, మహీంద్ర అండ్‌ మహీంద్ర 0.74 శాతం లాభాలతో టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు... హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 2.61 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.54 శాతం, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ 1.26 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.25 శాతం, టైటన్‌ 1 శాతం లాస్‌తో టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.


ఈరోజు ఆస్ట్రాజెనెకా ఫార్మా షేర్లు అద్భుతంగా 17 శాతం జంప్‌ చేశాయి, రూ.7,878 స్థాయికి చేరాయి. భారతదేశంలో క్యాన్సర్ ఔషధాన్ని ప్రారంభించేందుకు కంపెనీ ఆమోదం పొందింది. ఈ వార్తతో స్టాక్‌ భారీగా పెరిగింది.


మెరిసిన మెటల్ షేర్లు
ఈ రోజు మెటల్ స్టాక్స్‌ బలంగా ఎదిగాయి. చైనాలో RRR తగ్గింపు వార్తల తర్వాత భారతీయ మెటల్ స్టాక్స్‌లో ప్రకాశం పెరుగుతోంది. టాటా స్టీల్, ఎన్‌ఎండీసీ, హిందాల్కో వంటి షేర్లు ర్యాలీ చేశాయి. దీంతో మెటల్ ఇండెక్స్ బలమైన ముగింపు ఇచ్చింది.


మార్కెట్ క్యాప్‌
బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 476.01 లక్షల కోట్లకు తగ్గింది. అయితే, నిన్నటి ముగింపు స్థాయి రూ. 476.17 లక్షల కోట్లను దాదాపుగా నిలబెట్టుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రూ.26కే ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ - 30 రోజుల వ్యాలిడిటీతో మరో 3 చౌక డేటా ఓచర్లు