Axis Bank Shares Down: OFS రూపంలో కేంద్ర ప్రభుత్వం కొట్టిన దెబ్బకు ప్రైవేట్‌ లెండర్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు విలవిలలాడుతున్నాయి. ఇవాళ (గురువారం) ఉదయం 11 గంటల సమయానికి షేర్లు దాదాపు 4 శాతం డౌన్‌ అయ్యాయి.


'స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా' (SUUTI) ద్వారా ఈ బ్యాంక్‌లో తనకు ఉన్న 1.55 శాతం వాటాను భారత ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) మార్గంలో ఇవాళ, రేపు (గురువారం, శుక్రవారం) షేర్లను ఆఫ్‌లోడ్‌ చేస్తుంది.


1.55 శాతం వాటా ప్రకారం, 46.5 మిలియన్ (4.65 కోట్లు) షేర్లను గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా విక్రయిస్తోంది. ఆఫర్ ఫ్లోర్ ప్రైస్‌ 830.63 రూపాయలు. దీనర్ధం, ఈ రేటు కంటే ఇంతకంటే తగ్గించి అమ్మదు.


ఇవాళ రిటైల్‌ బిడ్స్‌ - రేపు నాన్‌ రిటైల్‌ బిడ్స్‌
ఇవాళ (నవంబర్‌ 10న) నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. రేపు (నవంబర్‌ 11న) రిటైల్‌, నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ తేదీల్లో వీళ్లు బిడ్స్‌ వేయవచ్చు.


యాక్సిస్‌ బ్యాంక్‌లో 1.55 శాతం స్టేక్‌ అమ్మకం తర్వాత, ఈ ప్రైవేట్ రంగ రుణదాత నుంచి ప్రభుత్వం పూర్తిగా బయటకు వస్తుంది. ఇకపై సింగిల్‌ షేరు కూడా సెంట్రల్‌ గవర్నమెంట్‌ పేరున ఉండదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, 1.55 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు 4 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కూడగడుతుంది.


ఔట్‌పెర్ఫార్మర్‌
గత నెల రోజుల్లో యాక్సిస్ బ్యాంక్ షేర్లు అద్భుతంగా రాణించాయి. ఈ కాలంలో S&P BSE సెన్సెక్స్‌లోని 3.8 శాతం పెరుగుదలతో పోలిస్తే, ఈ స్క్రిప్‌ 12 శాతం పెరిగి మార్కెట్‌ను అధిగమించింది. గత ఆరు నెలల కాలంలో రూ. 188 లేదా 28.53 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) రూ. 151.70 లేదా 21.79 శాతం లాభపడింది.


ఈ ఏడాది అక్టోబర్ 27న రికార్డు స్థాయిలో (52 వారాల గరిష్టం) పెరిగి రూ. 919.95 కి చేరుకుంది. ఈ స్టాక్‌ 52 వారాల కనిష్టం రూ. 618.10.


యాక్సిస్ బ్యాంక్‌ షేర్లకు ICICI సెక్యూరిటీస్ 'బయ్‌' రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్ ధరగా రూ. 1,000ని ప్రకటించింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.