Lock-In Periods: గత రెండు సంవత్సరాల్లో పబ్లిక్‌గా మారిన (ప్రభుత్వ రంగ సంస్థలు మినహా) దాదాపు 40 కంపెనీల నుంచి దాదాపు $12 బిలియన్ల విలువైన షేర్లు అతి త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే నాలుగు నెలల్లో ఆయా షేర్ల లాక్-ఇన్ పిరియడ్స్ ముగుస్తాయి. ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఇద్దరికీ లాక్-ఇన్ గడువులు ముగిసే టైమ్ దగ్గర పడింది. వాళ్లు అమ్మకాలకు దిగితే, మార్కెట్‌లోకి షేర్ల వరద పారుతుంది. సప్లై పెరిగితే షేర్ ప్రైస్‌లు పడిపోతాయి. కాబట్టి, లాక్-ఇన్ గడువులపై ఓ కన్నేసి ఉంచడం ముఖ్యం.
మ్యాన్‌కైండ్ ఫార్మా, కేన్స్ టెక్నాలజీస్, గ్లాండ్ ఫార్మా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సెన్కో గోల్డ్ వంటి కౌంటర్లపై మార్కెట్ ఫోకస్ ఉంటుంది.
LIC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్, మజగాన్ డాక్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల లాక్-అప్ షేర్ల విలువ చాలా ఎక్కువగా ఉంది, మొత్తం $13 బిలియన్ల వరకు ఉంటుంది. వాటి లాక్-ఇన్‌ల గడువు వచ్చే నాలుగు నెలల్లో ముగుస్తుంది.
ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ టైమ్ లోపల వాళ్లు షేర్లు అమ్మడానికి వీలుండదు. గడువు ముగిసి లాక్ ఓపెన్ అయితే ఆ షేర్లను అమ్ముకునే స్వేచ్ఛ వస్తుంది. అయితే, లాక్-ఇన్ గడువు ముగియగానే స్టాక్స్‌ను ఆఫ్‌లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాటిని అమ్మకుండా హోల్డ్ కూడా చేయవచ్చు. అమ్మాలా, వద్దా అన్నది కంపెనీ ఫండమెంటల్స్, బిజినెస్ మోడల్, లాంగ్‌టర్మ్ గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది.
వచ్చే 4 నెలల్లో లాక్-ఇన్ పిరియడ్స్ ముగిసే స్టాక్స్:
మ్యాన్‌కైండ్ ఫార్మా - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Nov 06, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 400.6; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 280.4;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 70.0; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 6,079
కేన్స్ టెక్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Nov 20, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 58.1; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 25.3;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 43.6; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 778
గ్లాండ్ ఫార్మా - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Nov 02, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 163.3; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 32.7;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 20.0; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 658
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Jan 19, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 1,095.9; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 662.8;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 60.5; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 469
సెన్కో గోల్డ్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Jan 12, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 77.7; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 46.7;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 60.1; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 363
ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Nov 10, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 100.6; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 48.5;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 48.2; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 345
సైయెంట్ DLM - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Jan 05, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 79.3; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 41.0;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 51.7; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 330
నెట్‌వెబ్ టెక్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Jan 25, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 56.1; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 31.3;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 55.9; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 307
హ్యాపీయెస్ట్ మైండ్స్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Dec 30, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 146.9; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 29.4;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 20.0; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 303
ఈథర్ ఇండస్ట్రీస్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Dec 04, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 124.5; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 24.9;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % ; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో)
HMA ఆగ్రో ఇండస్ట్రీస్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Jan 11, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 50.1; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 31.8;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 63.5; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 278
అవలాన్ టెక్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Oct 13, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 65.3; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 32.4;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 49.6; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 223
ఐడియాఫోర్జ్ టెక్నాలజీ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Jan 08, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 41.7; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 22.2;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 53.2; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 220
క్యాంపస్ యాక్టివ్‌వేర్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Nov 04, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 304.3; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 60.9;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 20.0; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 211
రెస్టారెంట్ బ్రాండ్స్ - లాక్-ఇన్ ఓపెన్ డేట్ Oct 10, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్ షేర్లు (మిలియన్లలో) 381.7; లాక్-ఇన్ షేర్లు (మిలియన్లలో) 76.4;
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్-ఇన్ షేర్ల % 20.0; లాక్-ఇన్ షేర్ల విలువ (మిలియన్ డాలర్లలో) 115
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: నెమ్మదించిన పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial