ఏదో బలమైన కారణం ఉంటే తప్పా.. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోదు. అది ఏంటో తెలుసుకుని తనని వెనక్కి తీసుకొచ్చే పూచీ తమదని ఇంద్రాదేవి కనకం వాళ్లకి భరోసా ఇస్తుంది. ఇంత మందిని ఇబ్బంది పెట్టి ఎక్కడికి వెళ్లింది. ఏమైంది ఎందుకు వెళ్లిందని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య గుడిలో ఒంటరిగా ఏడుస్తూ కూర్చోవడం పంతులు చూసి పిలుస్తాడు. కానీ ఎంతకీ పలకదు. సీతారామయ్య దంపతులు కావ్య గురించి కాసేపు మాట్లాడుకుంటారు. తన మనసుకి ఎంత గాయమై ఉంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అప్పుడే పంతులు శర్మ ఫోన్ చేసి కావ్య గుడిలో ఉందని సీతారామయ్యకి చెప్తాడు. మాట్లాడటానికి ప్రయత్నిస్తే మౌనంగా చూస్తూ ఉందని అంటాడు. అందరికీ చెప్దామని అంటే సీతారామయ్య వద్దని చెప్తాడు. అందరూ వస్తే తను కారణం చెప్పకపోవచ్చు. ముందు మనం వెళ్లి తనతో మాట్లాడి వెళ్లిపోవడానికి కారణం అడిగి తెలుసుకుందామని గుడికి బయల్దేరతారు.


ఇంద్రాదేవి: కావ్య ఇక్కడ ఉన్నావ్ ఏంటమ్మా?


కావ్య: ఎక్కడికి వెళ్లాలో తెలియక


Also Read: శైలేంద్ర గురించి రిషికి క్లారిటీ ఇచ్చిన వసుధార - దేవయానిని వణికించిన మహేంద్ర!


ఇంద్రాదేవి: ఇల్లు ఉందిగా


కావ్య: ఏ ఇల్లు అత్తిల్లా? పుట్టిల్లా?


ఇంద్రాదేవి: పెళ్లైన ప్రతి ఆడపిల్లకి అత్తిల్లే ఇల్లు. నీ భర్త నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడు కదా అనగానే కావ్య రాజ్ రాసిన చీటీ సీతారామయ్యకి ఇస్తుంది. అది చూసి ఇద్దరూ షాక్ అవుతారు.


సీతారామయ్య: మనసు వికలమై వచ్చావా?


కావ్య: నేను ఇక్కడికి విరక్తితో వచ్చాను. దేవుడిని ఎన్నో అడగాలని వచ్చాను. ఒక రాతి విగ్రహాన్ని మార్చమని మరొక రాతి విగ్రహాన్ని అడగడం ఎందుకని ఆగిపోయాను.


సీతారామయ్య: మేం మందిలిస్తాం కదా.


కావ్య: మీరు మందలించారనే కదా నటిస్తున్నారు. ఆయన మనసులో నేను లేనప్పుడు నేను అక్కడ ఎందుకు ఉండాలి. నా భవిష్యత్ నాకు శూన్యంగా కనిపిస్తుంది. ఏం చూసుకుని ఆశగా బతకాలి. నిరాశ తప్ప ఏం మిగిలింది. అత్తారింట్లో ఆడపిల్ల ఇంతకంటే అణుకువగా ఎలా ఉండాలి. అత్త ఆదరణ దక్కలేదు. భర్త ప్రేమ దక్కలేదు. పుట్టింటికి చేరి మచ్చ తీసుకురాలేను. అది అత్తింటికి, పుట్టింటికి గౌరవం కాదు. ఏ దారి లేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను.


సీతారామయ్య: నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పించడం కోసమే మమ్మల్ని పంపించారు.


ఇంద్రాదేవి: నువ్వు ఇంటికి రా నీ కంట కన్నీళ్లు రాకుండ చూసుకుంటాం.


కావ్య: అత్తింట్లో నిలదొక్కుకోవాలని అనుకున్నా. కానీ ఆ ఇంట్లో ఎప్పటికీ నేను అతిథిలా ఉండాలని అర్థం అయ్యింది. నేను ఇప్పటికీ ఆ కుటుంబంలో ఒక సభ్యురాలు కాలేకపోతున్నా. నా భర్తకి ఇప్పటికీ నేను అక్కరకు రాని చుట్టాన్ని. ఇక నేను ఏ హక్కుతో అక్కడికి రావాలి?


సీతారామయ్య: వరలక్ష్మీ వ్రతం తర్వాత రాజ్ ని మందలించాను. వాడిలో మార్పు వచ్చింది. నిజమని నేను నమ్మాను. అది నటన అని నువ్వు తెలుసుకున్నావ్. నేను ఆలస్యంగా తెలుసుకున్నా. ఇది నాకు నమ్మశక్యంగా లేదు. నీ బాధ నాకు అర్థం అయ్యింది. ఇలాగే వదిలేస్తే మా పెద్దరికానికి అర్థం లేదు.


కావ్య: ఏం చేస్తారు మళ్లీ మందలిస్తారా?


ఇంద్రాదేవి: తాతయ్య ఏం చేయరు. ఏం చేసినా అంతా నువ్వే చేయాలి.


Also Read: కృష్ణనా మజాకా.. ముకుందని చిటికెలో ఓడించేసిన తింగరి పిల్ల!


కావ్య: నా చేతులు దాటిపోయిన తర్వాత నేను బయటకి వచ్చేశాను.


ఇంద్రాదేవి: నువ్వు ఇలా వెనకడుగు వేసి సమస్యల నుంచి పారిపోయి వస్తావని అనుకోలేదు. భర్త నిరాదరణకి గురైన ఆడది ఇల్లు వదిలి వెళ్లిపోతే ఏ కాపురాలు నిలబడవు. సంకల్పంతో సహనంతో ఎదురుచూస్తే నువ్వే గెలుస్తావ్.


సీతారామయ్య: నీ ఓర్పు నీకు శ్రీరామరక్ష. నీ పోరాటానికి మా మద్ధతు ఉంటుంది. మా మనవడిలో మార్పు కోసం మేం ప్రయత్నిస్తాం.


ఇంద్రాదేవి: జరిగింది నీకు మనస్తాపం కలిగించేది అయినా విరక్తితో గడప దాటి వెళ్లిపోకూడదు. ఆ ఇంట్లో ఉండటం నీ హక్కు. అది కాదనే హక్కు ఎవరికి లేదు. హక్కు కాదని రావడం నీ తప్పు. రాజ్ మూర్ఖుడు కాదు. కన్నతల్లి నీ మీద చెయ్యి ఎత్తితే తట్టుకోలేనివాడు. వాడి ప్రేమని మాయ కమ్మేసింది. అది తొలగిపోతే మనిషి అవుతాడు. నిన్ను నువ్వు నమ్మి తిరిగి రా.


రాజ్: ఏంటి రమ్మని బతిమలాడుతున్నారా? అయినా రానని అంటుందా? ఏమైందని వచ్చావ్? రాత్రంతా ఏమైపోయావ్. ఉన్నట్టుండి మాయం అయితే ఏమనుకోవాలి. లాగిపెట్టి కొడితే అని ఆగిపోతాడు. అసలు ఏంటి ఈ పిచ్చి పని. నిన్ను ఎవరు ఏమన్నారు. నువ్వు ఉన్నట్టుండి మాయమైతే ఎంత టెన్షన్ పడాలి. రాత్రంతా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. జవాబు చెప్పవేంటి తింగరి బుచ్చి.


కావ్య: చెప్పాల్సింది అంతా అమ్మమ్మ తాతయ్యతో చెప్పాను.


రాజ్: ఏం చెప్పింది, గుడిలో అడుక్కోవడానికి వచ్చిందా?


కావ్య: అడుక్కోవడానికి నాకేం ఖర్మ నా మొగుడు కోటీశ్వరుడు.


సీతారామయ్య: గుడిలో ఏదో మొక్కు ఉందట. అది చేద్దామని వచ్చింది. నువ్వు మారితే చేస్తానని మొక్కుకుంది.


కావ్య: ఏం మీరు మారిపోవడం నిజం కాదా? మీరు నన్ను ప్రేమగా చూసుకోవడం నిజం కాదా?


రాజ్: నిజమే అబద్ధమని నేను ఎప్పుడు అన్నాను.


సీతారామయ్య: అయితే అదే ప్రేమతో ఇంటికి తీసుకెళ్లు నీ పెళ్లాన్ని..