Krishna Mukunda Murari Serial October 10th Episode: మురారీని ప్రభాకర్ పక్కకి తీసుకుని వెళతాడు. తమని చూశాడు ఏమోనని ముకుంద అనుకుంటుంది. ఏం జరుగుతుందోనని కృష్ణతో పాటు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ప్రభాకర్ తనలాగా మురారీకి పూల చొక్కా, లుంగీ వేసి రెడీ చేసి తీసుకొస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక మామా అల్లుళ్లు ఇద్దరూ కలిసి మాస్ పాటకి డాన్స్ ఇరగదీస్తారు. కృష్ణని డాన్స్ చేయమని ప్రభాకర్ అంటాడు. ముకుంద ఆపి ఒడిపోయావ్ కదా మా నాన్నని రప్పిస్తానని చెప్పావ్ మర్చిపోయావా అంటుంది. ఒడిపోలేదు వస్తారని కృష్ణ ధీమాగా చెప్తుంది. ఒడిపోతే ఒక మూలన చీమలాగా పడి ఉండాలని అంటుంది. డీజే టిల్లు పాటకి కృష్ణ, మురారీ డాన్స్ వేస్తారు. గణేష్ లడ్డు వేలం పాట వేద్దామని కృష్ణ అంటుంది. కృష్ణ తన చేతిలో ఎలాగైనా ఓడిపోవాలని ముకుంద మనసులో అనుకుంటుంది. లడ్డూ వేలం పాట మొదలు అవుతుంది.


ముకుంద: నా పాట యాభై వేలు


ప్రభాకర్: ఇదేదో సరదాగా చేస్తున్నాం


ముకుంద: ఎందుకు మీకు అంత సీన్ లేదా?


Also Read: రాజ్ నాటకం తెలుసుకున్న సీతారామయ్య ఏం చేయబోతున్నారు - వియ్యాలవారిని కడిగిపడేసిన కనకం!


కృష్ణ: నా పాట లక్ష


అలా ముకుంద, కృష్ణ ఇద్దరూ పోటాపోటీగా పాట పెంచుకుంటూ పోతారు. చివరిగా ముకుంద ఆరు లక్షలకు లడ్డూ వేలం పాటలో గెలుస్తుంది. లడ్డు ముకుందకి ఇచ్చెయ్యండి కానీ డబ్బులు ఇప్పుడే ఇవ్వాలని కృష్ణ ఫిట్టింగ్ పెడుతుంది. నా దగ్గర మూడు లక్షలే ఉన్నాయి ఇప్పుడు ఎలా టైమ్​కి ఇంట్లో అత్తయ్యలు కూడా లేరని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే పక్కకి వెళ్లి తండ్రికి కాల్ చేసి మూడు లక్షలు కావాలని అడుగుతుంది. ఇంటి బయటకి వచ్చి ఫోన్ చేస్తే తనే వస్తానని అంటుంది. మధుకర్, అలేఖ్య తమ డాన్స్ పెర్ఫామెన్స్​తో ఇరగదీస్తారు. అప్పుడే శ్రీనివాస్ డబ్బులు తీసుకుని ఇంట్లోకి వస్తాడు. ఫోన్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు వినిపించలేదని లోపలికి వచ్చేశానని చెప్పేసరికి ముకుంద ఫ్యూజులు ఎగిరిపోతాయి. పండగ రోజు మన ఇంటికి వచ్చారు ముకుంద వాళ్ల నాన్న అని కృష్ణ అంటుంది. నా దగ్గర ఆరు వందలు మాత్రమే ఉన్నాయి కావాలని ఆరు లక్షల పాట పాడించాను. నోరు మూసుకుని ఒక మూలన పడి ఉండమని హెచ్చరిస్తుంది.


ప్రభాకర్ దంపతులు బయలదేరుతూ ఉంటారు. పనులు ఉన్నాయని వెళ్లక తప్పదని అంటారు. కృష్ణ, మురారీ వాళ్లు వస్తారు. ముకుందకి మొగుడ్ని దొరకబెట్టుకుని తీసుకొస్తేనే మన బిడ్డ చల్లగా ఉంటుందని శకుంతల అంటుంది. ఇంటికి వచ్చిన వాళ్లకి కృష్ణ బట్టలు పెడుతుంది. కృష్ణని జాగ్రత్తగా చూసుకోమని మురారీకి చెప్తారు.


ప్రభాకర్: నీ కాపురం చల్లగా ఉండాలంటే ముకుంద పెనిమిటిని మిలటరీ నుంచి రప్పించడం తప్ప వేరే దారి లేదు. ఇదంతా నీకు తెలుసని చెప్తున్నా కాస్త జాగ్రత్తగా ఉండు


కృష్ణ: మీరు ఆ విషయం మర్చిపోండి నేను చూసుకుంటాను


Also Read: కాలేజ్ MDగా రిషి రీఎంట్రీ - దేవయాని, శైలేంద్రకి బిగ్ షాక్!


ప్రభాకర్: జాగ్రత్తగా లేకపోతే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. ముకుంద చాలా డేంజరస్ గుర్తు పెట్టుకో. నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అది మర్చిపోకు