ఇటీవల బిగ్ బాస్‌లో జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్‌లో ముందుగా శుభశ్రీ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోయింది. తను హౌజ్ నుంచి వెళ్లిపోయిన కాసేపటికే.. డబుల్ ఎలిమినేషన్ అంటూ, గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడంటూ నాగార్జున ప్రకటించారు. హౌజ్‌లో నుంచి వెళ్లిపోయే ముందు శివాజీపై విపరీతమైన కోపంతో వెళ్లాడు. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత హౌజ్‌లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ గురించి తన అభిప్రాయాలను చెప్పాడు గౌతమ్. బిగ్ బాస్ స్టేజ్‌పై నుంచి గౌతమ్ వెళ్లిపోతున్న సమయంలో తనను పిలిచిన నాగార్జున.. తనకు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు రివీల్ చేశారు. అందుకే తనను సీక్రెట్ రూమ్‌కు పంపించారు.
కంటెస్టెంట్స్‌పై కోపంతో హౌజ్‌లోకి రీఎంట్రీ..
సీక్రెట్ రూమ్‌కు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లో ఏం జరుగుతుందో ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు గౌతమ్. హౌజ్ నుంచి తను వెళ్లిపోయిన తర్వాత అందరి ప్రవర్తన ఎలా మారిపోయింది అని గమనిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా అందరు గ్రూపులుగా ఉన్నారని, తాను మాత్రం ఏ గ్రూపుకు చెందినవాడు కాదు అని తన మైండ్‌లో బలంగా ఫిక్స్ అయిపోయాడు గౌతమ్. అంతే కాకుండా మనవాళ్లు అనుకున్నవారే మోసం చేశారని, పెద్దరికం చూపిస్తూ వెన్నుపోటు పొడిచారని కొందరు కంటెస్టెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. పైగా తనను సూర్యుడితో పోలుస్తూ.. డైలాగులు కొట్టాడు. ఆ తర్వాత గౌతమ్‌కు మళ్లీ హౌజ్‌లోకి వెళ్లమని బిగ్ బాస్ నుంచి ఆదేశం వచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
ప్యాంట్ విప్పడం ఎంటర్‌టైన్మెంటా?
‘‘రాననుకున్నారా? రాలేననుకున్నారా?’’ అని అరుచుకుంటూ బిగ్ బాస్ హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. ‘‘అశ్వద్ధామ ఈజ్ బ్యాక్’’ అని తనను తాను అశ్వద్ధామతో పోల్చుకున్నాడు. ‘‘తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా. అయినా ఈ అశ్వద్ధామ చావడు’’ అని చెప్తూ వస్తుండగా.. కంటెస్టెంట్స్ అంతా తనను చూసి ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యంలో ఉండగానే.. ‘‘శివన్నా.. నిన్న మీరు ఒకటి అన్నారు కదా.. గౌతమ్ అయితే ఎక్కువ ఎంటర్‌టైన్ చేయలేడేమో అని, ఎంటర్‌టైన్మెంట్ అంటే ప్యాంట్ విప్పేసి తిరగడం కాదు కదా’’ అంటూ శివాజీని వ్యంగ్యంగా ప్రశ్నించాడు గౌతమ్.
100 సినిమాల్లో బట్టలు లేకుండా చేశా..
గౌతమ్ అడిగిన ప్రశ్నకు శివాజీ హర్ట్ అయ్యాడు. ‘‘బట్టలు విప్పడం ఎంటర్‌టైన్మెంటా అని నువ్వు ఇంతమంది ముందు అన్నావు. 100 సినిమాల్లో చేశాను నేను బట్టలు లేకుండా. నేను యాక్టర్. నేను ఏమైనా చేయగలను’’ అంటూ గౌతమ్ చెప్తున్న మాటలను వినకుండా శివాజీ వాదించడం మొదలుపెట్టాడు. ‘‘24 గంటలు ప్రతీ ఒక్కటి కనిపిస్తుంది’’ అంటూ గౌతమ్.. సీక్రెట్ రూమ్ నుంచి హౌజ్‌లో విషయాలను చూసినట్టుగా ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టాడు. ఇక గౌతమ్.. సీక్రెట్ రూమ్ నుంచి బయటికి వచ్చిన స్టైల్ చూస్తుంటే.. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అఖిల్ గుర్తొస్తున్నాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అఖిల్ కూడా ఇలాగే సీక్రెట్ రూమ్ నుంచి వచ్చి హడావిడి చేశాడు. కానీ, అభిజిత్ గాలి తీసేశాడు. గౌతమ్ కూడా అలాగే చేయడానికి ప్రయత్నించాడు. శివాజీ కూడా రివర్స్‌లో గౌతమ్ గాలి తీసేశాడు.
Also Read: బిగ్ బాస్ హౌజ్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే - విమర్శిస్తున్న ప్రేక్షకులు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial