Brahmamudi Serial October 10th Episode : కనకం కావ్య స్నేహితులకి ఫోన్ చేసి కూతురు గురించి ఆరా తీస్తుంది. వెతకడానికి వెళ్ళిన రాహుల్ కి కళ్యాణ్ ఫోన్ చేసి వదిన కనిపించిందా అని అడుగుతాడు. అటు కావ్య దిగాలుగా గుడిలో కూర్చుని ఉంటుంది. రాజ్ రోడ్డు మీద కళావతి కోసం తిరుగుతూ ఉంటాడు. కావ్యని వెతకడం కోసం వెళ్ళిన ఒక్కొక్కరు డల్ గా ఇంటికి వస్తారు. కావ్య గురించి ఏమి తెలియలేదని ఎక్కడా కనిపించలేదని కళ్యాణ్ చెప్పడంతో టెన్షన్ పడుతూ ఉంటారు. మనవరాలికి ఏమై ఉంటుందోనని పెద్దవాళ్ళు కంగారుపడతారు. రాజ్ కూడ కావ్య గురించి ఎటువంటి ఆచూకీ తెలియలేదని చెప్తాడు. అప్పుడే కనకం దంపతులు కంగారుగా ఇంటికి వస్తారు.
కనకం: కావ్య కనిపించడం లేదట ఏమైంది? ఎందుకు వెళ్ళింది?
అపర్ణ: తెలియదు
కనకం: ఏమైందో తెలియదా?
కృష్ణమూర్తి: ఎవరూ ఏమి అనకపోతే ఏం జరగకపోతే మీ ఇంటి కోడలు ఇంటి గడప దాటి వెళ్లిపోతుందా?
Also Read: కాలేజ్ MDగా రిషి రీఎంట్రీ - దేవయాని, శైలేంద్రకి బిగ్ షాక్!
అపర్ణ: నిజమే గొడవ ఏం జరగలేదు కానీ రాత్రి నుంచి మాత్రం కనిపించడం లేదు
కనకం: నిద్రపోతున్న స్వప్న దగ్గరకి వెళ్ళి కావ్య కనిపించడం లేదనే విషయం తెలుసా? నువ్వు కనిపించకపోయిన ప్రతిసారి అది ఎంత వెతికిందో తెలుసా? నువ్వు ఇప్పుడు అత్తగారింట్లో భద్రంగా ఉన్నావంటే దానికి కారణం నీ చెల్లి. కనీసం నువ్వైనా చెప్పాలి కదా. రాజ్ కి చేతులు జోడించి వేడుకుంటుంది. నా కూతురు కనిపించడం లేదు ఏమైందో కనిపించడం లేదని అంటున్నారు. ఈ ఇంటి కోడలిగా కళకళాడుతూ తిరుగుతుంటే బాగుంది. నిజం చెప్పు బాబు నా కూతుర్ని ఏం చేశావ్
అపర్ణ: అంత కసాయి మనుషులు ఎవరు లేరు ఇక్కడ
కనకం: జవాబు చెప్పే మనుషులు కూడ లేరు ఇక్కడ. ఆనాడు అల్లుడు ఇంట్లో నుంచి పంపించేస్తే చీకటిలో ఇంటి ముందు నుంచి కదల్లేదు. అంత జరిగినా అత్తింటి గడప దాటలేదు. ఇప్పుడు ఎందుకు ఇంటితో సంబంధం తెంచుకుని అర్థరాత్రి గడప దాటి వెళ్ళిపోతుంది. నాకు సమాధానం కావాలి. నా కూతురు నాకు కావాలి. ఎక్కడ ఉందో వెతికి తెచ్చి అప్పగించండి. మీకు, మీ కొడుక్కి ఇష్టం లేకపోతే దాన్ని మీ ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మాకు అప్పగించండి. ప్రాణాలతో మా చేతుల్లో పెట్టండి నేను తీసుకుని వెళ్లిపోతాను. అసలు నా కూతురు ప్రాణాలతోనే ఉందా? ఏదైనా అఘాయిత్యం చేసుకుందా? ఎవరు మాట్లాడరు ఏంటి?
కృష్ణమూర్తి: బావగారు ఆనాడు నా కూతుర్ని అల్లుడు గెంటేస్టే ఏం చెప్పారు. మీరే తనని ఇంట్లోకి తీసుకొచ్చారు. కోడలిని కూతురిగా భావించే ఒక తండ్రి మీకు చేతులు జోడిస్తున్నా మా గుండెలు మండిపోతున్నాయి. ఏమైంది మీ ఇంటి కోడలిగా అడుగుపెట్టి మీ కూతురు స్థానంలో ఉన్న నా కూతురు ఏమైపోయింది
శుభాష్: భయపడొద్దు కావ్యకి ఏం కాదు
కనకం: ఈ కన్నతల్లి కన్నీళ్ళు మీ మనసు కరిగించడం లేదా? తనంతట తాను వెళ్లిపోయేది కాదు మీరు వెళ్లగొట్టినా వెళ్ళేది కాదు. ఉన్నట్టుండి ఎలా మాయం అయ్యింది
రాజ్: మీ అమ్మాయిని ఎవరూ ఏం అనలేదు. తనే చెప్పకుండా వెళ్ళిపోయింది
కృష్ణమూర్తి: ఈ ఇంటికి ఆడపిల్లని ఇస్తే భార్యని కాపాడుకోలేని వాళ్ళా అల్లుళ్ళు. నా పెద్ద కూతుర్ని ఎవడో రెండు సార్లు ఎత్తుకుపోయాడు. అప్పుడు ఏం చేయలేకపోయారు. ఈరోజు ఉన్నట్టుండి చిన్న కూతురు అదృశ్యం అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. ఈ ఇంట్లో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది
Also Read: కావ్యకి సపోర్ట్‌గా మాట్లాడిన అపర్ణ- రాజ్‌ని నిలదీసిన కనకం, కళావతి పయనం ఎటువైపు?
రుద్రాణి: ఏంటి మీ భార్యాభర్తల ఓవర్ యాక్షన్. ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో అందరం ఉన్నాం ఎవరికీ చెప్పకుండా మీ కూతురు వెళ్ళింది. మీకు ఎంత తెలుసో మాకు అంతే తెలుసు. మీరు అడిగిన ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే మాకేం తెలియదు. వెళ్ళి కేసు పెట్టండి మీ డ్రామాలు కట్టి పెట్టండి
సీతారామయ్య: రుద్రాణి ఏం మాట్లాడుతున్నావ్. కూతురు కోసం అలమటిస్తున్న తల్లిదండ్రులు న్యాయం అడగడం లేదు కూతుర్ని అడుగుతున్నారు
ఇంద్రాదేవి: మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇలా ఆరోపణలు చేయడం సరి కాదు. వినయమే కాదు వివేకం తెలిసిన పిల్ల, ఏదో బలమైన కారణం లేకపోతే తప్ప ఇంట్లో నుంచి వెళ్లిపోదు. ఆ కారణం తెలుసుకుని ఇంటికి రప్పించే ప్రయత్నంలోనే ఉన్నాం
తరువాయి భాగంలో..
గుడిలో ఉన్న కావ్యని సీతారామయ్య దంపతులు చూస్తారు. ఇక్కడ యఎందుకు ఉన్నావని అంటే రాజ్ రాసిన చీటీ చూపిస్తుంది. అది చూసి పెద్దవాళ్ళు షాక్ అవుతారు. కావ్యని ఇంటికి తీసుకురాగానే కనకం కూతుర్ని చూసి సంతోషపడుతుంది. ఎక్కడికి వెళ్ళావని అపర్ణ కావ్యని నిలదీస్తుంది. కారణం తాను చెప్తానని సీతారామయ్య అంటాడు.