Hindenburg Report: సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురితో పాటు ఆయన భర్త ధావల్ బుచ్‌కి అదానీ గ్రూప్‌కి చెందిన సంస్థల్లో షేర్స్ ఉన్నాయంటూ అమెరికాకి చెందిన హిండర్‌బర్గ్ రిపోర్ట్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అదానీ గ్రూప్‌లో జరుగుతున్న అవకతవకల్ని బయటపెట్టకపోవడానికి ఇదే కారణమని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. అయితే..ఈ వివాదంపై మాధవి పురి స్పందించారు. హిండన్ రిపోర్ట్‌లోని ఆరోపణల్ని కొట్టి పారేశారు. అవి నిరాధార ఆరోపణలు అని తేల్చి చెప్పారు. దీన్ని వ్యక్తిగత దాడిగానే చూస్తున్నట్టు అభివర్ణించారు. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. తమ జీవితాలు తెరిచిన పుస్తకం అని, సెబీకి అన్ని వివరాలూ తెలుసని వెల్లడించారు. తమ వ్యక్తిగత వివరాలు బయటపెట్టేందుకు ఎప్పుడూ వెనకడామని తేల్చి చెప్పారు. ఈ వివాదంపై మరోసారి పూర్తి స్థాయిలో స్టేట్‌మెంట్ ఇస్తామని వివరించారు. (Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది హిందువుల ర్యాలీ, దాడులను నిరసిస్తూ రోడ్లపై నినాదాలు)
"హిండన్‌బర్గ్ రిపోర్ట్‌లో వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవే. అందులో ఏ ఒక్కటీ నిజం లేదు. మా జీవితం, మా ఆర్థిక వ్యవహారాలన్నీ తెరిచి పుస్తకం లాంటివే. అందులో దాచడానికి ఏమీ లేదు. SEBI కి అన్ని వివరాలూ తెలుసు. ఈ వివరాలు బయటపెట్టడంలో ఎప్పుడూ వెనకాడలేదు. పూర్తి పారదర్శకంగా ఉన్నాం. మరి కొద్ది రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి మరో స్టేట్‌మెంట్ కూడా ఇస్తాం"
- మాధబి పురి, సెబీ ఛైర్‌పర్సన్
అటు అదానీ గ్రూప్ కూడా ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఆరోపణలపై విచారణ జరిగిందని, అవన్నీ నిరాధారమేనని స్పష్టం చేసింది. పదేపదే అవే ఆరోపణలు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మండి పడింది. సుప్రీంకోర్టు విచారించి ఇన్నీ నిరాధారం అని ఇప్పటికే తేల్చి చెప్పినట్టు గుర్తు చేసింది అదానీ గ్రూప్. ఏ ఆర్థిక సంస్థతోనూ తమకు సంబంధాలు లేవని, కేవలం తమ సంస్థ ప్రతిష్ఠకు మచ్చ తేవాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేసింది. తమ సంస్థ ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుందని వెల్లడించింది. అన్ని వివరాలూ ఎప్పుడూ పబ్లిక్‌గానే ఉంటాయని వివరించింది. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేసినట్టు అసహనం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలూ లేకుండా తమ సంస్థపై ఇలాంటి ప్రచారం ఎలా చేస్తున్నారంటూ మండి పడింది.
Also Read: Viral Video: బుసలు కొడుతూ వచ్చి చెప్పు ఎత్తుకెళ్లిన పాము, ఏం చేసుకుంటుందో - వీడియో