మీ వయసు చాలా తక్కువేనని కేర్‌ఫ్రీగా ఉండొచ్చు. కానీ త్వరలోనే మీ మీద బాధ్యతల భారం పడుతుంది. అందుకే మీ ఫైనాన్షియల్‌ పొజిషన్‌ను పటిష్ఠంగా మార్చుకోవడం ముఖ్యం. ఇందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. మున్ముందు వచ్చే కష్టాల్లో కాపాడుతుంది. మీరు చిన్న వయసులోనే బీమా తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం చాలా చాలా తక్కువ. లాంగ్‌టర్మ్‌లో దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.


సబ్‌సే పెహలే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నినాదం ప్రాముఖ్యాన్ని ఇప్పుడు యువత గుర్తిస్తోంది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సర్వేలో ఈ విషయం బయటపడింది. 22-25 ఏళ్ల వయసు గల 12 వేల మంది ఇందులో భాగమయ్యారు. 8 మెట్రో నగరాలు, 9 టైర్‌ వన్‌ నగరాలు, 23 టైర్‌ 2 పట్టణాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించారు. 'సబ్సే పెహలే లైఫ్‌ ఇన్సూరెన్స్‌' థీమ్‌తో 24 జీవిత బీమా కంపెనీల సంఘం ఈ సర్వే చేపట్టింది. వారిలో 91 శాతం మంది ఇన్సూరెన్స్‌ తీసుకోవడం అవసరమని చెబుతున్నా 70 శాతం మంది మాత్రమే వెంటనే తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని రకాల ఆర్థిక పెట్టుబడి సాధనాల్లో 96 శాతం మందికి లైఫ్‌ ఇన్సూరెన్స్‌పై అవేర్‌నెస్‌ ఉంది. 63 శాతం మందికి మ్యూచువల్‌ ఫండ్స్‌, 39 శాతం మందికి ఈక్విటీ షేర్లపై అవగాహన ఉంది. అన్ని వయసుల్లోని స్త్రీలు, పురుషులు ఇన్సూరెన్స్‌ ప్రాముఖ్యాన్ని అంగీకరిస్తున్నారు. యువకులతో పోలిస్తే 36 ఏళ్ల వయసు పైబడ్డ వారికి బీమా ఉంటోంది.


యువత ఎక్కువగా ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని అనుకుంటోంది. దీనివల్ల వేర్వేరు కంపెనీల పాలసీలను కంపేర్‌ చేసుకుంటున్నారు. బీమా ప్రీమియం ఎక్కడ తక్కవ ఉందో తెలుసుకుంటున్నారు. కేవలం బీమా గురించి తెలుసుకోవడమే కాకుండా వాటిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 45 మంది పశ్చిమ రాష్ట్రాలవారు వెల్త్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయాలని చెబుతున్నారు.


హైదరాబాద్‌లో 63 శాతం మంది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయడం అత్యంత సులభమని నమ్ముతున్నారు. పెట్టుబడి సాధనాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు జీవిత బీమా ముఖ్యమని అంటున్నారు. ఆ తర్వాత సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు ప్రాముఖ్యం ఇస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే బీమా సాయపడుతుందని 58 శాతం మంది అన్నారు. బీమా వల్ల అదనపు ఆదాయం వస్తుందని 57 శాతం మంది తెలిపారు.


పెద్ద వయస్కులకు జీవిత బీమా ఫైనాన్షియల్‌ సెక్యూరిటీ ఇస్తుందని 68 శాతం మంది బెంగళూరు వాసులు అంటున్నారు. కుటుంబంలో ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే బీమా సాయపడుతుందని 58 శాతం, కుటుంబ ఆదాయానికి ఉపయోగపడుతుందని 57 శాతం మంది భావిస్తున్నారు. చెన్నెలో 78 శాతం మంది బీమా తమ కుటుంబానికి రక్షణ ఇస్తుందని అన్నారు. పిల్లల విద్య, పెళ్లిళ్లకు సాయపడుతుందని 58 శాతం భావిస్తున్నారు.


జీవిత బీమా కుటుంబానికి రక్షణ ఇస్తుందని ముంబయి, అహ్మదాబాద్‌లోని 86 శాతం మంది అంగీకరిస్తున్నారు.  ప్రతి నలుగురిలో ముగ్గురు బీమా ముఖ్యమని నమ్ముతున్నారు. పిల్లల ఎడ్యుకేషన్‌, పెళ్లిళ్లకు బీమా సాయపడుతుందని 61 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవడం అత్యంత సులభమని 73 శాతం మంది పుణె వాసులు అంటున్నారు. దిల్లీలో 61 శాత మంది తమ పిల్లల విద్య, పెళ్లిళ్లకు బీమా సాయపడుతుందని అంటున్నారు. 44 శాతం మంది సురక్షితంగా తమ పెట్టుబడి పెరుగుతుందని అన్నారు. 


ప్రీమియం తక్కువ: చాలామంది మొదట్లో ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వరు. కానీ స్టూడెంట్‌ లోన్స్‌ చెల్లించాని, కారు కొనాలి, ఏదైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటారు. అయితే జీవితంలోని ప్రధాన లక్ష్యాలను సాధించేందుకు జీవిత బీమా ఉపయోగపడుతుంది. వయసు పెరుగుతుంటూ ప్రీమియం పెరుగుతుంటుంది. అందుకే చిన్న వయసులోనే తీసుకుంటే పూర్తయ్యే వరకు తక్కువ ప్రీమియం చెల్లించొచ్చు.


సేవింగ్స్‌ అలవాటు: చిన్న వయసులోనే తీసుకోవడం వల్ల డబ్బు ఆదా చేసే అలవాటు పెరుగుతుంది. సేవింగ్స్‌ హ్యాబిట్‌ డెవలప్‌ అవుతుంది. దాంతో దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు ఈ అలవాటు ఉపయోగపడుతుంది. కాలం గడిచే కొద్దీ మీ పాలసీపై లోన్‌ తీసుకోవచ్చు. పాక్షికంగా కొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.


తర్వాత కొనలేకపోవచ్చు: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అంటేనే ఎమర్జెన్సీకి ఉపయోగపడేది. మీరు ఆలస్యం చేసే కొద్దీ, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల వల్ల ఇన్సూరెన్స్‌ కొనే అవకాశం కోల్పోవచ్చు. అలాంటి అనిశ్చిత పరిస్థితులకు సిద్ధమవ్వాలంటే మీరు ముందుగానే బీమా తీసుకోవడం మంచిది. చిన్న వయసులోనే బీమాలో ఇన్వెస్ట్‌ చేయడం అన్నది మంచి నిర్ణయం. దాంతో ఏ దశలోనైనా మీరు నిశ్చింతగా ఉండొచ్చు.


ఒక పద్ధతి ప్రకారం సుదీర్ఘ కాలం ఇన్వెస్ట్‌ చేయడం ఎంతో మంచిది. దీనివల్ల మీరు చక్కని వెల్త్‌ను క్రియేట్‌ చేస్తారు. మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టండి.


లైఫ్‌ఇన్సూరెన్స్‌గురించి తెలుసుకొనేందుకు sabsepehlelifeins.com క్లిక్‌చేయండి.


This is sponsered feature and provided by "Sabse pehle life insurance"