ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లిన భారత విద్యార్థులు యుద్ధం వేళ పడుతోన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రష్యా సైనికులు చేసిన షెల్లింగ్‌లో ఏకంగా ఓ భారత విద్యార్థి ప్రాణాలే కోల్పోయాడు. ఈ అవస్థలు చూసి చలించిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మించాలని తలపెట్టారు.
భారతీయులు ఎక్కువగా మెడిసన్ కోసం ఉక్రెయిన్‌కు వెళ్తుంటారు. ఇప్పుడు యుద్ధం జరుగుతోన్న వేళ అక్కడ చిక్కుకున్న మన దేశ విద్యార్థులను కేంద్రం స్వదేశానికి తీసుకువస్తోంది.
మహీంద్రా ముందడుగు
మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మించాలని మహీంద్రా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ మహీంద్రా యూనివర్సిటీ బాధ్యులకు సూచనలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.
ఈ మేరకు టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ట్యాగ్ చేసి ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహీంద్రా చేసిన ట్వీట్‌పై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఫీజులు కూడా అందరికీ అందుబాటులో ఉండాలని, కోట్లు వసూలు చేయొద్దని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దానికి ఆనంద్ 'నోటెడ్' అని రిప్లై ఇచ్చాడు.
హైదరాబాద్‌లోనే
అయితే ఇప్పుడు మహీంద్రా.. వైద్య కళాశాల ఎక్కడ పెడతారనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌లోనే ఉన్నందున వైద్య కళాశాల ఇక్కడే పెట్టే అవకాశం ఉంది.
Also Read: Russia Ukraine War: అలాంటిదేం లేదు, ఉక్రెయిన్‌లో మా విద్యార్థులు బందీలుగా లేరు: భారత్
Also Read: Russia Ukraine War: ఇది వాళ్ల టైం- బైడెన్‌ను చేతకానివాడిగా చూస్తున్నారు: ట్రంప్ షాకింగ్ కామెంట్స్