Largecap Bets: డొమెస్టిక్‌ బ్రోకరేజ్ కంపెనీ ప్రభుదాస్ లీలాధర్.. ఆటో, బ్యాంక్, కన్స్యూమర్ స్టేపుల్స్ వంటి వివిధ సెక్టార్లలోని కొన్ని లార్జ్‌ క్యాప్ స్టాక్స్‌ మీద పాజిటివ్‌ సెంటిమెంట్‌తో, బుల్లిష్‌గా ఉంది. ప్రభుదాస్ లీలాధర్ ఎంచుకున్న స్క్రిప్స్‌లో ICICI బ్యాంక్, SBI, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్‌), సైమెన్స్, టైటన్ ఉన్నాయి. ఈ లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ 33% వరకు ర్యాలీ చేయగలవని బ్రోకరేజ్‌ కంపెనీ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉంది.


ప్రభుదాస్ లీలాధర్ ఎంచుకున్న లార్జ్‌ క్యాప్ స్టాక్స్‌:


అవెన్యూ సూపర్‌మార్ట్స్   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 3,539
బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ స్టాక్‌ మీద "బయ్‌" రేటింగ్‌ కొనసాగించింది, రూ. 4,574 టార్గెట్ ప్రైస్‌ ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి ఈ షేర్లు మరో 29% అప్‌సైడ్ దూసుకెళ్లొచ్చన్నది ఈ టార్గెట్‌ ప్రైస్‌ అర్ధం. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,30,291 కోట్లు.


ఐసీఐసీఐ బ్యాంక్   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ 966
ఐసీఐసీఐ బ్యాంక్‌ మీద "బయ్‌" రేటింగ్‌తో రూ. 1,180 టార్గెట్ ధరను బ్రోకరేజ్‌ కంటిన్యూ చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి ఇది 22% పెరుగుదలను సూచిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.6,76,284 కోట్లు.


మారుతీ సుజుకి   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ. రూ. 9,598
మారుతి సుజుకిపై "బయ్‌" కాల్‌ను, రూ.11,100 టార్గెట్ ప్రైస్‌ను ప్రభుదాస్ లీలాధర్ కొనసాగించింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 16% అప్‌సైడ్‌కు ఇది గుర్తు. మారుతి సుజుకి మార్కెట్ క్యాప్‌ రూ.2,89,929 కోట్లు.


రిలయన్స్ ఇండస్ట్రీస్   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ. రూ. 2,523
బ్రోకరేజ్ సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై తన "బయ్‌" సిఫార్సును రూ. 2,822 టార్గెట్ ధరతో కొనసాగించింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 12% ర్యాలీకి అవకాశం ఉందని ఈ టార్గెట్‌ ప్రైస్‌ చెబుతోంది. RIL మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,07,067 కోట్లు.


సైమెన్స్   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ. రూ. 3,713
ప్రభుదాస్ లీలాధర్, సైమెన్స్‌ స్టాక్‌కు "అక్యుములేట్" రేటింగ్‌ ఇచ్చింది, రూ.4,241 ప్రైస్‌ టార్గెట్‌ను కంటిన్యూ చేసింది. ఇది ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 14% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను సూచిస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.1,32,234 కోట్లు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా   |      ప్రస్తుతం షేర్‌ ధర: రూ. రూ. 577
ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు కూడా "బయ్‌" కాల్‌ను, రూ.770 టార్గెట్ ధరను బ్రోకరేజ్‌ కంపెనీ కొనసాగించింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి ఈ స్టాక్‌ 33% పెరగొచ్చన్నది ఈ ప్రైస్‌ టార్గెట్‌ అర్ధం. ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్‌ రూ.5,14,861 కోట్లు.


టైటన్   |   ప్రస్తుతం షేర్‌ ధర: రూ. రూ. 3,069
టాటా గ్రూప్‌నకు చెందిన టైటన్‌ షేర్లకు "అక్యుములేట్" సిఫార్సు, 3,300 రూపాయల ప్రైస్‌ టార్గెట్‌తో ఈ స్టాక్‌ను ప్రభుదాస్ లీలాధర్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. డౌన్‌గ్రేడ్‌ చేసినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి టైటన్‌ షేర్లు 7% పెరగొచ్చని చెబుతోంది. టైటన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,72,515 కోట్లు.


మరో ఆసక్తికర కథనం: పేరుకే స్మాల్‌ బ్యాంక్‌, వడ్డీని లార్జ్‌ సైజ్‌లో ఇస్తోంది - ఎఫ్‌డీ మీద 9% ఇంట్రెస్ట్‌ రేట్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial