కొంత కాలంగా రోజూ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు దాదాపు 50 పైసలు పెరిగాయి. హైదరాబాద్‌లో ఈ రోజు(శనివారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.0.31 పైసలు పెరిగి రూ.107.71 అయింది. డీజిల్ ధర కూజా సెంచరీ దాటి కొనసాగుతోంది ప్రస్తుతం ధర రూ.100.51కి చేరింది. వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.51 పైసలు పెరిగి రూ.107.40గా ఉంది. డీజిల్ ధర రూ.0.55 పైసలు పెరిగి రూ. 100.22గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న ధరలు నిన్న,ఈ రోజ పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా కొనసాగుతున్న వెండి, ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం-వెండి ధరిలివే...
కరీంనగర్‌లో పెట్రోల్ ధర నిన్న రూ.0.16 పైసలు తగ్గినా ఈ రోజు ( శనివారం) మళ్లీ రూ.0.50 పెరిగి రూ.107.88గా ఉంది. డీజిల్ ధర రూ.0.60 పైసలు పెరిగి రూ.100.66కు చేరింది. నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.80 పైసలు పెరిగి రూ.109.79 గా ఉంది. డీజిల్ ధర రూ.0.90 పైసలు పెరిగి రూ.102.45 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా అతి స్వల్పంగా పెరిగి రూ.109.70 గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు తగ్గి రూ.101.74కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
Also Read: ఈ రాశుల వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు..వారు అప్రమత్తంగా ఉండాలి, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.108.29గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.30 పైసలు పెరిగింది. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ఈ రోజు (శనివారం) రూ.108.93గా ఉంది. నిన్నటికి రూ.0.30 పెరిగిన ధర ఈ రోజు మరో రూ.0.70 పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.101.18గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఇంధన ధరలు కొద్ది రోజులుగా రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 8 నాటి ధరల ప్రకారం 76.38 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి