దేశంలో హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో సిటీల్లో పెట్రోల్ ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటున్నాయి. డీజిల్ రేట్ల విషయంలో కూడా ఇలాగే స్థిరత్వం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఆగస్టు 5న రూ.105.83 గా, డీజిల్ ధర రూ.97.96 గానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో గత 20 రోజులుగా ఇవే ధరలు ఉంటున్నాయి. తిరుపతిలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రూపాయికి పైగా పెరిగాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు తాజాగా ఇలా ఉన్నాయి.


తెలంగాణలో ఆగస్టు 5న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 గా స్థిరంగా ఉంటోంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.105.99, డీజిల్ ధర రూ.98.09 వద్ద ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్ ధర 0.41 పైసలు, డీజిల్ ధర రూ.0.37 పైసలు పెరిగింది.


ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా స్థిరంగానే ఉంది. ముందు రోజు ధరతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు ఉన్నాయి.


నిజామాబాద్‌లో డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.12 పైసలు తగ్గి రూ.99.17 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.13 పైసలు తగ్గి రూ.107.14 గా ఉంది. నిజామాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


ఏపీలో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.51 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.108.13 గా ఉంది. డీజిల్ ధర రూ.0.45 పైసలు తగ్గి రూ.99.72కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత 10 రోజుల ఇంధన ధరల్లో స్వల్పంగా హెచ్చు తగ్గులు ఉంటూ వస్తున్నాయి.


విశాఖపట్నంలో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.11గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.31 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.31 పైసలు పెరిగి రూ.98.71గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసల పైబడి హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


తిరుపతిలో ఇంధన ధరల్లో పెరుగుదల కాస్త ఎక్కువగానే ఉంది. లీటరు పెట్రోలు ధర రూ.1.13 పైసలు తగ్గి రూ.109.17 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర ఏకంగా రూ.0.99 పైసలు పెరిగి రూ.100.59కు చేరింది.


Also Read: Gold-Silver Price: స్థిరంగా బంగారం ధర, వెండి మాత్రం పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇలా..


స్థానిక పన్నుల పెంపు వల్లే ధరల పెరుగుదల..
గత ఏడాది కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సామాన్యులపై విపరీతంగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరిగాయి. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచడంతో ఇంధన ధరలు తగ్గలేదు. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 5 నాటి ధరల ప్రకారం 68.36 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నాయి.