Petrol-Diesel Price, 2 September: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందన్న భయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో డిమాండ్‌ క్షీణత కొనసాగుతోంది. చైనాలోని మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా లాక్‌డౌన్లు విధించడంతోపాటు వివిధ దేశాల్లో వడ్డీ రేట్ల పెంపు, అనేక దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటివి చమురు డిమాండ్‌ను తగ్గించాయి. దీంతో, ఇవాళ కూడా బ్యారెల్‌ ఆయిల్‌ ధర 1.23 డాలర్లు తగ్గి 88.34 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.40 డాలర్లు తగ్గి 94.25 డాలర్లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు తగ్గుతున్నా, అన్ని దేశాలు ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇప్పటికీ దాదాపు 100 డాలర్లకు అటుఇటుగా కదులుతోంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే మన దేశానికి ఇది ఆందోళనకర అంశం.


అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గడం లేదు. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ధరలు బాగానే పెరిగాయి.


తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)


హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (గురువారం) పోలిస్తే ఇవాళ (శుక్రవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ఇంధన ధరలు కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో లీటరు పెట్రోల్ ధర నేడు ₹ 109.10 గా ఉంది. లీటరు డీజిల్ ధర ₹ 97.29 వద్ద నిలకడగా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.32 గా ఉండగా, ఇవాళ 17 పైసలు తగ్గి ₹ 109.15 కి దిగివచ్చింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా, ఇవాళ ₹ 97.33 కు తగ్గింది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.08, ఇవాళ 41 పైసలు పెరిగి ₹ 111.49 వద్దకు చేరింది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.14 గా ఉండగా, ఇవాళ ₹ 99.52 కు పెరిగింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.64 గా ఉండగా, ఇవాళ 47 పైసలు పెరిగి ₹ 110.11 కి చేరింది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.78 కాగా, ఇవాళ ₹ 98.22 కి తగ్గింది. 
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.78 గా ఉండగా, ఇవాళ 12 పైసలు పెరిగి ₹ 109.90 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.92 గా ఉండగా ఇవాళ ₹ 98.04 కి పెరిగింది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.90 గా ఉండగా, ఇవాళ 58 పైసలు తగ్గి ₹ 111.32 వద్దకు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.90 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.36 కు తగ్గింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)


విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్నటి (గురువారం) ₹ 111.30 నుంచి 78 పైసలు పెరిగి ఇవాళ (శుక్రవారం) ₹ 112.08 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.08 గా ఉండగా, ఇవాళ ₹ 99.81 కు పెరిగింది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 111.78 నుంచి 8 పైసలు పెరిగి ఇవాళ ₹ 111.86 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.51 గా ఉండగా, ఇవాళ ₹ 99.58 కి పెరిగింది. 
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్నటి ₹ 112.79 నుంచి ఏకంగా 97 పైసలు తగ్గి ₹ 111.82 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 100.44 గా ఉండగా, ఇవాళ ₹ 99.55 కు తగ్గింది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.82 కంటే ఇవాళ 24 పైసలు పెరిగి ₹ 111.06 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.59 గా ఉండగా, ఇవాళ ₹ 98.81 కు పెరిగింది.
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 111.96 నుంచి 63 పైసలు తగ్గి ఇవాళ ₹ 111.33 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.64 గా ఉండగా, ఇవాళ ₹ 99.09 కు తగ్గింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112.27 గా ఉంటే ఇవాళ 32 పైసలు తగ్గి ₹ 111.95 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.96 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 99.96 వద్దే ఉంది. 
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.71 గా ఉంటే, ఇవాళ 5 పైసలు తగ్గి ₹ 111.66 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.44 గా ఉండగా, ఇవాళ ₹ 99.42 కు తగ్గింది.