గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం(సెప్టెంబర్ 17) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు, తెలంగాణలో తగ్గాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.80గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.27గా ఉండగా, డీజిల్ ధర రూ. 96.68గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.80గా ఉండగా డీజిల్ ధర రూ.97.20గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.27, డీజిల్ ధర రూ.96.70గా ఉంది.
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.90, లీటర్ డీజిల్ ధర రూ.98.80 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.79 ఉండగా డీజిల్ ధర రూ. 97.72గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.97గా ఉండగా డీజిల్ ధర రూ.97.94గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.90, డీజిల్ ధర రూ.98.80 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.108.15, డీజిల్ ధర రూ.98.98 వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా డీజిల్ ధర రూ.93.26లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది.