2021 సెప్టెంబరు 17 శుక్రవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు మీరు శుభవార్త వింటారు. చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. కొత్త పని కోసం ప్రణాళికలు రూపొందించుకోవడానికి మంచి రోజు. శారీరకంగా అలసిపోతారు..మానసిక గందరగోళం పెరుగుతుంది. అనవసర ఖర్చులుంటాయి ఎవరితోనూ వివాదాలు వద్దు. ప్రయాణాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. విద్యార్థులు సంతోషంగా ఉంటారు.
వృషభం
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులను రక్షించండి. మాట మీద సంయమనం ఉండాలి. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో నిరాశపరిచే ఫలితాలు ఉంటాయి. విద్యార్థులను కొన్ని సమస్యలు వెంటాడుతాయి. పెద్దలను సంప్రదించిన తర్వాత కొత్త పనిని ప్రారంభించండి. మానసికంగా,శారీరకంగా చాలా అలసిపోతారు.
మిథునం
ఈ రోజు ఉద్యోగస్తులకు శుభసమయం. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన పని ప్రారంభించవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఇంటి పెద్దలకు సేవ చేయండి. శుభవార్త వింటారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. యువత పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి
ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆహారం విషయంలో అజాగ్రత్త వద్దు. ప్రయాణాలను వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. మీ దినచర్యను మార్చుకోండి. ఆశించిన ఫలితాలు పొందే అవకాశం కనిపించడం లేదు. విద్యార్థులకు మంచి రోజు..పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మాటతీరు మార్చుకోకుంటే వివాదాలు తలెత్తుతాయి.
Also Read: శశిథరూర్‌పై రేవంత్ లూజ్ టాక్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !
సింహం
ఆస్తికి సంబంధించిన విషయాల్లో సయోధ్య కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు దిశగా అడుగులేస్తారు. ఉద్యోగస్తులు మంచి సమాచారం పొందుతారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున చేసే పని ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. కుటుంబంలోని వృద్ధులకు సేవ చేయాలి. శరీర నొప్పులతో బాధపడవచ్చు.
కన్య
కన్య రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సాధ్యమైన మద్దతు లభిస్తుంది. ఖర్చులు నియంత్రించండి. ఆర్థికంగా నష్టపోవచ్చు. ఇతరులలో లోపాలు వెతకడంలో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వైవాహిక జీవితం బాగుంటుంది. అకస్మాత్తుగా మీరు ప్రయాణం చేయాల్సి రావచ్చు. వ్యాపారులకు శుభ సమయం.
తులారాశి
ఈరోజు మంచి రోజు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈ రోజు మీరు మరింత అలసిపోయినట్లు భావిస్తారు. మొండితనం వీడండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. మీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దు. స్నేహితుడు లేదా బంధువుల నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబంతో మంచి సమయం గడపండి. విద్యార్థుల సమస్యలు తొలగిపోతాయి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.
వృశ్చికరాశి
పనికిరాని విషయాలతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. సహోద్యోగులతో అనవసర వాదనలు ఉండొచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామితో మధురానుభూతి ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. శుభవార్త వింటారు. మీరు చేసే ప్రతిపనిలోనూ ఇంటి పెద్దల మద్దతు ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేయొద్దు.
Alsకోహ్లీకి పొగపెట్టారా? ఎందుకు దిగిపోవాలనుకున్నాడు? కారణాలేంటి?o Read:
ధనుస్సు
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రత సాధించలేరు. కుటుంబంతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించవచ్చు. కొన్ని మంచి పనులకు డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. తెలియని వ్యక్తులతో ఎక్కువ చర్చలు వద్దు.
మకరం
ఈ రోజంతా బద్ధకంగా ఉంటారు. కోపాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించండి. స్నేహితులను కలుస్తారు. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు. టెన్షన్ తగ్గుతుంది. అదనపు ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు మంచి రోజు. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. స్నేహితుడితో విభేదాలు ఉండొచ్చు. రిస్క్ తీసుకోకండి.
కుంభం
వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆశించిన విధంగా ఫలితాలు పొందలేరు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు రుణం తీసుకోవచ్చు. భాగస్వాములతో సామరస్యం ఉంటుంది. పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీనం
మీ ఒత్తిడి దూరమవుతుంది. మతపరమైన కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. స్నేహితుడితో తాగాదా సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందలేరు. చదువుపై దృష్టి సారించలేరు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోకండి. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలు ఉంటాయి.
Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ.11 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా!