రియల్‌మీ సీ25వై స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ సీ-సిరీస్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన మొదటి ఫోన్ ఇదే. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్‌తో ఈ ఫోన్ పోటీ పడనుంది.


రియల్‌మీ సీ25వై ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా నిర్ణయించారు. గ్లేసియర్ బ్లూ, మెటల్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, రిటైల్ అవుట్‌లెట్లలో సెప్టెంబర్ 27వ తేదీన దీని సేల్ జరగనుంది.


రియల్‌మీ సీ25వై స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ ఆర్ ఎడిషన్ ఇంటర్‌ఫేస్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను ఇందులో అందించారు. 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉండనున్నాయి. ఏఐ బ్యూటీ, హెచ్‌డీఆర్ మోడ్, పనోరమిక్ వ్యూ, పొర్‌ట్రెయిట్, టైమ్‌ల్యాప్స్, ఎక్స్‌పర్ట్, ప్రీలోడెడ్ ఫిల్టర్లు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఏఐ బ్యూటీ ఫీచర్‌ను ఇందులో ఉంది.


5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉండనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉండనున్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని మందం 0.91 సెంటీమీటర్లుగానూ, బరువు 200 గ్రాములుగానూ ఉంది.


Also Read: Google Pixel 6: ఒకేఫోన్‌లో 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. గూగుల్ సూపర్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!


Also Read: PUBG New State: పబ్జీ కొత్త గేమ్ వచ్చేస్తుంది.. ఇంకా మెరుగైన గ్రాఫిక్స్, అదిరిపోయే గేమ్‌ప్లే!


Also Read: Realme Vs Redmi: రియల్‌మీ 8ఐ వర్సెస్ రెడ్‌మీ 10 ప్రైమ్.. రూ.15 వేలలో బెస్ట్ ఫోన్ ఇదే!