Petrol-Diesel Price, 06 November 2021: ఉప ఎన్నికల ఫలితాల ప్రభావమో, లేక కొన్ని రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయనే ముందుచూపుతోనే గానీ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించి వాహనదారులకు ఊరట కలిగించింది. గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా దిగొచ్చాయి. తాజాగా కొన్ని నగరాల్లో ధరలలో వ్యత్యాసం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర రూ. 103.97 అయింది. డీజిల్ లీటర్ ధర రూ.86.67కు దిగొచ్చింది. 


కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్‌లో ఇంధన ధరలు తగ్గాయి. నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 అయింది. డీజిల్ ధర లీటరుకు 12 రూపాయలు తగ్గడంతో రూ.94.62గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.107.69 అయింది. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపుగా ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


Also Read: బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా


కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.15 పైసలు తగ్గి.. రూ.108.34 అయింది. డీజిల్ ధర రూ.0.14 పైసలు తగ్గి రూ.107.56 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.58 పైసలు తగ్గడంతో రూ.109.53 కి దిగొచ్చింది. డీజిల్ ధర రూ.0.54 పైసలు తగ్గడంతో రూ.95.85 అయింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఏపీలోని విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర  తాజాగా పెరిగాయి. పెట్రోల్ పై 0.61 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.54 పైసలు తగ్గి రూ.96.44కి దిగొచ్చింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.


విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.27 పైసల చొప్పున పెరిగింది. లీటర్ ధర ప్రస్తుతం రూ.109.32గా ఉంది. డీజిల్ ధర 25 పైసల చొప్పున పెరగడంతో విశాఖపట్నంలో లీటర్ ధర రూ.95.43గా ఉంది. తిరుపతిలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.1.09 పైసలు తగ్గడంతో రూ.110.44 అయింది. ఇక డీజిల్ ధర రూ.109.76గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.98 పైసలు తగ్గింది. అనంతపురంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.99 కాగా, లీటర్ డీజిల్ ధర 108.64కు చేరింది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి